అన్వేషించండి

Satyabhama Serial Today November 1st: సత్యభామ సీరియల్: క్రిష్‌కి 5 కోట్లు ఇచ్చిన మహదేవయ్య కోడలిలో ఛాలెంజ్.. సంజయ్ సంధ్యని ట్రాప్ చేస్తాడా!

Satyabhama Today Episode మైత్రి విషయంలో తలకు మించిన భారం వద్దని నందినికి అన్యాయం చేయొద్దని ఇంట్లో వాళ్లు హర్షకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode క్రిష్‌ బామ్మ ఉందని తెలియక ఆ పొట్టి దాన్ని తాత దగ్గరకు పంపుతా.. చీరకొంగుకి రాకెట్ కట్టి ఎగరేస్తా అని వెటకారంగా మాట్లాడుతాడు. పక్కనే ఉన్న జయమ్మని క్రిష్ సత్య అనుకొని చేయి పట్టుకొని లాగితే జయమ్మ నా నడుం విరిగిపోయిందని తాతలా ఉడుం పట్టు అని కొట్టడానికి వస్తే క్రిష్‌ పారిపోవడానికి ప్రయత్నిస్తే సత్య పట్టుకుంటుంది. మరోవైపు హర్ష హాల్‌లో దిగులుగా ఉంటే తల్లి విశాలాక్షి కాఫీ తీసుకొని వస్తుంది.

విశాలాక్షి: నందినితో గొడవ పడ్డావా..
హర్ష: అలా ఏం లేదమ్మా ఆశపెట్టి నిరాశ పరుస్తానేమో అనిపిస్తుంది. మాట ఇచ్చి తప్పుతానేమో అని భయంగా ఉంది. మైత్రి ప్రయాణానికి డబ్బులు సరిపోవడం లేదు. సాయం చేస్తాను అన్న ఫ్రెండ్ చివరి నిమిషంలో చేయి ఎత్తేశాడు.
విశాలాక్షి: కుదరనప్పుడు ఏం చేస్తాం.
హర్ష: ఏదో ఒకటి చేయాలమ్మా. మైత్రి బాధ్యత నాది. అమ్మ ఏమీ అనుకోను అంటే ఒకటి అడగనా కొద్ది రోజులకు నీ నగలు ఇవ్వమ్మా తాకట్టు పెడతా.
విశ్వనాథం: కుదరదు. ఎన్ని అవసరాలు వచ్చినా నేను ఇంత వరకు మీ అమ్మ నగలు ముట్టుకోలేదు. సాయం చేయడానికి ఓ హద్దు ఉండాలి. మోయలేని బరువు మోయకూడదు. మైత్రి అంటే మాకు అభిమానమే. తన పరిస్థితికి మాకు జాలిగా ఉంది తనకు సాయం చేయాలని మాకు ఉంది. తన కోసం నందినిని సర్దిచెప్తూ వస్తున్నాం. అప్పుడప్పుడు నీ ప్రవర్తన మాకు నచ్చకపోయినా సర్దుకుపోతున్నాం. మైత్రి లైఫ్ సెటిల్ అయితే చాలు అన్నావ్ కానీ నీ మంచితనం లైన్ దాటుతుంది చూడు.
విశాలాక్షి: అవున్నా నాన్న గారు చెప్పింది నిజమే  మనం మధ్య తరగతి వాళ్లం రేపోమాపో సంధ్య పెళ్లి ఉంది.
జయమ్మ: నువ్వు ఇప్పుడు మైత్రి కోసం అందిన చోటల్లా అప్పులు చేస్తే రేపు నీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.
హర్ష: మైత్రి నిశ్సహాయ స్థితిలో ఉంది.

అందరూ హర్షకి మైత్రికి తలకు మించిన సాయం చేయొద్దని నీ చేష్టల వల్ల నందిని ఇబ్బంది పడుతుందని నందినికి అన్యాయం చేయొద్దని అంటారు. నందిని నా భార్య నేను ఎందుకు అన్యాయం చేస్తానని హర్ష అంటాడు. ఇంతలో నందిని అక్కడికి వస్తుంది. విషయం అడిగితే చెప్తారు. మరోవైపు మహదేవయ్య క్రిష్‌కి 5 కోట్ల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ కోసం పార్టీ ఇన్‌ఛార్జికి ఇవ్వమని అంటాడు. సత్య దూరం నుంచి చూస్తుంది. అక్కడ ఉన్న ఓ రౌడీ ఇంత డబ్బు చిన్నబాబుతో వద్దని నర్శింహ దెబ్బ తిన్న పాము లెక్క ఎదురు చూస్తున్నాడని అంటాడు. దాంతో చిన్నా నర్శింహని చంపేస్తా అంటాడు. పోలీసులకు తెలిస్తే ఇబ్బంది అని అంటే అవన్నీ నేను చూసుకుంటా అని క్రిష్ అంటాడు. ఇక ఇంత డబ్బు ఇంట్లో ఉందని ఎవరికీ చెప్పొద్దని క్రిష్‌తో మహదేవయ్య చెప్తాడు.

సత్య గదిలో ఉంటే క్రిష్ వెళ్లి నీ ఎదురు చూపులు ఎంత ముద్దొస్తున్నాయో తెలుసా అని సత్యని దగ్గరకు తీసుకుంటాడు. ఏదో టెన్షన్‌గా ఉన్నావ్ అని క్రిష్‌ అడిగితే మొండోడిని పెళ్లి చేసుకున్నా కదా అంటుంది. దానికి క్రిష్ చెప్పే దారిలో చెప్తే వింటాను అంటే సత్య క్రిష్‌ని హగ్ చేసుకొని డబ్బు తీసుకొని పార్టీ ఇన్‌ఛార్జి దగ్గరకు వెళ్లడం ఆగిపో అంటుంది. క్రిష్‌ కుదరదు అని అంటాడు. బాపు కోసం బాపు ఏం చెప్పినా చేస్తానని క్రిష్‌ అంటాడు. క్రిష్‌ వెళ్లిపోయిన తర్వా త మహదేవయ్య వచ్చి వాడిని ఆపాలి అంటే ఇంకో జన్మ ఎత్తాలని అంటాడు. క్రిష్‌ని ఆపాలంటే నీ తరం కాదని అంటాడు. చిన్నాని సూట్‌ కేస్ తీసుకొని వెళ్లకుండా ఆపమని అంటాడు. సత్య ఏం చేసి అయినా ఆపుతా అనుకుంటుంది.

మరోవైపు సంజయ్ సంధ్యని పరిచయం చేసుకోవడానికి ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో సంధ్య పండగ కోసం ట్రెడీషనల్‌గా రెడీ అయి వెళ్తుంటే సంజయ్ ఆపుతాడు. సంధ్య ఎవరో తెలీయనట్లు ప్రవర్తిస్తే సంధ్య సంజయ్‌కి గుర్తు చేస్తుంది. ఇక సంజయ్ గుడికి వెళ్తానని చెప్తే సంధ్య డ్రాప్ చేస్తా అని అంటుంది. ఇక సంజయ్ సంధ్య స్కూటీ ఎక్కుతాడు. సంధ్య గురించి మాట్లాడుతాడు. నీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా అని అడుగుతాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ గుడికి వెళ్తుంటారు. మరోవైపు సత్య, క్రిష్‌లు కలిసి అమ్మవారికి పూజ చేస్తారు. సత్య పాట పాడుతుంది. పూజ తర్వాత అందరికీ హారతి ఇస్తుంది.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: Jai Hanuman First Look: 'హనుమాన్' సీక్వెల్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్... దీపావళికి 'జై హనుమాన్' ఫస్ట్ లుక్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Embed widget