Rangula Ratnam July 5th: ‘రంగులరాట్నం’ సీరియల్: తల్లి, చెల్లి పరిస్థితి చూసి కుమిలిపోతున్న రఘు, సిద్దుపై కోప్పడిన పూర్ణ?
ఒకవైపు తల్లి, మరోవైపు చెల్లిని పరిస్థితి చూసి రఘు కుమిలిపోతూ ఉండటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Rangula Ratnam July 5th: రేఖ ప్రసాద్ ను తన మాటలతో మరింత రెచ్చగొడుతుంది. అంతేకాకుండా బ్లైండ్ స్టిక్ కూడా తీసుకొని వచ్చి అవమాన పరుస్తుంది. సిద్ధుని కూడా ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన విషయం చెప్పడంతో ప్రసాద్ కు బాగా కోపం వస్తుంది. నీకు అదే చేత్తో అడుక్కుతిను తీసుకొని ప్రసాద్ ఆ స్టిక్ తీసుకొని తనపై విసిరేస్తాడు. మరోవైపు వర్షకు తన భర్త జ్యూస్ కనిపిస్తే తాపిస్తూ ఉంటాడు.
అప్పుడే జానకి దంపతులు వచ్చి వర్ష పరిస్థితి చూసి బాధపడుతూ ఉంటారు. చిన్న వయసులోని దేవుడు నిన్ను బాధ పెడుతున్నాడు అని సత్యం ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ ఆకాష్ ను మందులు తీసుకొని రమ్మనడంతో ఆకాష్ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక జానకి అత్తారింట్లో ఎన్నో కష్టాలు పడి వాళ్ళని మార్చుకున్నావు అని అమ్మ నాన్నల సహాయం కూడా కాదనుకున్నావు అని మాట్లాడుతూ ఉంటారు.
ఆ తర్వాత గతంలో వర్ష తాకట్టు పెట్టిన మంగళసూత్రాన్ని జరిగిన విషయం చెబుతాడు సత్యం. ఇక అప్పుడే ఆకాష్ రావటంతో వర్ష పరిస్థితి గురించి చెప్పుకుంటూ తను లేకుంటే ఇప్పుడు ఎలా ఉండాలి అని ఏడుస్తూ ఉంటాడు. సిద్దు హాస్పిటల్ కి వెళ్లి తన తల్లిది, తనది డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయా అని అడగటంతో మ్యాచ్ అయ్యాయని కానీ మీరే డబ్బులు ఇచ్చి మ్యాచ్ కాలేదని చేయమన్నారు కదా అని అంటాడు.
ఇక రిపోర్ట్ లు మార్చినందుకు మీ అన్న రఘు వచ్చి బాగా కొట్టాడు అని కూడా చెబుతాడు. నాది మా అమ్మది రిపోర్టులు మ్యాచ్ అయ్యాయా అనడంతో.. మ్యాచ్ అయ్యాయి రిపోర్టు కూడా ఇక్కడే ఉన్నాయని ఇస్తాడు. దానితో సిద్దు తన తల్లిని బాధ పెట్టినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక రఘు బాధపడుతూ ఉండగా సీత వచ్చి ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
ఒకవైపు చెల్లి పరిస్థితి ఇలా ఉంది.. ఈ విషయాన్ని అమ్మకు ఎలా చెప్పాలి.. ఇప్పుడే తను నాన్న విషయంలో చాలా బాధలు పడుతుంది.. అని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఈ విషయం అత్తయ్య కు చెప్పాలి. రేపు ఏదైనా జరిగాక ఆఖరి చూపు కూడా చూసుకోలేదు అని బాధపడుతుందని అంటుంది. కానీ ఎలా చెప్పను అని బాధపడుతుంటాడు రఘు.
తరువాయి భాగంలో సిద్దు హాస్పిటల్ కి రావడంతో వెంటనే సిద్ధుని ఇక్కడికి ఎందుకు వచ్చావు అని పక్కకు లాక్కొని తీసుకొని వెళుతుంది పూర్ణ. ఇక సిద్దు అమ్మ అని అనటంతో.. ఇప్పుడు అమ్మ గుర్తుకు వచ్చిందా అంటూ కోపడుతుంది. తల్లిని ఒక పని మనిషి లాగా చూసావు కదా.. ఏ కొడుకు కూడా తల్లిని ఇంతలా బాధపెట్టడు అని.. కానీ నువ్వు నన్ను చాలా బాధ పెట్టావు అని అంటుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial