బార్లీ నీళ్లలో పోషకాలు నిండుగా ఉంటాయి. దీనిని సమ్మర్​లో తాగితే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయట.

ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరం కోల్పోయిన ఫ్లూయిడ్స్​ని అందించి హైడ్రేటెడ్​గా ఉంచుతాయి.

బాడీ హీట్​ని తగ్గించి.. శరీరాన్ని చల్లబరుస్తాయి. హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని దూరం చేస్తాయి.

దీనిలోని ప్రోబయోటిక్, ఫైబర్ వంటి లక్షణాలు గట్ బ్యాక్టిరియాను మెరుగుపరిచి జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బార్లీ నీళ్లు ఇన్​ఫ్లమేషన్​ని తగ్గిస్తాయి. ఆర్థరైటిస్​ని దూరం చేస్తాయి.

బీపీని కంట్రోల్ చేసి.. గుండె సమస్యలను దూరం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

హెల్తీ స్కిన్​ని ప్రమోట్ చేసే విటమిన్స్, మినరల్స్ బార్లీ నీళ్లల్లో ఉంటాయి. ఇవి వృద్ధాప్యఛాయలను దూరం చేస్తాయి.

బార్లీ నీళ్ల కోసం ఓ కప్పు బార్లీ తీసుకుంటే వాటిని రాత్రంతా నానబెట్టాలి.

ఉదయాన్నే వాటిని కడిగి.. 4 కప్పుల నీళ్లు వేసి ఉడికించాలి. ఇలా చేసిన నీటిని తాగాలి.

సమ్మర్​లో వీటిని రెగ్యులర్​గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ఫలితాలు ఉంటాయి.