Ammayi garu Serial Today July 29th: అమ్మాయి గారు సీరియల్: బంటీ గోల తట్టుకోలేక రూప-రాజుల ఫస్ట్‌నైట్ ఏర్పాటు.. కొంప కూల్చే ప్లాన్‌తో విజయాంబిక!
Ammayi garu Serial Today Episode July 29th బంటీ చెల్లో తమ్ముడో కావాలని గోల చేయడం, రుక్మిణి, రాజులకు ఫస్ట్‌నైట్‌కి ఏర్పాటు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రుక్మిణితో రాజు, విరూపాక్షిలు నిజం చెప్పేయమని అంటారు. నాన్నని నేను మోసం చేయడం లేదమ్మా.. నిజం నాన్నకి తెలియాలి అనుకుంటున్నా అందుకు ఈ అవతారం సరిపోదు అంటే ఎన్ని అవతారాలు ఎత్తడానికి అయినా రెడీ అని రుక్మిణి చెప్తుంది. అనవసరంగా మనం కంగారు పడుతున్నామని రాజు విరూపాక్షితో అంటాడు.
విరూపాక్షి కూతురు అల్లుడితో నా జీవితం అయిపోతుంది.. నా గురించి వదిలేయండి మీరు బాగుండాలి అని అంటే రాజు కూడా ఇవన్నీ వదిలేయండి రాఘవ దొరికితే అన్నీ సెట్ అయిపోతాయని రాజు అంటాడు. రాఘవ దొరికే వరకు రూపే రుక్మిణి అని తెలీకుండా ఉండాలని విరూపాక్షి దండం పెట్టుకుంటుంది. విజయాంబిక దీపక్‌తో రూప ఎన్ని జరిగినా తనే రూప అని ఒప్పుకోదు కాబట్టి అసలైన ఆట ఇప్పుడు ఆడుదాం.. రూప తానే రూపని చెప్పేయాలని అనుకున్నా చెప్పలేకపోయేలా చేయాలని అంటుంది. వాళ్లు ప్రస్తుతం రాఘవని మీద ఉన్నాయి కాబట్టి మనం ఈ ఆట ఆడేయాలని అంటుంది.
సూర్యప్రతాప్ రుక్మిణి జాతకం గురించి టెన్షన్ పడతాడు. రూపకి ఉన్నట్లే రుక్మిణికి కూడా ప్రమాదాలు ఉంటే ఎలా కాపాడుకోవాలి అని చాలా ఆలోచిస్తుంటాడు. రుక్మిణిని కాపాడుకోకపోతే నేను ఉండి ప్రయోజనం ఏంటి ఎలా అయినా రుక్మిణిని కాపాడుకుంటా అని అనుకుంటాడు. బంటి బాధగా హాల్‌లో కూర్చొంటాడు. సుమ పాలు తాగమని ఇస్తే వద్దు అంటే చంద్ర తాగమని అంటాడు. దానికి వద్దు తాతయ్య అని బంటీ అరుస్తాడు. రాజు కోప్పడితే విరూపాక్షి బంటీని బుజ్జగించి నీకు ఏం కావాలి బంటీ అంటుంది. సూర్యప్రతాప్ వచ్చి బంటిని చూసి ఏమైందని అడుగుతాడు. బొమ్మలు కావాలా అంటే వద్దు అవి నాతో ఆడుకోవు.. మా ఫ్రెండ్స్‌కి ఆడుకోవడానికి ఎవరో ఒకరు ఉంటారు నాకు ఎవరూ తోడు లేరు నాకు అలాగే ఆడుకోవాలి అని ఉంది కానీ నాకు ఎవరూ లేరు కదా అని బాధపడతాడు.
బంటీ తనకు చెల్లి, తమ్ముడో కావాలని అర్థమైన సుమ ఎవరో ఎందుకు బంటీ త్వరలో నీకు తమ్ముడో చెల్లో వస్తుందని అంటుంది. బంటీ సంతోషంతో నాకు చెల్లో, తమ్ముడో కావాలి తాతయ్య అంటాడు. చంద్ర బంటీతో నీకు చెల్లో తమ్ముడో వస్తాడు నేను తాతయ్యతో చెప్తాను నువ్వు వెళ్లు అంటాడు. దీపక్ తల్లితో ఈ బంటీ ఏంటి మమ్మీ వాడికి తెలీకుండా రాజు, రుక్మిణిలకు శోభనం అని అడుగుతున్నాడు. చంద్ర అన్నయ్యతో రాజు, రుక్మిణిల తొలిరేయికి ముహూర్తం పెట్టిద్దామని అంటాడు. సూర్యప్రతాప్ సైలెంట్‌గా వెళ్లిపోతాడు. విజయాంబిక కొడుకుతో రాజు, రూపల తొలిరాత్రి ముహూర్తాన్ని వాళ్లకి ఆఖరి రాత్రిగా మార్చేస్తా అంటుంది.
సుమ, మందారం గదిని సర్దుతారు. రాజుకి రూప అంటే ప్రాణం రూప స్థానంలోకి ఎవరూ రాలేరు అనుకున్నా కానీ రుక్మిణి వచ్చింది.. బంటీ వల్ల ఆ ముచ్చట కూడా తీరిపోతుందని నాకు చాలా సంతోషంగా ఉందని అంటుంది. రూపని విరూపాక్షి రెడీ చేస్తుంది. రూప తల్లితో నాన్నకు అంటే తెలీదు నీకు తెలుసు కదమ్మా మళ్లీ ఎందుకు ఇలా రెడీ చేస్తున్నావ్ అని అడుగుతుంది. మీరు మొదటి నుంచి మా గురించి తప్ప మీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.. ఇప్పుడు అయినా మీ కోసం ఆలోచించుకోండి.. మీమధ్య భార్యభర్తల మధ్య ఉండాల్సిన గిల్లిగజ్జాలు లేవు..సంతోషం లేదు.. ఇప్పుడైనా సంతోషంగా ఉండండి అంటుంది. బంటి వచ్చి అమ్మమ్మ మీరు ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. మీ అమ్మని రెడీ చేస్తున్నా బంటీ అని విరూపాక్షి అడిగితే అమ్మ ఎక్కడికి పోతుందని బంటీ అడుగుతాడు. ఇద్దరూ ఏం చెప్పాలో అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఈ సీన్ భలే కామెడీగా ఉంటుంది.
విరూపాక్షి ఏం చెప్పాలో అర్థం కాక నీకు తర్వాత చెప్తా మీ నాన్న రెడీ అయ్యారో లేదో చూడు అంటుంది. దాంతో నాన్న కూడా రెడీ అయ్యారా అయితే నాన్ననే అడుగుతా అని పరుగులు తీస్తాడు. విరూపాక్షి, రూపలు నవ్వుకుంటారు. రాజు రూపకి రాబోయే ప్రమాదం గురించి ఆలోస్తాడు. ఏ ప్రమాదం అయినా తనని దాటుకొని వెళ్లాలి అనుకుంటాడు. బంటీ రాజు దగ్గరకు వచ్చి నువ్వు రెడీ అయ్యావు.. అమ్మ రెడీ అయింది.. నన్ను తీసుకెళ్లరా అని అడుగుతాడు. నేను తీసుకెళ్తా అని చంద్ర అంటాడు. ఇక బంటీ సుమ, మందారం దగ్గరకు వెళ్లి ఏంటి గది రెడీ చేశారు అంటాడు. నీకు తమ్ముడో చెల్లో కావాలి కదా అందుకే ఇలా అమ్మానాన్నల కోసం గది రెడీ చేశామని అంటారు. సూర్యప్రతాప్ రుక్మిణి దగ్గరకు వెళ్తాడు. నీ జీవితం కాపురం బాగుండాలని దేవుణ్ని కోరుకుంటాను. ఇప్పుడు నాకు మరో కోరిక ఉందమ్మా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















