Krishnamma kalipindi iddarini June 28th: సునంద ఇంటికొచ్చి ప్రేమ విషయం చెప్పనున్న అమృత-నిప్పు పెట్టే ప్రయత్నంలో సౌదామిని?
ఆదిత్య తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పటానికి భయపడటంతో నేరుగా అమృత వచ్చి చెప్పటానికి ఫిక్స్ అవ్వటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Krishnamma kalipindi iddarini June 28th: సునంద ఇద్దరు కోడళ్ళకు హారతి ఇస్తుండగా అక్కడున్న సౌదామిని భవానిపై కోపంగా చూస్తుంది. నిశ్చితార్థం అయిపోయే వరకు ఈమె కంట పడొద్దు అని అనుకుంటుంది భవాని. ఇక అందరూ లోపలికి వెళ్ళగా సౌదామిని కూతురు అంత జరిగిపోతుంది కదా అని అంటుంది. దాంతో సౌదామిని భవాని తప్పించుకుంటూ తిరుగుతుందని.. ఎలాగైనా తనకు నా దెబ్బ ఏంటో చూపిస్తాను అని అంటుంది. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేస్తాను అని అంటుంది.
తర్వాత గౌరీ, అఖిల ముందర నగలు ఉంచి ఈ నగలు మీకోసమే కొన్నాను అంటూ సునంద చెప్పటంతో అఖిల ఆ నగలను చూసి మురిసిపోతుంది. ఇక తన తల్లితో ఇందులో ఒకటి ఎత్తుకెళ్లిన సంవత్సరం మొత్తం కూర్చొని తినొచ్చు అని అంటుంది. దాంతో భవాని ఈ బంగారం అంతా మీకేనే అని అంటుంది. ఇక వారికి ఆ నగలు వేస్తూ ఉంటారు. అప్పుడే సౌదామిని అక్కడికి రావడంతో దుర్గ భవాని తను ఎక్కడ ఏమంటుందో అని భయపడి నిశ్చితార్థం అయిపోయే వరకు సునంద పక్కనే ఉండాలి అని అనుకుంటుంది.
మరోవైపు ఆదిత్య, ఈశ్వర్లను రెడీ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వారి తండ్రి వచ్చి వారికి చైన్స్ వేస్తూ ఉంటాడు. ఆదిత్య మాత్రం మూడీగా కనిపిస్తాడు. సౌదామిని అక్కడికి కూడా వచ్చి వారిని కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఈశ్వర్, గౌరీలు ఒకచోట నిలబడి మాట్లాడుతుంటారు. ఇక ఈశ్వర్ గౌరీ ప్రతిరూపం కోసం గులాబీ మొక్కను నాటాను అని ఇక ఎప్పుడు ఆ మొక్కతో మాట్లాడుతుంటాను అని అంటాడు.
ఆ తర్వాత ఆ మొక్కకి ఉన్న గులాబీని తీసి గౌరీ తలలో పెడతాడు. మరోవైపు ఆదిత్య వాళ్ళ తాతయ్య పెళ్లి గురించి సెటైర్లు వేస్తూ ఉండగా ఆ సమయంలో ఆదిత్య కు అమృత పదేపదే ఫోన్ చేస్తుంది. దాంతో ఆదిత్య బయటికి వెళ్లి మాట్లాడుతాడు. ఇక అమృత ఉండలేకపోతున్నాను బాగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇప్పటికైనా మన విషయం మీ అమ్మతో చెప్పు అని అంటుంది.
ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య ఫోన్ లో మాట్లాడుతున్న మాటలు విని సునంద ఎవరు అని అడుగుతుంది. దాంతో ఆదిత్య వేరే పర్సన్ అని అబద్ధం చెబుతాడు. ఇక సునంద ఆ ఫోన్ తీసుకొని స్విచ్ ఆఫ్ పెడుతుంది. ఏదైనా ఉంటే నిశ్చితార్థం అయిపోయాక మాట్లాడమని చెబుతుంది.
ఇక మళ్ళీ అమృత ఫోన్ చేయడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక లాభం లేదని ఎలాగైనా ఇంటికి వెళ్లి సునంద కు ప్రేమ విషయం చెప్పాలి అని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఆ తర్వాత అందరూ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పెళ్లికూతురులను తీసుకొని వస్తుండగా.. ఆ సమయంలో గౌరీ తలలో ఉన్న రోజా పువ్వు చూసి ఈశ్వర్ వాళ్ళ పిన్ని ఇది ఎక్కడిది అని అడగటంతో గౌరీ సిగ్గుపడుతూ కనిపిస్తుంది.
Also Read: Madhuranagarilo June 27th: రాధను భయపెట్టించిన శ్యామ్-మధుర మాటలను తట్టుకోలేకపోతున్న అపర్ణ, సంయుక్త?