Prema Entha Madhuram August 17th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: అనుకు వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవ, ఆర్యకు కాల్ చేసిన అను?
ఛాయాదేవి అనుకి ఎదురుపడి ఆర్య విషయంలో బెదిరించడంతో సీరియల్ ఆసక్తిగా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
![Prema Entha Madhuram August 17th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: అనుకు వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవ, ఆర్యకు కాల్ చేసిన అను? Anu called Arya for chayadevi in Prema Entha Madhuram August 17th eposide Prema Entha Madhuram August 17th: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: అనుకు వార్నింగ్ ఇచ్చిన ఛాయాదేవ, ఆర్యకు కాల్ చేసిన అను?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/17/f99932dda0bfb42ce2e30e17c1402ad71692242331360768_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prema Entha Madhuram August 17th: అను నిద్రపోగా తనకు బాబును ఎత్తుకెళ్లిన దృశ్యం, ఛాయదేవి మాట్లాడిన మాటలు కలలోకి రావడంతో గట్టిగా నో అని అరిచి లెగుస్తుంది. అప్పుడే ప్రీతివాళ్ళు ఏం జరిగింది అని అనటంతో ఆర్య సర్, పిల్లలు అని భయపడుతుంది. దాంతో ఏమీ కాదు అని ధైర్యంగా ఉండమని ఆర్య సార్ ఉండగా నీకు ఏమి జరగదు అని అంటారు. కానీ తను ఆర్యకు ఏం జరుగుతుందో అని భయపడుతుంది.
ఇక ప్రీతి, రేష్మ ఆర్య సార్ కి ఏమి జరగదు అని ఓదార్చుతారు. ఇక తను భోజనం చేయలేదు అని రేష్మ తనకు తినిపిస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆర్య వాళ్ళు మీటింగ్ లో ఉంటారు. ఆ సమయంలో నీరజ్ సెంట్రల్ నుండి వచ్చిన ఒక ప్రాజెక్టు గురించి చెప్పి దానికి మనమే టెండర్ వేయాలి అని అంటాడు. దాంతో ఆర్య కూడా ఒప్పుకుంటాడు. ఇక ఆ టెండర్ గురించి మాట్లాడుతూ ఉండగా ఆర్య కు ఛాయాదేవి ఫోన్ చేస్తుంది.
ఇక ఛాయాదేవి ఏదో మీటింగ్ లో ఉన్నట్లున్నారు అని పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. సెంట్రల్ నుంచి వచ్చిన ప్రాజెక్టుకు మీరు టెండర్ వెయ్యొద్దు అని బెదిరిస్తుంది. ఇది నా రిక్వెస్ట్ కాదు ఆర్డర్ అని చెబుతుంది. కానీ ఆర్య మాత్రం తన మాటలకు భయపడడు. కానీ ఛాయాదేవి మాత్రం ఆ ప్రాజెక్టుకి నువ్వు టెండర్ వేసి గెలిస్తే నీ భార్య పిల్లలు నీకు దక్కరు అని వాళ్లు ప్రాణాలతో ఉండరు అని బెదిరిస్తుంది.
అంతేకాకుండా నీకు ఒక ఫోటో పంపాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఆ ఫోటో చూసి ఆర్య షాక్ అవుతాడు. అందులో అను బాబుని ఎత్తుకొని ఉంటుంది. ఇక ఆర్య జిండే వాళ్ళతో ఛాయాదేవి అనుని అడ్డుపెట్టుకొని టెండర్ వెయ్యొద్దు అని బెదిరిస్తుంది అని అంటాడు. అయితే తనకు అను ఎక్కడ ఉందో ఎలా తెలుసు అని నీరజ్ అడగటంతో.. మదన్ ద్వారానే ఈ విషయం తెలియవచ్చు అని.. గతంలో మదన్ కు ఆర్య కనిపించింది కాబట్టి ఖచ్చితంగా అతడే చెబుతాడు అని అంటాడు.
దీంతో అంజలి కోపంగా మదన్ గురించి అమ్మ వాళ్లకు చెబుతాను అని అనటంతో.. చెప్పిన ఎటువంటి ఉపయోగం ఉండదని ఇప్పుడు తను చాలా బలంగా ఉన్నాడు అని అంటాడు. ఇక అందరూ మనకు అను ముఖ్యం కాబట్టి ప్రాజెక్టు వదిలేసుకోమని అంటారు. కానీ ఆర్య పిల్లల భవిష్యత్తు కదా అని ఆలోచిస్తాడు. ఇక ఏం చేయాలా అని ఆర్య మళ్ళీ ఆలోచనలో పడతాడు.
మరోవైపు అను, రేష్మ పిల్లల్ని తీసుకొని ఆటోలో బయలుదేరుతూ ఉండగా వారి ఆటోకి ఛాయాదేవి ఎదురు పడుతుంది. ఇక ఛాయాదేవిని చూసి అను షాక్ అవుతుంది. ఇక తన దగ్గరికి వెళ్లి అను మొదట కాస్త పొగరుగానే మాట్లాడుతుంది. కానీ తను టెండర్ విషయం చెబుతుంది. ఆ టెండర్ ఆర్య దక్కించుకుంటే నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా.. ఈసారి నీ పిల్లల్ని మళ్ళీ కిడ్నాప్ చేయించి ఏకంగా ప్రాణాలు తీస్తానని బెదిరిస్తుంది.
దాంతో అను షాక్ అవుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత అను ఛాయాదేవి మాట్లాడిన మాటలు తలుచుకుంటూ భయపడుతుంది. ఎలాగైనా ఈ విషయం ఆర్య సార్ కి చెప్పి టెండర్ వెయ్యద్దు అని చెప్పాలి అని అనుకుంటుంది. కొత్త సిమ్ తీసుకొని కాల్ చేస్తే తను ఎక్కడ ఉన్నానో తెలిసిపోతుంది అని.. తన ఫోన్ నుండే అనులాగా మెసేజ్ పెడుతుంది.
ఆ ఛాయాదేవి జోలికి వెళ్ళకూడదు అని.. ఆ టెండర్ ను వేయకూడదు అని.. టెండర్ వేస్తే మన పిల్లలను తను ఏదైనా చేస్తుంది అని టైప్ చేసి మళ్లీ క్యాన్సల్ చేస్తుంది. ఇలా మెసేజ్ పెట్టి ఆర్య సార్ ను పిరికివాడిగా చేస్తున్నానేమో అని వద్దు అనుకుంటుంది. ఇక ఆ మెసేజ్ కట్ చేస్తూ ఉండగా ఆర్య కు ఫోన్ కలుస్తుంది. వెంటనే ఫోన్ కట్ చేసేలోపు ఆర్య ఫోన్ కు మిస్డ్ కాల్ పడుతుంది. అప్పుడే ఆర్య తన గదిలో ఉండగా ఫోన్ పట్టుకొని చూస్తాడు.
also read it : Janaki Kalaganaledhu August 16th: తన మాటలతో మరిదిలకు జ్ఞానోదయం చేసిన జానకి.. కొడుకుల నిర్ణయానికి సంతోషంగా ఉన్న గోవిందరాజు దంపతులు?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)