Seethe Ramudi Katnam Serial Today September 23rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సుమతి సంతకం చేసిన టీచర్.. మహాకు ట్విస్ట్ ఇచ్చిన సీత, సూర్య నడిచేశాడోచ్!
Seethe Ramudi Katnam Today Episode సుమతి సంతకం ప్లాన్ మహాలక్ష్మీదే అని తెలుసుకున్న రామ్ జనార్థన్ మహాలక్ష్మీని కొప్పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode రామ్, సీతలు పడుకున్న తర్వాత విద్యాదేవి ఆ గదికి వచ్చి పేపర్ల మీద సంతకం పెట్టేస్తుంది. సీత దగ్గ వచ్చి లేవడంతో విద్యాదేవి దాక్కుంటుంది. తర్వాత మళ్లీ వెళ్లి సంతకాలు చేసేస్తుంది. ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నా మీద మాట రాకుండా నా సంతకం చేశా మహాలక్ష్మీకి కోలుకోలేని షాక్ ఇచ్చా మీరు హ్యాపీగా ఉండండని విద్యాదేవి అనుకుంటుంది.
ఉదయం మహా, జనా, అర్చన, గిరిధర్‌లు రామ్ సీతలు ఊరు వెళ్తారా సంతకం పెట్టిస్తారా లేదంటే లాస్ వస్తుందని అనుకుంటారు. మహాలక్ష్మీ సీత, రామ్‌లను పిలుస్తుంది. సీత వస్తుంది. అందరూ సీతతో ఊరు వెళ్తున్నారా కదా అన్నీ ఏర్పాటు చేసుకున్నావా అని అంటారు.
జనార్థన్: మీ అత్తమ్మ వస్తే నాకు చెప్పు లేదంటే తననే ఇక్కడికి తీసుకురా.
గిరిధర్: అగ్రిమెంట్‌లో ఎక్కడెక్కడ సంతకాలు చేయించాలో తెలుసుకదా.
మహాలక్ష్మీ: ఇలా ఇవ్వు మీ అత్తమ్మ ఎక్కడెక్కడ సంతకాలు చేయాలో మార్క్ చేస్తా అని చెప్పి పేపర్లలో సుమతి సంతకం చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి సుమతి సంతకం చేసేసి ఉంది.
జనార్థన్: సుమతి సంతకం చేసిందా ఇటివ్వు ఇది సుమతి సంతకమే.
గిరిధర్: సుమతి వదిన ఎప్పుడు సంతకం చేసింది.
సీత: అత్తమ్మ రాత్రి ఎవరికీ తెలీకుండా ఇంటికి వచ్చి సంతకం చేసి ఉంటుంది.
అర్చన: మనకు తెలీకుండా సుమతి అక్క వచ్చి వెళ్లింది అంటే ఏదో తప్పు చేసింది.
మహాలక్ష్మీ: అనుమానమే లేదు జనా సుమతి ఏదో పెద్ద తప్పే చేసింది అందుకే దొంగలా తిరుగుతుంది.
సీత: ఇక ఆపండి అత్తయ్య. మీరు అంతా అనుకున్నట్లు ఆ సంతకం సుమతి అత్తయ్య పెట్టలేదు నేనే పెట్టా. సుమతి అత్తయ్య రాసిన లెటర్‌లో సంతకం చూసి కాపీ కొట్టా.
అర్చన: ఫోర్జరీ చేశావా అది ఎంత నేరమో తెలుసా.
సీత: శిక్ష అంటూ పడితే మీకు ఇంకా పెద్ద శిక్ష పడాలి అత్తయ్య.
రామ్: పిన్ని ఏం చేసింది సీత.
సీత: రాత్రి నేను ముఖర్జీ గారికి ఫోన్ చేశా అసలు ఆయన సుమతి అత్తయ్య పేరుతో ఏం డాక్యుమెంట్స్ పంపలేదంట అవసరం అయితే అడగండి.
రామ్: ఏంటి పిన్ని సీత చెప్పింది నిజమా. ఎందుకు ఇలా చేశారు. మమల్ని అంత టెన్షన్ పెట్టారు.
మహాలక్ష్మీ: చెప్తాను ఇందులో నా స్వార్థం ఏం లేదు. ఇలా అయినా సుమతి బయటకు వస్తుందని చేశా నేను మన మంచి కోసమే చేశా జనా.
జనార్థన్: ఇంక ఆపు సుమతిని బయటకు తీసుకురావడానికి ఇంత నీచంగా ఎలా ఆలోచించావ్. ఆస్తి కోసం సుమతి బయటకు వస్తుందని ఇంత పెద్ద నింద ఎలా వేశావ్. నువ్వు ఇంత దిగజారిపోతావ్ అనుకోలేదు.
రామ్: మీరు ఇలా చేస్తారని అనుకోలేదు పిన్ని. రోజు రోజుకు మీ మీద నమ్మకం పోతుంది. బాధగా ఉంది అసహ్యంగా కూడా ఉంది.
అత్తయ్య ముఖర్జిని ఇంటికి పిలిచిన దాన్ని ఆయనతో మాట్లాడకుండా ఎలా ఉంటాను. ఎలా ఉంది నా గిఫ్ట్ అబ్బా అనిపించిందా. అని సీత మహాలక్ష్మీని అంటుంది. ఇక సీత టీచర్ దగ్గరకు వచ్చి అగ్రిమెంట్ మీద మీరు ఎందుకు సంతకం పెట్టారు. మీరు రాత్రి మా గదికి వచ్చి సంతకం పెట్టారని అడుగుతుంది. ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చిందో కారణం అడుగుతుంది. దాంతో విద్యాదేవి మీ నాన్నని కాపాడటానికి ఇలా చేశానని సీతని కన్విన్స్ చేసేస్తుంది.
మరోవైపు సూర్యకి ఆపరేషన్ పూర్తి అయి ఎప్పటిలా నడుచుకుంటూ అత్తారింటికి వస్తాడు. సూర్య రామ్, సీతల దగ్గరకు వెళ్లుంటే బాగుండేదని అంటాడు. అమ్మానాన్నల్ని కలిశాక రామ్ వాళ్ల ఇంటికి వెళ్దామని అంటుంది మధు. ఇంతలో సీత, రామ్‌లు ఎదురుగా వస్తారు. మీ డిశ్చార్జి అని తెలిసి ముందే వచ్చామని అంటుంది సీత. ఇక సీత మధు, సూర్యలకు దిష్టి తీసి లోపలకు తీసుకెళ్తుంది. సూర్య, మధులు ఇద్దరూ రామ్, సీతలకు థ్యాంక్స్ చెప్తారు. మొత్తానికి అందరూ హ్యాపీగా కలిసిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.