Jagadhatri Serial Today July 29th: జగద్ధాత్రి సీరియల్: బాబు విషయంలో యువరాజ్ మోసం బయటపెట్టిన జగద్ధాత్రి.. 25ఏళ్ల గౌరవం కేథార్‌కి దక్కుతుందా!
Jagadhatri Serial Today Episode July 29th కౌషికి బాబుకి ఫేక్ డీఎన్‌ఏ రిపోర్ట్స్ చేయించింది యువరాజ్‌నే అని జగద్ధాత్రి, కేథార్ నిరూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode గిరిధర్‌రాజు తన ప్రియురాలు గీతని, తనని డబ్బు ఇవ్వమని బెదిరించిన రాజుని చంపేశానని ఒప్పుకుంటాడు. పోలీస్ గిరిధర్రాజుని కేడీ, జేడీలు అరెస్ట్ చేస్తారు. సాధు సార్ ముందు గిరిధర్‌రాజుని ఉంచుతారు. తనని క్షమించమని గిరిధర్ రాజు బతిమాలినా కేడీ, జేడీలు శిక్షపడుతుందని అంటారు. సాధుసార్ జేడీ, కేడీలను మెచ్చుకుంటారు.
సాధుసార్ ఎవిడెన్స్‌గా ఉన్న డైరీని జేడీకి ఇచ్చి ముందు మీ ఇంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి.. తర్వాత ఆ బాధితులందరికీ విషయం చెప్పమని అంటారు. డైరీ రేపు హేండ్‌ఓవర్ చేస్తామని అంటారు. ఆదిలక్ష్మీ కాఫీ తాగుతుంటే యువరాజ్, నిషి,వైజయంతిలు వచ్చి గడువు అయిపోయింది మీరు రిలాక్స్ అయిపోండి కౌషికి ఆస్తి మొత్తం ఆబాబుకి వెళ్లిపోతుంది మీ మనవరాలికి ఇక ఏం మిగలదు అని రెచ్చగొడతారు. దాంతో ఆదిలక్ష్మీ అంత ఎత్తుకు లేస్తుంది. కౌషికి, సురేశ్‌లను పిలుస్తుంది. గడువు అయిపోయింది బాబు మీ బాబు అని నిరూపించలేకపోయారు.. బాబుని అనాథాశ్రమంలో వదిలేస్తా అని అంటుంది.
సుధాకర్ ఆవిడతో ఈ రోజు రాత్రి వరకు గడువు ఉంది కదా అంటాడు. ఆదిలక్ష్మీ కౌషికితో నీకు నేను సురేశ్ కావాలా లేక ఆ బాబు కావాలా తేల్చుకో.. మేం కావాలి అంటే బాబుని వదిలేయ్ అంటుంది. బాబు కౌషికి బిడ్డే అని అంటారు. పిల్లాడా మేమా అని అడుగుతుంది. నిషిక వాళ్లు భర్త కంటే ఎవరూ ఎక్కువ అవ్వకూడదు బాబుని ఇచ్చేయండి అంటారు. ఆదిలక్ష్మీ బాబుని లాక్కోవడానికి ప్రయత్నిస్తే కౌషికి ఆదిలక్ష్మీని నెట్టేస్తుంది. తర్వాత లేచి తనని ఎవరు ఆపాలని చూసినా నేను ఆ పిల్లాడు చచ్చినట్లు అని ఒట్టు పెట్టి బాబుని తీసుకుంటుంది. బాబుని తీసుకొని వెళ్తుంటే కౌషికి, సురేశ్‌లు బతిమాలుతూ ఉంటారు.
నిషిక భర్తతో ఆవిడను ఫాలో అయి బాబుని అనాథాశ్రమంలో వదిలేసిన తర్వాత వాడిని నువ్వు తీసుకొచ్చే మనం ఎక్కడికి పంపాలో ఆలోచిద్దాం అని అంటుంది. ఆదిలక్ష్మీ బాబుని తీసుకొని వెళ్తుంటే జగద్ధాత్రి, కేథార్‌లు వస్తారు. బాబుని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది జగద్ధాత్రి. ఉండాల్సిన చోటుకే తీసుకెళ్తున్నా అని ఆదిలక్ష్మీ అంటే బాబుని ఎక్కడికీ తీసుకెళ్లాల్సిన పని లేదు బాబు కౌషికి అక్క కొడుకే అని నిరూపించే సాక్ష్యం తీసుకొచ్చామని కేథార్ అంటాడు. అవన్నీ మీరు పుట్టించినవి నన్ను ఆపే హక్కు మీకు లేదు అని అంటుంది.
జగద్ధాత్రి కోపంగా మీకు కూడా తల్లీబిడ్డని దూరం చేసే హక్కు లేదని అంటారు. రాజు రాసిన డైరీ కేథార్ చూపించి డబ్బు ఇచ్చి ఫేక్ రిపోర్ట్స్ రాయించారని అంటారు. ఎవరు ఇలా చేశారా అని అందరూ అడిగితే యువరాజ్ అని చెప్తారు. యువరాజ్ వాళ్లు షాక్ అయిపోతారు. యువరాజ్ తనకు ఏం తెలీదు అని అంటాడు. యువరాజ్ అనే పేరు సిటీలో చాలా ఉంటాయి కదా అని నిషికి అంటే ఉండొచ్చు కానీ డీఎన్ఏ టెస్ట్ చేయించింది మనమే కదా అంటాడు. మనకి గిట్టని వాళ్లు ఇలా చేసుంటారని వైజయంతి, నిషిక అంటారు. కౌషికి నిజం నిరూపణ అవ్వకుండా యువరాజ్‌ని ఏం అనను అని జాగ్రత్త యువరాజ్ అని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది.
ఆదిలక్ష్మీ అప్పటికీ ఒప్పుకోకపోతే ఒరిజినల్ డీఎన్‌ఏ టెస్ట్ రిపోర్ట్స్ చూపిస్తారు. అందరం రేపు గుడికి వెళ్దామని జగద్ధాత్రి, కేథార్‌కి ఏం పని పెట్టుకోవద్దని అంటుంది. నిషికి ఫ్యామిలీ అని వాళ్లని ఎందుకు పిలుస్తున్నారు అని అడిగితే వాళ్లు కూడా ఫ్యామిలీనే వాళ్లు వస్తున్నారు ఇదే ఫైనల్ అని కౌషికి అంటుంది. ఆదిలక్ష్మీ అక్కడి నుంచి ఊరు వెళ్లిపోతా అని వెళ్లిపోతుంది. నిషిక, యువరాజ్, వైజయంతిలు మీటింగ్ పెడతారు.
పాతికేళ్లగా మన ఫ్యామిలీ మాత్రమే గుడికి వెళ్తున్నాం ఇప్పుడు మనతో వాళ్లు ఎందుకు అని అడిగితే వాళ్లు మన ఫ్యామిలీ అని మామయ్య అన్నారు. ఏంటి ఇదంతా అని నిషిక అంటుంది. రేపు మేం గుడికి రామని యువరాజ్, నిషిక అంటారు. గుడిలో అందరూ ఎవరు వాళ్లు అంటే తమ్ముడు లాంటి వాళ్లు కొడుకు లాంటి వాళ్లు అని చెప్తారు మేం రామని అంటారు. వాళ్లే రాకుండా ఏదో ఒకటి చేద్దామని వైజయంతి అంటుంది. దాంతో నిషిక వాళ్లతో జగద్ధాత్రి, కేథార్‌లకు ఉదయం మెలకువ రాకుండా మత్తు మందు ఇచ్చేద్దాం అని అంటుంది. ప్లాన్ ఓకే కానీ జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు.
యువరాజ్ రాత్రి ఒంటరిగా తిరుగుతూ రాజు చచ్చి నా ప్లాన్ అంతా నాశనం చేశాడు. లేదంటే ఈ ఇంటికి నేను మాత్రమే వారసుడిని అయ్యేవాణ్ని కానీ బాబు అక్క కొడుకే అని తెలిసిపోయింది ఛా అనుకుంటాడు. ఇంతలో కౌషికి అక్కడికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















