Ammayi garu Serial Today October 11th: అమ్మాయి గారు సీరియల్: పోటా పోటీగా సూర్యప్రతాప్, జీవన్‌ల నామినేషన్లు.. విజయాంబిక ఎత్తుకు రాజు పైఎత్తు!
Ammayi garu Today Episode సూర్యప్రతాన్, జీవన్‌ల నామినేషన్లు వేయడం సూర్య నామినేషన్ పత్రాలను విజయాంబిక మార్చేయడం రాజు వాటిని తీసుకురావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode విజయాంబిక సూర్యప్రతాప్ నామినేషన్ పత్రాలను రూపకి ఇప్పిస్తుంది. రూప సంతోషంగా వాటిని తీసుకొని వెళ్తుంది. ఇంతలో దీపక్‌కి జీవన్ ఫోన్ చేస్తాడు. సూర్యప్రతాప్‌ని ఓడించాలి అంటే ఎలక్షన్ వరకు అవసరం లేదని నామినేషన్ వేయనివ్వకుండా చేస్తే చాలు అని అంటాడు. దానికి విజయాంబిక కావాలనే రూపకి నామినేషన్ పేపర్లు ఇప్పించానని వాటిని మార్చేస్తానని అంటుంది. సూర్యప్రతాప్‌కి కోలుకోలేని దెబ్బ కొట్టాలని శ్వేత అంటుంది.
మరోవైపు రూప రాజుకి కాల్ చేస్తుంది. రేపు నామినేషన్ ఉందని చెప్తుంది. నామినేషన్ పత్రాలను అత్తయ్య తనకి ఇప్పించిందని అంటుంది. నామినేషన్ దగ్గరకు నేను కూడా వస్తానని రాజు అంటాడు. రూప చాలా సంతోషిస్తుంది. రాజు తనలో తాను విజయాంబిక గారు అమ్మాయి గారికి నామినేషన్ పేపర్లు ఇచ్చి దాయమన్నారంటే ఏదో తేడా కొడుతుందని రాజు అనుకుంటాడు. అనుకున్నట్లు గానే విజయాంబిక, దీపక్‌లు రూప గదిలోకి వచ్చి నామినేషన్ పేపర్లు మార్చేస్తారు.
ఉదయం నామినేషన్ వేయడానికి సూర్యప్రతాప్ రెడీ అవ్వడంతో కార్తకర్తల సందడి ఇంటి దగ్గర మొదలవుతుంది. రూప దేవుడికి పూజ చేస్తుంది. తన తండ్రిని గెలిపించమని కోరుకుంటుంది. రూప హారతి తీసుకొని వస్తుంది. రూప హారతి అంటే దీపక్ తన రెండో భార్య అనుకొని కంగారు పడతాడు. ఆ హారతి ఎప్పుడు నా కొంప ముంచేస్తుందో అని టెన్షన్ పడతారు. ఇక దీపక్ తల్లితో మామయ్యకు నువ్వు ఎదురు రాకపోతే మన మీద అనుమానం వస్తుంది నువ్వు రామ్మ అని అంటాడు. దానికి విజయాంబిక చూస్తావుగా నన్నే పిలిస్తాడని అంటుంది. ఇక సూర్యప్రతాప్ నామినేషన్ పేపర్లు పట్టుకొని రూపని ఎదురు రమ్మని పిలుస్తాడు. దీపక్ తల్లిని అడక్కుండా రూపని ఎందుకు పిలిచావ్ అంటే నా చెల్లి కూడా ఇదే జరుగుతుందని అంటాడు. ఇక రూప తండ్రికి ఎదురు రావడంతో అందరూ నామినేషన్ వేయడానికి వెళ్తారు.
ఒక వైపు సూర్యప్రతాప్‌కి మరోవైపు జీవన్‌కి కార్త కర్తలు దండ వేసి ఘనంగా తీసుకెళ్తారు. సూర్యప్రతాప్, జీవన్ ఒకరికి ఒకరు ఎదురువుతారు. జీవన్ జైలు నుంచి రావడం చూసి షాక్ అవుతారు. ఎన్నికల గెలుపోటముల గురించి ఒకరికి ఒకరు ఛాలెంజ్‌లు వేసుకుంటారు. జీవన్ మొదట నామినేషన్ వేస్తాడు. తర్వాత సూర్యప్రతాప్ నామినేషన్ పేపర్లు ఇస్తాడు వాటిని పరిశీలించిన అధికారులు అవి నామినేషన్ పత్రాలు కావని వేరే ఏవో అని అంటాడు. సూర్యప్రతాప్, రూప, చంద్రలు షాక్ అయితే విజయాంబిక, జీవన్, దీపక్, శ్వేత, రేణుక వాళ్లు నవ్వుకుంటారు. సూర్యప్రతాప్ ఏంటి ఇదంతా అని రూపని ప్రశ్నిస్తాడు. విజయాంబిక కూడా రూపని నిందిస్తుంది. ఫైల్ నేను మార్చలేదని రూప అంటుంది. ఇక ఆఫీసర్ నామినేషన్ టైం అయిపోతుంది అంటాడు. ఇక రూప రాజుకి కాల్ చేస్తుంది. త్వరగా రమ్మని పిలుస్తుంది. సూర్యప్రతాప్ రాజు ఎందుకని అంటాడు. దాంతో రూప నీకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా రాజు సాల్వ్ చేస్తాడని అంటుంది.
ఇంతలో రాజు అక్కడికి వస్తాడు. సూర్యప్రతాప్ మొత్తం అయిపోయిందని వెళ్లిపోదాం అంటాడు. ఇంతలో రాజు వచ్చి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని అంటాడు. తానే నామినేషన్ పేపర్లు తీసుకొచ్చి అధికారికి ఇస్తాడు. అందరూ షాక్ అయిపోతారు. రూప చాలా సంతోషిస్తుంది. ఫ్లాష్ బ్యాక్‌లో రాజుకి విజయాంబిక మీద అనుమానం వచ్చిన తర్వాత రూప దగ్గరకి వెళ్తాడు. నామినేషన్ పేపర్లు ఇస్తాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.