అన్వేషించండి

Ammayi garu Serial Today November 1st: అమ్మాయి గారు సీరియల్: రాజుని ఇంట్లో నుంచి తరిమేసిన తల్లిదండ్రులు.. అల్లుడి హోదాలో తీసుకెళ్లిన సూర్యప్రతాప్!

Ammayi garu Today Episode రాజుని తల్లిదండ్రులు తరిమేయడం సూర్యప్రతాప్ వచ్చి రూప దగ్గరకు తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రాజుతో ఇంట్లో అందరూ గొడవ పడతారు. లోపలికి రానివ్వరు. విరూపాక్షి కూడా నువ్వు ఇంట్లోకి రావడం ఇష్టం లేదు రాజు అని అంటుంది. నువ్వు వాళ్ల కోసం ఇంత చేస్తే వాళ్లు వదిలేశారు. సూర్యకి బుద్ధి లేదు అంటే నీ పెళ్లాం బుద్ది ఏమైంది ఎలా నిన్ను వదిలేస్తుందని అంటుంది. నీ పెళ్లాం దగ్గరకు వెళ్లు నీకు నేను ముఖ్యమా మీ నాన్న ముఖ్యమా అని అడుగుతుంది. పెద్దయ్యగారు అమ్మాయి గారు ఇద్దరూ వీడికి మందు పెట్టారని ముత్యాలు అంటుంది.

ముత్యాలు: రాజకీయ లబ్ది కోసమే వీడిని వాడుకుంటుంన్నారు. అసలు ఈ క్రిడ్నాప్ కూడా డ్రామాలా ఉంది అమ్మగారు. 
వరాలు: పోలీసులు కూడా వెళ్లని చోటుకి రాజు అన్నయ్యని రప్పించారు అంటే అన్నయ్యని చంపేసి రూపకి వేరే పెళ్లి చేయాలని ప్లాన్ చేసినట్లే కదా. 
రాజు: మీరంతా నా ఓపికను పరీక్షిస్తున్నారు ఇదే మాటలు వేరే ఎవరైనా అంటే ముక్కలు ముక్కలు చేస్తాను.
ముత్యాలు:  చేస్తావు ఆయన బాగు పడరు నాయనా నా కొడుకుని ఇలా చేసిన ఆ పెద్దయ్య గారు కుక్క చావు చస్తారు.
రాజు అమ్మా అని కొట్టడానికి చేయి ఎత్తుతాడు. 
అప్పలనాయుడు: నీకు ప్రాణం పోసిందనే ఒక్క కారణంతో తాను బతికి పోయింది కానీ లేకపోతే చంపేసేవాడివి వద్దు నాయనా ఈ ఇంట్లో ఉంటే నువ్వు అయినా ఉండు లేదంటే మేం అయినా ఉంటాం.
రాజు: వద్దు నాన్న నేనే వెళ్లిపోతా. నన్ను క్షమించమ్మా.
అప్పలనాయుడు: నువ్వు చేయి ఎత్తినప్పుడే మేం చచ్చిపోయాంరా ఇంకా క్షమించడం ఏంటి పోరా బయటకు పోరా. అని తోసేస్తే సూర్యప్రతాప్ వచ్చి పట్టుకుంటాడు.
సూర్యప్రతాప్: నీ పెద్దయ్యనేరా నీ కోసం వచ్చిన నీ పెద్దయ్యని. నువ్వేం బాధ పడకు రాజు నీకు నేను ఉన్నాను నువ్వే ప్రాణంగా బతుకుతున్న నీ అమ్మాయి గారు ఉన్నారు. పద రాజు నీ కోసం అక్కడ ఒక ఇళ్లు ఎదురు చూస్తుంది.
ముత్యాలు: వెళ్లరా అయ్యా వెళ్లు నీ అవసరం ఉంటుందని వచ్చారు.
సూర్యప్రతాప్: రాజు విషయంలో నేను ఏం తప్పు చేశానో నేను తెలుసుకున్నాను. నా వల్ల రాజు ఇబ్బంది పడుండొచ్చు కానీ నేను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు కూడా నా తప్పు తెలుసుకొని రాజుని క్షమాపణ కోరడానికి వచ్చాను అంతే కాదు మీ అందరినీ క్షమించమని అడిగి రాజుని తీసుకెళ్లాలి అనుకున్నా. మీకు నాకే కాదు రాజు లాంటి వాడు దొరకడం ఎవరికైనా వరం లాంటిదే. వీడు బంగారం. నాలాగే మీరు ఒకరోజు మీరు చేసిన తప్పు ఏంటో తెలుసుకుంటారు. ఈ రోజు నేను వచ్చినట్లే మీరు ఒక రోజు వస్తారులే. 
వారాలు: ఇప్పుడు పెద్దయ్యగారు అన్నయ్యని వదలరు లే అమ్మా ఇప్పుడు పెద్దయ్య గారు సీఎం కదా ఒక పీఏ కావాలి కదా అందుకే తీసుకెళ్తున్నారు.
సూర్యప్రతాప్: వరాలు నేను రాజుని అల్లుడిలా తీసుకెళ్తున్నా నా దగ్గర పీఏగా చేయాల్సిన అవసరం నా అల్లుడికి పట్టలేదు.
అప్పలనాయుడు: మీరు అల్లుడు అల్లుడు అంటుంటే బాగుంది కానీ ఈ అల్లుడు ఎంత కాలమో అని భయంగా ఉంది పెద్దయ్యగారు.
ముత్యాలు: అదే సూర్యప్రతాప్ గారు మీ అక్క చెప్పింది అని మేనల్లుడు చెప్పాడని రాజు మీద విషం కక్కుతారు. మీరు గెంటేస్తారు అదే మా భయం.
అప్పలనాయుడు: మీ ప్రాణం కాపాడాడు అని అల్లుడు అని వచ్చారు ఆ కృతజ్ఞత పోగానే గెంటేస్తారు. అప్పుడు మీ రంగు వీడికి అర్థం అవుతుంది.
సూర్యప్రతాప్: నా నిజమైన రంగు వాడికి కాదు మీకు అర్థమయ్యేలా చేస్తా. 

జీవన్‌ కోసమే రాజుని ఇంట్లోకి తీసుకెళ్తున్నారని వరాలు అంటుంది. నిజంగా నేను అంత దుర్మార్గుడినా రాజకీయాలు కోసం కూతురి జీవితం నాశనం చేసేవాడిలా ఉన్నానా అంటే  చెప్పుడు మాటలు విని కట్టుకున్న భార్యని వదిలేసిన మీరు మా కొడుకుని వదిలేయరని ఎలా అనుకుంటామని అంటుంది ముత్యాలు. దానికి సూర్యప్రతాప్ విరూపాక్షితో నువ్వు ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనం అయిపోతుందని ఇప్పుడు అర్థమవుతుందని ఎప్పుడూ కాపురాలు కూల్చడమేనా అని తిడతాడు. నీతో కలవాలి అనుకుంటే ఎన్నో ప్రయత్నాలు చేసేదాన్ని కానీ నీకు నువ్వు నిజం తెలుసుకొని నువ్వు నా భార్య అని తీసుకెళ్తావని విరూపాక్షి అంటుంది. ఇక పోరా నాయనా అని ముత్యాలు వాళ్లు ముఖం మీదే తలుపు వేసేస్తారు.

రాజుని సూర్యప్రతాప్ ఇంటికి తీసుకెళ్తాడు. మొదటి సారి అల్లుడి హోదాలో వస్తున్నావ్ కుడి కాలు పెట్టి లోపలికి రా రాజు అని అంటాడు. ఇక రూపని పిలుస్తాడు. రూప రాజుని చూసి షాక్ అయిపోతుంది. నువ్వు ఇంత కాలం అడిగావ్ కదా నీ రాజుని తీసుకొచ్చానమ్మా అంటే రూప వచ్చి రాజు అని ఎమోషనల్ అయితే విజయాంబిక వచ్చి శత్రువుని అల్లుడిగా అంగీకరిస్తావా అంటే వాడు అజాత శత్రువు వాడు ఎవరికీ శత్రువు కాదు మంచోడని అంటాడు. విజయాంబిక, జీవన్ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌కి 5 కోట్లు ఇచ్చిన మహదేవయ్య కోడలిలో ఛాలెంజ్.. సంజయ్ సంధ్యని ట్రాప్ చేస్తాడా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget