Ammayi garu Serial Today March 5th: అమ్మాయి గారు సీరియల్: విజయాంబిక, విరూపాక్షిల సమరం షురూ.. సూర్య సపోర్ట్‌తో చెలరేగిపోతున్న సూర్పణక!
Ammayi garu Today Episode విజయాంబిక, విరూపాక్షి ఇద్దరూ నామినేషన్ వేసి ప్రచారం చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode పార్టీ నేతలు ఎమ్మెల్యేగా రూపకి పోటీ చేయమంటే రూప తనకు అనుభవం లేదని వద్దని అనేస్తుంది. దాంతో సూర్య ప్రతాప్ అక్క విజయాంబికకు ఎమ్మెల్యేగా పోటీ చేయమని పార్టీ నేతలు చెప్తారు. రూప ఇలా జరిగింది ఏంటా అనుకుంటుంది. రాజు, తల్లి విరూపాక్షితో విషయం చెప్తుంది. వాళ్లు రూపనే పోటీలో ఉండమని అంటారు. రూప తన నిర్ణయం చెప్తే సరికి సూర్య ప్రతాప్ తన అక్కని బరిలో దించేస్తాడు.
విజయాంబిక దీపక్ వాళ్లతో ఎమ్మెల్యే అవ్వగానే సూర్యప్రతాప్‌ని నాశనం చేస్తానని రాజు, రూపల జీవితం కూడా నాశనం చేస్తానని జీవన్‌కి చెప్పి మాట్లాడుతుంది. ఆ మాటలు రూప విని భర్త, తల్లితో చెప్తుంది. కుటుంబాన్ని భర్తని కాపాడుకోవాలి అంటే విరూపాక్షి పోటీలో ఉండాలని రాజు చెప్తే రూప కూడా తల్లిని ఒప్పిస్తుంది. ఉదయం సూర్యప్రతాప్, విజయాంబికతో పాటు ఫ్యామిలీ అంతా నామినేషన్ వేయడానికి వెళ్తారు. చంద్ర మనసులో అక్కని ఎమ్మెల్యే చేయడం నచ్చలేదని అనుకుంటాడు. రూప నామినేషన్ వేయడానికి తన తల్లి వస్తుందా రాదా అనుకుంటుంది. విజయాంబిక నామినేషన్ వేస్తుంది. వేరే ఎవరూ నామినేషన్ వేయకపోతే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని మాట్లాడుకుంటారు. తమకు పోటీగా ఎవరూ రారని పార్టీ నేతలు అనుకుంటారు. రూప తల్లి నిర్ణయం ఏంటో అని తల్లి పోటీగా వస్తే బాగున్ను అని దండం పెట్టుకుంటుంది. నామినేషన్ వేయడానికి టైం అయిపోతుంది ఇక ఎవరూ రారని విజయాంబిక అంటుంది. ఇంతలో విరూపాక్షి వస్తుంది.
రాజు, విరూపాక్షిలను చూసి సూర్య ప్రతాప్‌తో పాటు అందరూ షాక్ అయిపోతారు. ఇండిపెండెంట్‌గా విరూపాక్షి నామినేషన్ వేస్తుంది. నా తమ్ముడి కంచుకోటలో గెలుస్తాను అనుకోవడం నీ భ్రమ అని విజయాంబిక అంటుంది. దాంతో సూర్య ఎవరైనా పోటీ చేయని కానీ నేను నిన్ను గెలిపించుకుంటాను అని సూర్య అంటే ఇద్దరినీ ఆల్‌ది బెస్ట్ అని విరూపాక్షి అంటుంది. రాజు అయ్యగారు అయ్యగారు అని తిరిగి ఇప్పుడు విరూపాక్షి వెళ్లాడని విజయాంబిక అంటే దానికి అప్పలనాయుడు అమ్మా సూర్పణక నా కొడుకుకి అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత ఇద్దరికీ ఇప్పుడూ నా కొడుకు హనుమంతుడు అని దేవుడి లాంటి అయ్యగారు అన్యాయాన్ని అందలం ఎక్కిస్తుంటే చూడలేక అమ్మగారికి సపోర్ట్ చేస్తున్నాడని అంటారు. సూర్య ప్రతాప్ సపోర్ట్ నీకే ఉంటుందని విజయాంబికకు తమ్ముడు చెప్తాడు. ఇక విరూపాక్షి సూర్య ఆశీర్వాదం తీసుకోవాలి అంటే సూర్య వెళ్లిపోతాడు. ఇక రూప తల్లికి ఆల్‌ది బెస్ట్ చెప్పి తన తల్లికి సపోర్ట్ చేసిన వాళ్లకి థ్యాంక్స్ చెప్తుంది.
ఇరు వైపులా ప్రచారం సాగిస్తారు. అందరూ విజయాంబికని చూసి మీ వెనక అయ్యగారు ఉన్నారు మీదే విజయం అంటారు. మీ అండ ఉంటే నేను గెలుస్తా అని విరూపాక్షి ప్రచారం చేస్తుంది. విజయాంబిక, విరూపాక్షి ఒకరికి ఒకరు ఎదురవుతారు. నేను చేసిన మంచి నిన్ను గెలిపిస్తుందని అని సూర్య అంటాడు. ఒకరికి ఒకరు ఛాలెంజ్ చేసుకుంటారు. ప్రచారంలో భాగంగా విజయాంబిక చిన్న పిల్లాడికి స్నానం చేయిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!





















