Prema Entha Madhuram July 6th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: అనుని హగ్ చేసుకున్న అంజలి, నిజం తెలుసుకొని నిప్పు పెట్టే ప్లాన్ లో ఉన్న మాన్సీ?
వసుంధర కూతురు, అల్లుడుకు రిసెప్షన్ ఏర్పాటు చేయడంతో అక్కడ అను కూడా ఉండటం వల్ల సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Prema Entha Madhuram July 6th: జంట బాగున్నారు అని రేష్మ అనటంతో వెంటనే అను ఆ ఫోటోలను చూసి షాక్ అవుతుంది. అంటే వసుంధర అంజలి వాళ్ళ అమ్మ అని.. ఇప్పుడు ఆర్య వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు అని భయపడుతుంది. ఇక మిగతా ఏర్పాట్లు చూడమని ప్రీతి చెప్పటంతో వెంటనే అక్కడ్నుంచి వెళ్లిపోవాలని పిల్లల దగ్గరికి వెళ్తున్నానని చెబుతుంది.
కానీ అప్పుడే ఆర్య వాళ్లంతా ఎదురుపడటంతో షాక్ అవుతుంది. అంజలి బయట ఆ డెకరేషన్ అంత చూసి తన తల్లి గెట్ టుగెదర్ ప్లాన్ చేసిందేమో అని ఇదే సర్ప్రైజ్ ఏమో అని అంటుంది. ఇక ఆ తర్వాత అందరూ అను ముందర నుంచి లోపలికి వెళ్తారు. కానీ అను బుర్కాలో ఉండటం వల్ల ఎవరు గుర్తుపట్టరు. ఇక అను ఇక్కడ ఉండాలా వెళ్లిపోవాలా అని.. ఈవెంట్ తన చేతుల మీద గానే జరగాలి అని.. ఎలాగైనా కుటుంబంతో చేసుకోలేను కాబట్టి ఇలా ఉండి ఈ వేడుకను చూసుకోవాలి అని అనుకుంటుంది.
మరోవైపు ఆర్య వాళ్ళ ఇంట్లో పని చేసే అమ్మాయిని పట్టుకొని నిజం ఎందుకు చెప్పటం లేదు అని గట్టిగా నిలదీస్తుంది మాన్సీ. ఒక హాస్పిటల్లో ఉన్న నీ తండ్రిని చంపేస్తాను అని బెదిరించడంతో వెంటనే ఆమె.. అంజలి వాళ్ళ అమ్మగారు అమెరికా నుంచి వచ్చారని.. దాంతో గెస్ట్ హౌస్ లో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు అని చెప్పటంతో వెంటనే మాన్సీ గెస్ట్ హౌస్ లో గెట్ టుగెదర్.. ఎలా జరుగుతుందో చూస్తాను అని నిప్పు పెట్టే ప్లాన్ చేయనున్నట్లు అర్థమవుతుంది.
అంజలి తన తల్లిని పట్టుకొని మిస్ అయ్యాను అని చెబుతుంది. వెంటనే వసుంధర నీరజ్ ను చూసి అల్లుడుగారు అనడంతో వెంటనే నీరజ్ ఆమె బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. నైస్ కపుల్ అంటూ వారిని పొగుడుతుంది వసుంధర. ఆ తర్వాత శారదమ్మను పరిచయం చేస్తుంది. ఇక వసుంధర తమ కూతురు చాలా అల్లరి చేస్తుందని మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతుందా అనటంతో.. అటువంటిదేమీ లేదు మమ్మల్ని బాగా చూసుకుంటుంది అని అంటారు.
ఇక అంజలి కూడా తన అత్త శారదమ్మ బాగా చూసుకుంటుంది అని అంటుంది. అక్కడ పరిచయాలన్ని పూర్తయ్యాక తను చేసిన రిసెప్షన్ ప్లాన్ గురించి చెబుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. గెట్ టుగెదర్ అని రిసెప్షన్ ఏంటి అని అంజలి అడగటంతో.. మీ పెళ్లిచూడనందుకు ఏదైనా చేయాలని అనుకున్నాను అని అంటుంది. అప్పటికే చెబుతున్నాను కానీ పిన్ని వినిపించుకోలేదని.. తనకు బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చింది అని అనటంతో అంజలి షాక్ అవుతుంది.
ఇక వసుంధర ఏ పర్వాలేదు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. భాను అనే ఒక అమ్మాయి వచ్చి తనను కాపాడింది అని చెబుతుంది. ఈవెంట్ కూడా త్వరగా అవుతుందో లేదో అనుకున్నాను కానీ.. అను గురించి చెబుతూ ఇదంతా చేసింది అని.. తనను కాపాడింది కూడా తనే అని చెప్పటంతో వెంటనే అంజలి తనను పిలువమని అంటుంది. ఇక వసుంధర భానుని పిలవటంతో రేష్మ అను ని బలవంతంగా తీసుకొని వెళుతుంది.
వెంటనే అంజలి అనుని హగ్ చేసుకుంటుంది. తన తల్లిని కాపాడినందుకు థాంక్స్ చెబుతుంది. ఇక అను తరపున రేష్మ మాట్లాడి అనుని అక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఇక జెండే గురించి కూడా పరిచయం చేస్తుంది. అవును చెప్పావు కదా వాళ్ళిద్దరూ రామ,లక్ష్మణుడు అయితే ఈయన హనుమంతుడు అని అంటుంది వసుంధర. మరి సీత ఎక్కడ అని అడగటంతో వర్క్ గురించి బెంగళూరుకు వెళ్ళింది అని అబద్ధం చెప్పి కవర్ చేస్తారు. ఇందులో సూర్పనక్క ఏమీ లేదు కదా అని అనటంతో అందరూ షాక్ అవుతారు.
దాంతో సరదాగా అన్నాను అని ఇక మీ కోసం బట్టలు తెచ్చాను మార్చుకోండని వసుంధర చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. వెంటనే అంజలి తన అన్నయ్యతో ఈ రిసెప్షన్ గురించి ఎందుకు చెప్పలేదు అని కోప్పడుతుంది. ఇక టెన్షన్ పడకండి అని జెండే అనడంతో.. నా టెన్షన్ అంత ఆ మాన్సీ వచ్చి ఏం చేస్తుందో అని అనటంతో ఆర్య ధైర్యం ఇస్తాడు. వసుంధర గారు తన సంతోషం కోసం ఈ రిసెప్షన్ చేస్తుంది. కాబట్టి మనం కూడా సంతోషంగా ఉన్నట్లు కనిపించాలి అని అంటాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial