అన్వేషించండి

Ammayi garu Serial Today November 20th: అమ్మాయిగారు సీరియల్: బంటీని కాపాడటానికి రాజు వేసిన మాస్టర్ ప్లాన్! రాఘవకి ఇంజక్షన్‌ వేశారా!

Ammayi garu Serial Today Episode November 20th రాఘవకి ఇంజక్షన్ వేయకుండా ఆపాలని విజయాంబిక ప్రయత్నించడం చివరి నిమిషంలో సూర్య రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode దీపక్ బంటీని కిడ్నాప్ చేసి రాఘవకు వేయాలి అనుకున్న ఇంజక్షన్‌ తనకు ఇవ్వమని రాజుకి బ్లాక్ మెయిల్ చేస్తాడు. రాజు విరూపాక్షి, రూపలతో నేను బంటీని కాపాడుతా మీరు ఇంజక్షన్ వేయించండి అంటాడు. అలా ఏం వద్దు ముందు బంటీ ప్రాణాలు ముఖ్యం అని విరూపాక్షి అంటుంది. ముగ్గురు బంటీ కోసం పరుగులు పెడతారు. 

విజయాంబిక చాలా టెన్షన్ పడుతుంది. అంతా మన ప్లాన్ ప్రకారమే జరుగుతుంది టెన్షన్ వద్దు అని కోమలి అంటే లేదు నాకు రాజు ఏదో చేస్తాడు అని అనిపిస్తుంది. రాజు ఇంజక్షన్ ఇస్తాడు అంటే అనుమానంగా ఉందని అంటుంది. రూప, రాజులు ఇంజక్షన్ పట్టుకొని దీపక్ చెప్పిన అడ్రస్‌కి బయల్దేరుతారు. ఓ రౌడీ ఫాలో అవుతూ దీపక్‌కి విషయం చెప్తాడు. బంటీ భయపడుతూ ఉంటాడు. ఎలా అయినా తప్పించుకోవాలి అని అనుకుంటాడు. టాయిలెట్ వస్తుందని చెప్పి పారిపోవాలని అనుకుంటే రౌడీలు పట్టుకుంటారు. చాకు చూపించి బంటీని భయపెడతారు. 

రాజు, రూపలు ఇంజక్షన్ పట్టుకొని దీపక్ చెప్పిన గెస్ట్‌హౌస్‌లోకి వస్తారు. రౌడీ డోర్ లాక్ చేసేస్తాడు. దీపక్ మరో రౌడీతో రాజు ఇంజక్షన్ ఇస్తేనే బంటీని వదలమని అంటాడు. రాజు, రూపలు ఇంజక్షన్ తీసుకొని లోపలికి వెళ్తారు. రౌడీలు రాజు వాళ్లని ఆపి ఇంజక్షన్ బాక్స్ పెట్టమని చెప్తాడు. ఇద్దరూ లోపలికి వెళ్లి బంటీని చూస్తారు. బంటీని చంపేస్తామని చెప్పి బాక్స్ ఇవ్వమని అంటారు. రాజు ఇవ్వడంతో బంటీని అప్పగిస్తారు. 

విజయాంబిక కోమలితో రాజుని అంత ఈజీగా నమ్మలేమని అంటుంది. ఇక రౌడీలు ఇంజక్షన్‌ కోసం బాక్స్ తీసి చూస్తే అందులో ఇంజక్షన్ ఉండదు.. ఫ్లాష్బ్యాక్‌తో రాజు ఇంజక్షన్ విరూపాక్షితో ఇంజక్షన్ పంపించేస్తాడు. ఇక రాజు రౌడీలను చితక్కొడతాడు. దీపక్ దూరం నుంచి చూసి భయపడతాడు. దీపక్ వెంటనే విషయం విజయాంబికకు చెప్పాలని పరుగులు తీస్తాడు. రౌడీలు రాజు నుంచి తప్పించుకొని పారిపోతారు.

దీపక్ విజయాంబికకు చెప్తాడు. రాజు వాళ్ల కంట పడకుండా దీపక్‌ని విజయాంబిక తప్పించుకోమని అంటుంది. ఇంజక్షన్ ఎక్కడుందో నాకు తెలుసు అనిఅంటుంది. విరూపాక్షి ఇంజక్షన్ పట్టుకొని హాస్పిటల్‌కి పరుగులు పెడుతుంది. విజయాంబిక, కోమలిలు విరూపాక్షికి ఎదురు పడతారు. నాకు తెలీకుండా ఇంజక్షన్ రాఘవకు వేయించేసి నా చాప్టర్ క్లోజ్ చేయించాలి అనుకుంటున్నావా.. నా చాప్టర్ క్లోజ్ అవ్వాలి అంటే నాతో తలపడేది కూడా నేను అవ్వాలి అని అంటుంది. మర్యాదగా అడ్డు తప్పుకో విజయాంబిక అని విరూపాక్షి అంటుంది. ఇక విజయాంబిక, కోమలి ఇద్దరూ విరూపాక్షి దగ్గర ఇంజక్షన్ బాక్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. నన్ను నువ్వు దాటి వెళ్లాలి అంటే ఆ దేవుడు దిగిరావాలి అని విజయాంబిక అంటుంది. అప్పుడే సూర్యప్రతాప్ అక్కడికి వస్తాడు. విరూపాక్షిని చూసి విజయాంబిక, కోమలిలు ఇంజక్షన్ బాక్స్ వదిలేస్తారు. ఇప్పుడు నన్ను ఆపు చూద్దాం అని విరూపాక్షి అంటుంది. ఇక సూర్యప్రతాప్ విరూపాక్షితో ఇంజక్షన్ ఇవ్వకుండా ఇక్కడేం చేస్తున్నావ్  అని అడుగుతాడు. విరూపాక్షి ఇంజక్షన్ పట్టుకొని పరుగులు పెడుతుంది. డాక్టర్ ఆ ఇంజక్షన్‌ని రాఘవకి వేస్తాడు. 

విరూపాక్షి సూర్యని చూసి మనసులో మేం రమ్మని చెప్పినా పని ఉంది రాను అన్నావ్ కానీ మేం పిలవకుండా వచ్చావ్ అంటే నా విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని నీకు ఉందని అర్థమైందని విరూపాక్షి అనుకుంటుంది. డాక్టర్ రాఘవకి ఇంజక్షన్ వేస్తాడు. రాజు, రూపలు కూడా బంటీని తీసుకొని వచ్చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget