Ammayi garu Serial Today March 31st: అమ్మాయి గారు సీరియల్: జీవన్‌కి వార్నింగ్ ఇచ్చిన రాజు, రూపలు.. మాధవి జీవన్ మనిషి అని కనిపెట్టేశారుగా!
Ammayi garu Today Episode మాధవి జీవన్ ఇంటి దగ్గర నుంచి వచ్చిందని మాధవి జీవన్ మనిషి అని రాజు, రూపలు కనిపెట్టేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప, రాజులు విరూపాక్షితో మాట్లాడుతారు. నాన్నకి ఏం కాలేదు రెండు రోజులు రెస్ట్ తీసుకోమన్నారని రూప చెప్తుంది. ఇక రాజు విరూపాక్షితో ఇదంతా మీ వల్లే జరిగిందని విజయాంబిక, దీపక్‌లు తగిలించారని చెప్తాడు. అంతా నా ఖర్మ అని విరూపాక్షి బాధ పడితే దానికి రాజు రాఘవని పెద్దయ్యగారి ముందు పెడితే నిజం తెలిస్తే అప్పుడు మీరేంటో తెలుస్తుందని అంటాడు.
రాఘవని జీవనే దాచిపెట్టుంటాడని నేను వెళ్లి రేపే తీసుకొస్తానని చెప్తాడు. బంటి గురించి రాజు అడిగితే కొంచెం బెంగ పెట్టుకున్నాడు కానీ మేం జాగ్రత్తగా చూసుకుంటున్నామని విరూపాక్షి చెప్తుంది. రాత్రి రాధిక(మాధవి) ఇంటి వెళ్తుంటే గొర్రె మాధవి వెంట పడుతుంది. బుజ్జి తల్లి ఆగవే అని గొర్రె మాట్లాడుతూ తనని పొగుడుతుంటే మాధవి షాక్ అయిపోతుంది. గొర్రె మాట్లాడటమేంటి అని అనుకుంటుంది. ఇక గొర్రె మాధవిని బుజ్జితల్లి అంటూ ఫాలో అవుతుంది.ఏంటి నువ్వు మనిషిలా మాట్లాడుతూ మనిషిలా ఫ్లర్ట్ చేస్తున్నావ్ అంటే దానికి గొర్రె నేను రేణుకని పెళ్లి చేసుకుంటే ఇప్పటి వరకు మర్చిపోలేకపోయా.. నువ్వు నన్ను మర్చిపోయేలా చేశావ్ బుజ్జితల్లి పెళ్లి చేసుకుందాం మనం అని గొర్రె అనగానే మాధవి పరుగులు తీస్తుంది.
రాజు, రూపలు ఉదయం రాఘవని పట్టుకోవడానికి జీవన్‌ని చాటుగా ఫాలో అవ్వాలని వెళ్తారు. ఇక రాధిక(మాధవి) జీవన్‌ని కలుస్తుంది. ఒక్క పని కూడా సరిగా చేయలేవా అని తిడతాడు. సంతకం పెట్టకుండా ఆ ఘనకార్యం చేసింది దీపక్ అనే చెప్తుంది. మాధవి, జీవన్‌లు మాట్లాడుతూ ఉంటే రాజు, రూపలు వస్తుంటారు. ఇక వశీకరణ మందు ఎందుకు తాగించలేదు అని తిడతాడు. రూప వాళ్లు వచ్చి చాటుగా డోర్ నుంచి మాటలు వింటుంటారు. ఇద్దరూ లోపలకి వెళ్లేసరికి జీవన్ చూసి షాక్ అవుతాడు. మాధవి సోఫా వెనకాలే దాక్కుంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావని రూప అడుగుతుంది. జీవన్ ఫోన్లో మాట్లాడుతున్నా అని కవర్ చేస్తాడు.
రాఘవని ఎక్కడ దాచావని రాజు అడుగుతాడు. నాకు సంబంధం లేదని జీవన్ అంటే నాకు సంబంధించిన అందరినీ నువ్వే దాస్తున్నావ్ అని నా కొడుకుని కిడ్నాప్ చేసిన రోజే నిన్ను చంపాల్సింది కానీ రాఘవ ఉన్నాడని ఏం చేయలేదని అంటాడు. రూప జీవన్‌తో ఇప్పటికీ నువ్వు బతికే ఉన్నావంటే రాఘవ నీ దగ్గర ఉండటం వల్లే అని అంటుంది. దాంతో జీవన్ రాఘవని నేను దాచాను అయితే ఏంటి వాడు మీకు దొరకడు అంటాడు. రాజు జీవన్ గొంతు పట్టుకొని రాఘవ గురించి అడుగుతాడు. రాఘవ ఎక్కడున్నాడో కొట్టినా చంపినా చెప్పను అంటాడు. ఇద్దరూ జీవన్‌కి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు. ఇక జీవన్ మాధవితో ఒక్క రోజులో సంతకం పెట్టించమని చెప్తాడు.
రూప, రాజులు రాఘవ గురించి మాట్లాడుకుంటారు. మాధవి వచ్చి పలకరించి వెళ్తుంది. మాధవి వెళ్తూ స్లిప్ అవుతుంది. మాధవి చెప్పు చూసిన రూప జీవన్ ఇంటి దగ్గర చూసిన చెప్పులను గుర్తు చేసుకుంటుంది. ఇక రాజు హ్యాండ్ బ్యాగ్ చూసి జీవన్ ఇంటి దగ్గర చూసింది ఇదే బ్యాగ్, చెప్పులు అనుకుంటారు. ఇద్దరూ వెళ్లి మాధవిని ఆపుతారు. మీరు జీవన్ వర్క్ చేస్తున్నారా అని ప్రశ్నిస్తారు. జీవన్ ఇంటి దగ్గరే ఉన్నారు అంటే లేదు నేను నా బాబుని డ్రాప్ చేయడానికి వెళ్లానని అంటుంది. ఇద్దరూ పొరపాటు పడ్డారని క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పేసి వెళ్లిపోతుంది. మాధవి మీద ఒక కన్నేద్దామని వెళ్తారు. మాధవిని ఫాలో అవుతూ మాధవిని జీవన్ కాల్ చేయడం మాధవి మాట్లాడటం రూప, రాజులు చాటుగా వింటారు. ఇద్దరూ తనని ప్రశ్నించారని తెలివిగా తప్పుకున్నానని చెప్తుంది. ఫైల్ మీద సంతకం పెట్టించాలి అని అంటుంది. ఆ మాట విని రూప రాజులు షాక్ అయిపోతారు. మాధవి రావడం చూసి దాక్కుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: సీఈఓ స్థానం కావాలన్న ఫణి.. బాల ఆస్తులకు సర్వ హక్కులు త్రిపురవే!





















