అన్వేషించండి

Satyabhama Serial Today September 23rd: సత్యభామ సీరియల్: ఆ చిన్నా నా కొడుకే కాదు.. కేవలం మన కాపలా కుక్క: రుద్రతో మహదేవయ్య, వినేసిన సత్య షాక్‌!

Satyabhama Today Episode క్రిష్ తన కొడుకు కాదని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కన్నకొడుకు రుద్ర కోసం అస్త్రంగా వాడుకుంటున్నానని మహదేవయ్య చెప్పడం సత్య వినేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today September 5th Episode మహదేవయ్య నర్శింహని చంపడానికి వెళ్తే నర్శింహ నిజం చెప్తాడు. నిన్ను చంపడానికి ప్రయత్నించింది నీ పెద్ద కొడుకు రుద్ర ప్రతాపే అని చెప్తాడు. మహదేవయ్య షాక్ అయిపోయి వణికిపోతాడు. నర్శింహ మహదేవయ్యని రుద్ర మీదకు రెచ్చగొడతాడు. దాంతో మహదేవయ్య ఏం మాట్లాడకుండా వచ్చేస్తాడు. మరోవైపు రుద్రకు సీన్ అర్థమై తండ్రిని చూసి చాలా భయపడతాడు. 

మహదేవయ్య రుద్రని కోపంగా చూస్తాడు రుద్ర చెమటలు పట్టేస్తాడు. ఇక మహదేవయ్య ఏం మాట్లాడకుండా కారులో కూర్చొంటాడు. రుద్ర భయం భయంగా కారు డ్రైవింగ్ చేసి ఇంటికి తీసుకెళ్తాడు. రుద్రని మహదేవయ్య ఈడ్చుకుంటూ లోపలికి తీసుకెళ్తాడు. సత్య అది చూసి మామయ్య గారు ఎందుకు బావగారిని తీసుకెళ్తున్నారు. బావగారు ఏంటి భయపడుతున్నారని అనుకుంటుంది. ఇక మహదేవయ్య రుద్రని గదిలోకి తీసుకెళ్లి కొరడాతో చితక్కొడతాడు. 

మహదేవయ్య: రక్షణ కోసం నిన్ను నా వెనక పెట్టుకుంటే నాకే వెన్నుపోటు పొడుస్తావా దగాకోర్. శత్రువుతో చేయి కలుపుతావా. నాకు పిండం పెట్టాలని తొందరపడతావా. నా శవం మీద కాలు పెట్టి ఎదగాలని అనుకుంటావా.  
రుద్ర: బాపు కొట్టొద్దు బాపు ఇంకెప్పుడు ఇలా చేయను.
మహదేవయ్య: ఏం లోటు చేశారా నీకు ఏం తక్కువ చేశారా ఎందుకురా ఈ దొంగ బుద్ధి.
రుద్ర: నా తమ్ముడి ముందు నన్ను తక్కువ చేస్తే నాకు కోపం రాదా. ఒకసారి కాదు రెండు సార్లు కదా చాలా సార్లు. నీ చెప్పు తల మీద మోస్తున్నాడోని తక్కువ చేస్తే కోపం రాదా. అందరి ముందు ఎన్నో సార్లు కొట్టావ్. నా పెళ్లాం ముందు అవమానించావ్. సహించా. ముఖ్యమైన పనులన్నీ తమ్ముడికే అప్పగించావ్. భరించా.. ఏదో ఒక రోజు నా నెత్తిన కిరీటం పెడతావని ఆశతో నీ కాళ్ల దగ్గర పడ్డా ఊడిగం చేశా. అయినా నీకు నేను కనిపించడం లేదు పెద్ద కొడుకు ఒకడున్నాడని నీకు కనిపించడం లేదు. అన్నింటికీ చిన్నా చిన్నా చిన్నా.. ఈ రుద్ర నీ లెక్కల్లో లేడు. అలాంటప్పుడు నన్ను ఎందుకు కన్నావ్ బాపు. పొరపాటున కనింటే ఏ తుప్పల్లోనే పడేయాల్సింది. ఏ అడుక్కున్నోడికి దొరికినా ఇంత ప్రేమ దొరికేది. జీవితాంతం ఈ ఇంట్లో నౌకర్‌లా బతకాలా. అందుకే వేరే దారిలేక శత్రువుతో చేతులు కలిపా. ఇప్పటికైనా మించిపోయింది లేదు బాపు నన్ను చంపేయ్. అంతేకానీ చిన్నా ముందు అవమానిస్తూ కొంచెం కొంచెం చంపకు. 
సత్య: బావ గారు మనసులో ఇంత బాధ దాచుకున్నారా ఈ విషయంలో మామయ్య గారు చేసింది తప్పే.
మహదేవయ్య: రుద్ర అని హగ్ చేసుకుంటాడు. నేను తప్పు చేశా అని నువ్వు అనుకుంటున్నావ్. కానీ ఎందుకు అలా చేశానని తెలిస్తే ఇలా మాట్లాడవు. నువ్వు అంటే నాకు ప్రాణంరా.
రుద్ర: ఈ ఓదార్పు మాటలు వద్దు బాపు నీకు చిన్నా అంటే ప్రాణం. వాడు అడిగినవి అడగనివి అన్నీ వాడికే ఇస్తున్నావ్.
మహదేవయ్య: ఇవి మన పొలం పేపర్లు నీ పేరునే ఉన్నాయ్. మన ఇళ్లు నీ పేరునే ఉంది మొత్తం మన ఆస్తే నీ పేరున ఉంది. చూడు.. చిల్లి గవ్వ అయినా చిన్నా గాడి పేరు మీద ఉందా లేదు. నీ మీద ప్రేమ లేకపోతే ఎందురా ఇదంతా చేస్తా. ఇప్పటికి బాపు మాట మీద నీకు నమ్మకం లేదా.
రుద్ర: ఆస్తి మొత్తం నా పేరున రాసిన నువ్వు ఎందుకు నాకు గుర్తింపు ఇవ్వడం లేదు.


మహదేవయ్య: స్వార్థం గొడవలకు పోతే నీకు ఏమైనా జరుగుతుందని భయంరా.  మహదేవయ్య వారసుడిగా నువ్వు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆరాటం.
రుద్ర: ఈ స్వార్థం నామీదే ఎందుకు బాపు. చిన్నా నా తమ్ముడే కదా. వాడిది ప్రాణమే కదా. డబ్బు ఆస్తి నా ముఖాన కొట్టి నీ తర్వాత వారసుడిగా వాడిని ప్రకటించాలి అనుకుంటున్నావ్ కదా. ఇప్పుడు నువ్వు నాకు ఆస్తి రాసినా వాడు కోర్టుకి పోతే వాడి వాటా వాడికి దొరుకుతుంది అంతే కదా నీ ప్లాన్.
మహదేవయ్య: మాటిస్తున్నా ఆ చిన్నా గాడు నీ జోలికి రాడు. వచ్చినా వాడికి ఆస్తిలో హక్కు ఉండదు. ఎందుకంటే వాడు రక్తం పంచుకొని పుట్టలేదు కాబట్టి. ఆ చిన్నా గాడు నా కొడుకు కాదు. 
రుద్ర: మరి ఎందుకు మన ఇంట్లో ఉన్నాడు ఎందుకు నీ కొడుకుగా బతుకుతున్నాడు.
మహదేవయ్య: నా అవసరం నా కొడుకుని క్షేమంగా చూసుకోవడానికి నా కొడుకుకి రక్షణగా. అందుకే వాడిని ప్రేమగా చూస్తున్నా. యూత్‌ లీడర్ లాంటి కుక్క బిస్కెట్లు వేస్తున్నా అది విశ్వాసంతో పడుండటానికే. 
రుద్ర: అసలు నువ్వు చెప్పేది నాకు ఏం అర్థం కాలేదు. అసలు చిన్నా ఎవరు. ఎవరి కొడుకు. నువ్వు ఎందుకు తెచ్చుకున్నావ్.
మహదేవయ్య: రేయ్ ఈ రాజకీయం చాలా చెడ్డది వదిలేయ్ సమయం వచ్చేటప్పుడు అన్నీ తెలుస్తాయి. ఈ రాజకీయంలో వాడిని మన కవచంలా వాడుతున్నా. చావు మన వరకు రావాలి అంటే వాడిని దాటి రావాలి.  ఇప్పుటికైనా ఈ బాపు గురించి అర్థమైందా. 

భైరవి అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తుంది. రుద్ర, మహదేవయ్య, సత్య ఇంకా రాలేదేంటా అని అడుగుతుంది. ఇంతలో సత్య వస్తుంది. ఇక రేణుక క్రిష్ సత్య కోసం ఎదురు చూస్తున్నాడు అంటే భైరవి తండ్రి కోసం ఎదురు చూస్తున్నాడని అంటుంది. ఇక సత్య డల్‌గా ఉండటంతో రేణుక ఏమైందని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: గజగండని తప్పుదోవ పట్టించిన గాయత్రీదేవి.. విశాల్‌ని చూస్తూ ఎమోషనల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయ్యప్ప దీక్ష తప్పా? స్కూల్ ప్రిన్సిపల్ ఘోర అవమానం!మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
జమిలి ఎన్నికల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ - కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం
CM Revanth Reddy: లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
లగచర్ల దాడి ఘటనలో రైతుకు బేడీలు - సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
Grandhi Srinivas: వైఎస్ఆర్‌సీపీకి  బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
వైఎస్ఆర్‌సీపీకి బ్యాక్ టు బ్యాక్ షాక్ - ఈ సారి పవన్ కల్యాణ్‌పై గెలిచిన లీడర్ గుడ్ బై
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Maruti Suzuki Wagon R: 34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
34 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే కారు - రూ.లక్ష కట్టి తీసుకెళ్లిపోవచ్చు!
WhatsApp Stop Working: 2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
2025 మే నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - లిస్ట్‌లో ఏయే ఫోన్లు ఉన్నాయి?
Embed widget