Anchor Lasya: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన యాంకర్ లాస్య - ఇదిగో వీడియో
యాంకర్ లాస్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
రెండోసారి గర్భం దాల్చిన లాస్య.. ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పేసింది. మంగళవారమే బిడ్డను ప్రసవించినా.. ఆ విషయాన్ని బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. హోలీ నేపథ్యంలో రంగుల ద్వారా తనకు పుట్టిన ఆడ, మగా అనేది రివీల్ చేసింది. తనకు మగ బిడ్డ పుట్టాడని వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ విషయం తెలిసిన అభిమానులు లాస్య, మంజునాథ్‌లకు శుభాకాంక్షలు చెబుతున్నారు. బిడ్డను, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని సలహాలు ఇస్తూ కంగ్రాట్స్ చెప్తున్నారు. లాస్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. యూట్యూబ్ లో తను చేసే వీడియోలు బాగా ట్రెండ్ అవుతాయి. రీల్స్, షార్ట్స్ చేస్తూ చాలా బిజీ బిజీగా గడుపుతూ ఉంటుంది. తనతో పాటు తన భర్తని కూడా సెలబ్రెటీని చేసేసింది. మంజునాథ్ తో కలిసి వీడియోస్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. లాస్యాకు ఇప్పటికే ఒక మగ బిడ్డ ఉన్నాడు.
View this post on Instagram
బుల్లితెరపై అతి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్న యాంకర్లలో లాస్య ఒకరు. మాటకారితనం, అమాయకత్వం చిలిపి అల్లరితో అందరి దృష్టిని త్వరగా ఆకర్షించింది. మరో యాంకర్ రవితో కలిసి.. ఆమె చేసే అల్లరి కోసమే కొంతమంది టీవీ షోస్ చూసేవాళ్ళు. చీమ, ఏనుగు జోకులు అంటూ.. రవి బుర్ర తింటూ అందరినీ బాగా ఎంటర్‌టైన్ చేసేది. మనస్పర్థలు రావడంతో రవి, లాస్య.. కలిసి టీవీ షోస్ చేయడం మానేశారు. తర్వాత లాస్య జోరు కాస్త తగ్గింది. మంజునాథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత.. లాస్య ఎక్కువ సమయాన్ని ఫ్యామిలీకే కేటాయించింది. రెండేళ్ల వివాహ బంధానికి గుర్తుగా ఆమెకు బాబు పుట్టాడు. బుల్లితెరపై కనిపించడం తగ్గించిన తర్వాత యూట్యూబులో లాస్య టాక్స్ అని సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. ఆసక్తికర వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరైంది.
Read Also: ‘బాహుబలి’ ఆడిషన్‌లో రాశీ ఖన్నా - రాజమౌళికి నచ్చినా, ఆ కారణంతో ఛాన్స్ ఇవ్వలేదట!
బిగ్ బాస్ క్రేజ్ తో సెకండ్ ఇన్నింగ్స్
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ తనకి అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. బిగ్ బాస్ సీజన్ 4లో లాస్య పాల్గొంది. అప్పుడే తన ప్రేమ, పెళ్ళికి సంబంధించి ఎవరికి తెలియని సీక్రెట్స్ బిగ్ బాస్ హౌస్ ద్వారా బయట పెట్టి చాలా ఎమోషనల్ అయ్యింది. బిగ్ బాస్ తర్వాత లాస్య సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అడపాదడపా టీవీ షోస్ లో కనిపిస్తూ ఎంటరటైన్ చేస్తూనే ఉంది. ఇటీవల లాస్యాకు ఆరోగ్యం బాగోలేదంటూ హాస్పిటల్ బెడ్ మీద కదల్లేని స్థితిలో ఉన్న ఫోటోలను ఆమె భర్త పోస్ట్ చేశాడు. ఆమె ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ ప్రార్థనలు చేయాల్సిందిగా మంజునాథ్ అభిమానులను కోరాడు.