Ammayi garu Serial Today November 7th: అమ్మాయిగారు సీరియల్: సగం కాలిన శవంలా కోమలి.. ప్లాన్ రివర్స్ అయిందా! రాజు రూప ఏం చేశారు?
Ammayi garu Serial Today Episode November 7th విరూపాక్షిని చంపాలి అని విజయాంబిక దీపావళి వేడుకల్లో విరూపాక్షి చీర కాల్చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపావళి వేడుకల్లో విజయాంబిక విరూపాక్షి అంతు చూడాలి అని విరూపాక్షి చీర కాలిపోయేలా దీపాలు కొంగు కింద పెడుతుంది. రాజు, రూప, బంటీని సంతోషంగా క్రాకర్స్ కాల్చుకుంటారు. సూర్యప్రతాప్ తనని పిలుస్తాడా లేదా అని విరూపాక్షి చూస్తూ ఉంటుంది.
సూర్యప్రతాప్ విరూపాక్షిని చూసి ముఖం తిప్పుకొని మళ్లీ చూసి విరూపాక్షి కొంగ కింద ఉన్న దీపాలు చూస్తాడు. విరూపాక్షి అని వెళ్లి విరూపాక్షిని లాగుతాడు. అందరూ విరూపాక్షి దగ్గరకు పరుగులు పెడతారు. అక్కడ దీపాలు పెట్టింది ఎవరు అని సూర్యప్రతాప్ అడుగుతారు. అందరూ ముఖాలు చూసుకుంటారు. మాలో ఎవరో అక్కడ పెట్టుంటారు నాన్న ఏమైంది అని రూప అడుగుతుంది. నేను చూడకుండా ఉంటే మీ అమ్మ చీర అతుక్కునేలా ఉంది.. ఆ మాత్రం చూసుకోరా.. వాళ్లు చూడలేదు సరే నువ్వు అయినా చూసుకోవాలి కదా.. తలచుకుంటేనే అని సూర్యప్రతాప్ ఎమోషనల్ అయిపోతాడు. విరూపాక్షి కూడా ఎమోషనల్ అయి భర్తని చూస్తూ ఉంటుంది. అందరికి సూర్యప్రతాప్‌లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.
కోమలి ఆ దీపాలు పక్కన పెట్టి విజయాంబిక, దీపక్ ఒక్క పని కూడా సరిగా చేయరు అని అనుకుంటుంది. రూప తల్లితో ఏంటమ్మా నాన్నకి నీ మీద ఇంత ప్రేమ ఉంది అని అనుకుంటుంది. విజయాంబిక కోమలి, దీపక్‌తో మా తమ్ముడి కళ్లు అన్నీ విరూపాక్షి మీదే ఉన్నట్లు ఉన్నాయ్ మా ప్లాన్ మిస్ అయింది నువ్వు సరిగా ప్లాన్ చేయ్ అంటుంది. నేను మీలా చేయను అని కోమలి అంటుంది.
కోమలి, దీపక్, విజయాంబిక బయటకు వెళ్తారు. ఓ వ్యక్తి వచ్చి కోమలికి కొన్ని చిచ్చుబుడ్డీలు ఇస్తాడు. దీపక్ వాటిని చూసి ఇదేంటి అని అడుగుతాడు. ఇవి మామూలు చిచ్చుబుడ్డీలు కాదు బాంబ్‌లు అని అంటుంది. ఇవి మామూలువి కాదు.. వీటిని వెలిగిస్తే వాళ్లంతా అయిపోతారు అని కోమలి చెప్తుంది.
రాజు, రూప, బంటి, సూర్యప్రతాప్, విరూపాక్షి, సుమ, చంద్ర, మందారం అందరూ క్రాకర్స్ కాల్చుతూ ఉంటే కోమలి వెళ్లి కుంపీలు తీసేసి వాటి స్థానంలో తను తీసుకొచ్చిన బాంబ్లు పెట్టేస్తుంది. వాటిని తీసుకెళ్లి ఇవి భలే ఉన్నాయి వీటిని కాల్చండి అని పెట్టి దూరంగా వెళ్లిపోతుంది. రూపకి కోమలి ప్రవర్తనకి అనుమానం వస్తుంది. కోమలి, విజయాంబికలు సైగలు చేసుకోవడం చూస్తుంది. రాజు వెలిగించబోతే ఆపి కోమలిని చూపిస్తుంది. దాంతో రాజు వాటిని వెలిగించకుండా కోమలిని అమ్మాయిగారు మీరేంటి అక్కడ ఉన్నారు రండి అని పిలుస్తాడు. కోమలి వాళ్లు షాక్ అయిపోతారు.
కోమలి రాను నాకు భయం అని అంటే రాజు బలవంతంగా తీసుకెళ్తాడు. కాల్చమని అంటాడు. కోమలి పని అయిపోయింది అని దీపక్, విజయాంబిక అనుకుంటారు. తాను తీసిన గోతిలో తానే పడ్డ కోమలి కుంపీలు వెలిగించగానే బాంబ్ పేలిపోతుంది. కోమలి కళ్లు మూసుకొని మంట మంట అని అరుస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. కోమలిని గదిలోకి తీసుకెళ్తారు. కమలి ముఖం కాలిపోతుంది. ఇక డాక్టర్ కోమలి ముఖం మీద కెమికల్స్ ఎక్కువ పడటంతో మంట ఉంటుంది అని మందు రాయమని ఇస్తారు. రాజు ఆయింట్‌మెంట్ రాస్తూ చూశావా నువ్వు చేసిన పని నీకే రివర్స్ అయింది అంటాడు. అందరూ షాక్ అయి చూస్తారు. రాజు కవర్ చేస్తూ మేం కూడా చిచ్చుబుడ్డీలు కాల్చాం.. అవి మీరే తెచ్చారు. అసలు అంత వరకు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతాడు.
సూర్యప్రతాప్ కోమలితో అవునమ్మా నువ్వు ఎక్కడికి వెళ్లావ్.. అసలు వాటిని ఎక్కడి నుంచి తెచ్చావ్ అని అడుగుతాడు. కోమలి తప్పించుకోవడానికి కాసేపు రెస్ట్ తీసుకుంటా మంటగా ఉంది అని అంటుంది. ఎవరో మన మీద దిష్టి పెట్టారు నాయనా అని రూప అంటుంది. ఇక రాజు బూలు అయిపోతూ మీరు వెళ్లండి పెద్దయ్యా నేను అమ్మాయిగారిని చూసుకుంటా అని అంటాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత రాజు, రూపలు ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అంటారు వినలేదా అని సెటైర్లు వేస్తారు. విజయాంబిక దీపక్‌లు సగం కాలిన శవంలా కోమలి అయిపోయింది అని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















