అన్వేషించండి

Ammayi garu Serial Today November 12th: అమ్మాయి గారు సీరియల్: రాజు, రూపలకు ఫస్ట్‌నైట్ అవ్వలేదని తెలుసుకున్న సూర్యప్రతాప్‌.. రేపే రూపకి, ఎళ్లుండి పింకీకి..! 

Ammayi garu Today Episode రూప, రాజులకు ఇంకా ఫస్ట్ నైట్ కాలేదని రూప గర్భవతిగా గతంలో నటించిందని సూర్యప్రతాప్‌కి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప తండ్రి దగ్గరకు వెళ్లి మనతో పాటు అమ్మ కూడా ఉండాలని అడుగుతుంది. అది జరగదు అని చెప్పి సూర్యప్రతాప్ వెళ్లిపోతాడు. ఇలా ఎందుకు అడిగావ్ అని రాజు రూపని అడుగుతాడు. తప్పు చేసిన వాళ్లు ఇంట్లో దర్జాగా ఉన్నప్పుడు ఏ తప్పు చేయని మా అమ్మ ఎందుకు ఇంట్లో ఉండకూడదు అని రూప అడుగుతుంది. నాన్న అమ్మ గురించి కూడా ఆలోచించాలి కదా అని రూప అంటుంది. 

రాజు: అమ్మగారిని ఇంటికి తీసుకురావాలి అంటే మనకు తెలిసిన నిజం పెద్దయ్యగారికి తెలియాలి.
అప్పలనాయుడు: తన ఇంట్లో.. అంటే ఆ రాఘవని తీసుకురావాలి. 
రాజు: ఆ రాఘవని పెద్దయ్య గారి ముందుకు తీసుకురావాలి.
విరూపాక్షి: రాజు ఎలా అయినా రాఘవని తీసుకొస్తాడని నాకు తెలుసు అప్పలనాయుడు కానీ రాఘవ లేడు అనే ఆలోచననే నన్ను కుదురుగా ఉంచడం లేదు.
ముత్యాలు: మీరే అంటారు కదమ్మగారు మంచి వాళ్లకి మంచే జరుగుతుందని మీకు అదే మంచి జరుగుతుంది. రాఘవ ఎక్కడో ప్రాణాలతోనే ఉంటాడు.
రాజు: రాఘవ ఎక్కడున్నా తీసుకొచ్చి పెద్దయ్య గారి ముందు ఉంచే బాధ్యత నాది.

ఉదయం సూర్యప్రతాన్ తమ్ముడు చంద్రని పిలిచి ఇవాళ మీటింగ్‌లు ఏం వద్దని నా మనసు బాలేదని చెప్తాడు. ఇంతలో పంతులు ఇంటికి వస్తాడు. విజయాంబిక వచ్చి తానే పిలిపించానని చెప్తుంది. పింకీ, జీవన్‌ల ఫస్ట్‌నైట్ కోసం పంతుల్ని పిలిపించానని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. 

సూర్యప్రతాప్: రూప విషయంలో తండ్రిగా ఏం చేయలేకపోయాను. తాను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు దగ్గరకు తీసుకోలేపోయాను. చివరకు నా కోసం తన బిడ్డని చంపుకుంది. కానీ నేను మాత్రం వాళ్లని దగ్గరకు తీసుకోలేకపోయాను. అన్నీ మంచిగా జరిగి ఉంటే ఈ పాటికి ఈ ఇంట్లో కూడా ఓ బిడ్డ ఆడుకుంటూ తిరిగేది.
రాజు: అమ్మాయి గారు పెద్దయ్యగారు అదంతా నిజం అనుకుంటున్నారు అబద్ధంఅని తెలిస్తే మనల్ని క్షమించరు. పెద్దయ్య గారికి నిజం చెప్పేస్తాను.
రూప: రాజు నిజం చెప్తే మనల్ని క్షమించరు రాజు. మనం చెప్పింది చిన్న అబద్ధం కాదు. ప్రెగ్నెన్సీ డ్రామా అని తెలిస్తే అస్సలు ఊరుకోరు. ఈ విషయం చెప్పకపోతే మంచిది. అందరూ దీన్ని మర్చిపోయారు. నువ్వు నిజం చెప్పి కొత్త సమస్యలు తీసుకురావొద్దు.

రూప రాజులు మాట్లాడుకోవడం అందరూ వినేస్తారు. విజయాంబిక సూర్యప్రతాప్‌కి రాజు, రూపలు మోసం చేశారని చెప్తుంది రూప తానేం తప్పు చేయలేదు అని మేం పెళ్లి అయి మూడేళ్లు అయినా భార్యభర్తలుగా కలిసి లేమని చెప్తుంది. మీ అంగీకారం లేకుండా మేం కలిసి ఉండాలి అనుకోలేదని అంటుంది. ఇక రాజు కూడా శ్వేతతో పెళ్లి ఆపడానికి వచ్చిన రూప కళ్లు తిరిగి పడిపోయిందని ఆ టైంలో డాక్టర్ రూప ప్రెగ్నెంట్ అని చెప్పిందని తాము కూడా షాక్ అయినప్పటికీ పెళ్లి ఆపడానికి ఆ అబద్దం వాడుకున్నామని అంటాడు. జీవన్ మనసులో ప్రెగ్నెన్సీ నాటకం ఆడి తన చెల్లిని మోసం చేశారని జీవితంలో రూపకి ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తానని అనుకుంటాడు. దీపక్, విజయాంబిక ఎంత సూర్యప్రతాప్కి తగిలించాలని చూసినా సూర్యప్రతాప్ నా మీద గౌరవంతో ఉండిపోయారని వాళ్లని దగ్గరకు తీసుకుంటాడు.  

సూర్యప్రతాప్‌ ఇక పంతులుతో రాజు, రూపల ఫస్ట్‌నైట్‌కి ముహూర్తం పెట్టమని అంటాడు. ఇక పంతులు రూప వాళ్లకి రేపు, పింకీ వాళ్లకి ఎల్లుండి ముహూర్తం పెడతాడు. విజయాంబికకు రూప వాళ్ల ఫస్ట్ నైట్ బాధ్యతల్ని కూడా సూర్యప్రతాప్‌ అప్పగిస్తాడు. రాజు, రూపలు జరిగింది తలచుకొని చాలా సంతోషిస్తారు. ఇక రాజు రేపు తన తల్లి పుట్టిన రోజు అని బాధ పడతాడు. ఇక ముత్యాలు కూడా ప్రతీ సంవత్సరం తన కొడుకే దగ్గరుండి గుడికి తీసుకెళ్లి కేక్ కట్ చేయించేవాడని ఈ సారి దూరంగా ఉంటే పుట్టిన రోజు ఎలా జరిపించుకోవాలని బాధ పడుతుంది. ఇంట్లో అందరూ ముత్యాలుకి ఒప్పించే ప్రయత్నం చేస్తారు. రాజు కూడా తన తల్లిదండ్రులు తనని గుర్తు చేసుకోరని అనుకుంటాడు. ఇంతలో మందారం విరూపాక్షికి కాల్ చేస్తుంది. రాజు, రూపల తొలిరేయికి సూర్యప్రతాప్‌ ముహూర్తం పెట్టించారని చెప్తుంది. రేపు కుదిరితే వాళ్లని గుడికి తీసుకురమ్మని విరూపాక్షి మందారంతో చెప్తుంది. ఇక విరూపాక్షి ముత్యాలుకు రాజుని చూపించాలని అనుకుంటుంది. ఇక మందారం రూపని పిలిచి రాజు తల్లిదండ్రులు గుడికి వస్తున్నారని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: కథ ఇప్పుడు నా చేతిలో ఉందని మామకి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన సత్య.. మైత్రి కోసం టెన్షన్ పడుతున్న హర్ష!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Allu Arjun: వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desamఆర్టీసీ బస్సులో పంచారామాలు, ఒక్క రోజులో వెయ్యి కిలో మీటర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Allu Arjun: వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
Meenaakshi Chaudhary : 'మట్కా'తో మీనాక్షి చౌదరిపై మళ్లీ అదే ట్యాగ్ పడిందా .. అయినా అమ్మడు చాలా బిజీ!
'మట్కా'తో మీనాక్షి చౌదరిపై మళ్లీ అదే ట్యాగ్ పడిందా .. అయినా అమ్మడు చాలా బిజీ!
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
Srikakulam Politics: సిక్కోలు పార్టీ ప్రక్షాళనపై జగన్ దృష్టి - తమ్మినేని సీతారామ్ అవుట్ - నెక్ట్స్ ఎవరో ?
సిక్కోలు పార్టీ ప్రక్షాళనపై జగన్ దృష్టి - తమ్మినేని సీతారామ్ అవుట్ - నెక్ట్స్ ఎవరో ?
Embed widget