Ammayi garu Serial Today September 23rd: అమ్మాయి గారు సీరియల్: రాఘవని కాపాడిన రాజు, రూప.. విరూపాక్షి సమస్యని పరిష్కరిస్తారా.. సూర్యప్రతాప్ భార్యని నమ్ముతాడా?
Ammayi garu Today Episode రాఘవని రూప, రాజు, విరూపాక్షి కాపాడి సూర్య ప్రతాప్ దగ్గరకు తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode రాఘవని విజయాంబిక కిడ్నాప్ చేసిందని రూప తెలుసుకుంటుంది. ఇక వెంటనే తన తల్లి విరూపాక్షికి కాల్ చేసి రాఘవ ఎక్కడున్నాడో తెలిసింది. విజయాంబిక అత్తయ్యే దాచిపెట్టిందని చెప్తుంది. విరూపాక్షి షాక్ అయిపోతుంది. రూప వాళ్లని ఫాలో అవుతున్నానని చెప్తుంది. తొందరగా రమ్మని లొకేషన్ పెడుతుంది.
విజయాంబిక, గౌతమ్‌ల కారుని రూప ఫాలో అవుతుంది. రూపని విరూపాక్షి ఫాలో అవుతుంది. విజయాంబిక వాళ్లు వెళ్లిన పాడు పడిన గది దగ్గరకు రూప వెళ్తుంది. చాటుగా చూస్తుంది.
విజయాంబిక: ఏంటి రాఘవ తప్పించుకోవాలని చూశావా. నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ అనుకున్నావా.
రూప: రాఘవ ప్రాణాలతోనే ఉన్నాడు కానీ అత్తయ్య నుంచి ఎలా కాపాడాలి. సమయానికి రాజు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదే. విరూపాక్షి కూడా వచ్చి రాఘవని చూస్తుంది. (గతంలో రాఘవకు, విరూపాక్షి అఫైర్ ఉందని కావాలనే ప్లాన్ చేసి విజయాంబిక సూర్యప్రతాప్ దగ్గర ఆయన భార్యని తప్పుగా చూపించి విడదీసేస్తుంది.)
రాజు గదిలోకి వచ్చి తన తల్లి, శ్వేతలను తిట్టుకుంటాడు. ఇక రూప నుంచి చాలా సార్లు ఫోన్ రావడం చూసి తిరిగి కాల్ చేస్తాడు. రూప ఫోన్ రింగ్ కావడంతో రౌడీలు ఎవరో వచ్చారని భావించి బయటకు వచ్చి చూస్తారు. రూప, విరూపాక్షిలు దాక్కుంటారు. ఇంతలో రౌడీకి ఫోన్ రావడంతో తన ఫోన్ అనుకొని మళ్లీ లోపలికి వెళ్లిపోతారు. ఇక రూప రాజుతో మాట్లాడి విషయం చెప్తుంది. రాజు వస్తానని చెప్తాడు.
రూప: రాజు వస్తున్నాడమ్మా ఈ రోజు ఎలా అయినా రాఘవని కాపాడి నాన్న ముందు నిలబెట్టాలి.
విరూపాక్షి: అదే జరిగితే మనందరి సమస్య ఈ రోజుతో తొలగిపోతుంది. మన అందరి ప్రాబ్లమ్స్ ఒకేసారి తీరిపోతాయి. మీ నాన్న కూడా నాది ఏ తప్పు లేదని తెలుసుకొని నన్ను అర్థం తీసుకుంటారు.
విజాయాంబిక: చూడు రాఘవ నీ వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లమ్ రానంత వరకు నీకు ఏ ప్రాబ్లమ్ రాదు.
మరోవైపు రాజు వస్తుంటాడు. రూప వాళ్లు బయట నుంచి మాటలు వింటుంటారు. దీపక్ రాఘవని చంపేద్దామని అంటారు. విజయాంబిక వీడి మాటలు ఎవరూ వినరని చెప్తుంది. ఇక జాగ్రత్తగా రాఘవని చూసుకోమని వెళ్దామని అంటుంది. దీపక్, విజయాంబిక వెళ్లిపోతారు. ఇక రాజు అక్కడికి వస్తాడు. రాజు రౌడీలను చితక్కొట్టి రాఘవని కాపాడుతాడు. విరూపాక్షి కాల మీద పడి రాఘవ క్షమించమని అడుగుతాడు. క్షమించరాని తప్పు చేశానని ఇన్నాళ్లుగా ఆ తప్పునకు కుమిలిపోతున్నా అని పెద్దయ్య గారికి ఇప్పుడే నిజం చెప్తానని అంటాడు.
అందరూ కలిసి అక్కడి నుంచి బయల్దేరుతారు. ఇక సూర్యప్రతాప్ జరిగిన ప్రమాదాలు తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో రాజు సూర్య ప్రతాప్ కారుని ఆపుతాడు. మీరు ఇప్పుడే ఇంటికి రావాలని నా ప్రాబ్లమ్ మీకు తెలియాలి అంటే మీ ఇంటికి ఇప్పుడే రండి అని చేతులెత్తి దండం పెడతాడు. సూర్యప్రతాప్ రాను అంటే రాజు కాళ్లకు దండం పెట్టి రమ్మని చెప్తాడు. ఇక అందరూ ఇంటికి బయల్దేరుతారు. ఇక రౌడీలు విజయాంబికకు కాల్ చేసి రాజు వాళ్లు కొట్టి రాఘవని తీసుకెళ్లిపోయారని చెప్తారు. దాంతో విజయాంబకి రాఘవని చంపేయ్ మని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి సంతకం చేసిన టీచర్.. మహాకు ట్విస్ట్ ఇచ్చిన సీత, సూర్య నడిచేశాడోచ్!