Ammayi garu Serial Today july 24th: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షి, సూర్యలపై విషప్రయోగం.. రాఘవని తీసుకొచ్చేసిన ఆనంద్.. అంతలోనే?
Ammayi garu Serial Today Episode july 24th విరూపాక్షి, సూర్యప్రతాప్‌లకు విజయాంబిక విషం పెట్టాలనుకోవడం, రాఘవని తీసుకొని ఆనంద్ రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప, విరూపాక్షి వాళ్లు ప్రసాదం తయారు చేసి అమ్మవారికి సమర్పించడానికి ఆకుల్లో పెట్టి తీసుకొస్తారు. అందరూ దండం పెడుతున్న టైంలో విజయాంబిక ఎవరూ చూడకుండా చాటుగా విషాన్ని విరూపాక్షి ప్రసాదంలో కలిపేస్తుంది. పంతులు ప్రసాదాన్ని ముందుగా మీ భర్తలకు తినిపించి తర్వాత మీరు తినండి అని చెప్తారు.
విరూపాక్షి, రూప, మందారం, సుమ అందరూ ఆకుల్లో ప్రసాదం తమ భర్తల దగ్గరకు తీసుకెళ్తారు. దీపక్ అందరి ప్రసాదాల్లో కలిపేశావా మమ్మీ ఈ దెబ్బకి అందరూ అయిపోతారు అని అంటే అందరి ప్రసాదంలో కలపలేదు కేవలం విరూపాక్షి ప్రసాదంలో కలిపానురా మిగతా వాళ్ల ప్రసాదంలో కలిపిన టైంకి అందరూ కళ్లు తెరిచేశారని అంటాడు. ఇక దీపక్, విజయాంబికలు మాట్లాడే టైంకి బంటీ వీడియో తీసి వాళ్ల ముందుకు వస్తాడు. తల్లీకొడుకులు కంగారు పడతారు. దీపక్‌తో విజయాంబిక ఆ వీడియో డిలీట్ చేయమని చెప్తుంది. మరోవైపు ఆనంద్ తండ్రిని తీసుకొని బోనాల దగ్గరకు వస్తాడు. అమ్మవారి సాక్షిగా పెద్దయ్యగారికి నిజం తెలియడం మంచిది అని అంటాడు.
పంతులు వచ్చి అందరూ భార్యభర్తలు ప్రసాదం తినండి ఇది సంప్రదాయం అంటాడు. విరూపాక్షి భయంతో ప్రసాదం పట్టుకొని నిల్చొంటే రుక్మిణి విరూపాక్షితో తండ్రికి ప్రసాదం తినిపించమని అంటుంది. విరూపాక్షి ఏం మాట్లాడకుండా ఉంటే తండ్రితో నువ్వే తినిపించు నాయనా అంటుంది. సూర్యప్రతాప్ ప్రసాదం తినిపించడానికి ముందుకు వస్తాడు. విరూపాక్షి షాక్ అయిపోతుంది. అందరూ సంతోషిస్తారు. విరూపాక్షి మొహమాటంగా ఉంటే రూప తల్లితో నాయన ముందుకు వచ్చారు కదా తినిపించు అంటుంది. విరూపాక్షి తినిపించడానికి ప్రసాదం తీస్తుంది. మరోవైపు దీపక్ బంటి ఫోన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తే బంటీ దీపక్‌ని కరిచేసి పరుగున వస్తాడు.
విరూపాక్షి సూర్యప్రతాప్‌కి ప్రసాదం తినిపించబోతే బంటి పరుగున వచ్చి విరూపాక్షిని ఢీ కొడతాడు. దాంతో విరూపాక్షి తినపించాలనుకున్న ప్రసాదం కింద పడిపోతుంది. అందరూ ప్రసాదం కింద పడిపోయిందని బాధ పడతారు. రాజు బంటీని తిట్టి ఫోన్ తీసుకుంటాడు. విజయాంబిక, దీపక్‌లు తమ ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని అనుకుంటారు.
పంతులు వాళ్లతో ప్రసాదం కింద పడింది అని బాధ పడొద్దు పిల్లలు దేవుడితో సమానం. ఆ పిల్లాడి చేతిలో ప్రసాదం నేలపాలైంది అంటే అమ్మవారు వద్దని ఆ ప్రసాదం పడేసుంటారని వేరే ప్రసాదం తీసుకొస్తానని వెళ్తారు. పంతులు మళ్లీ ప్రసాదం తీసుకొచ్చి విరూపాక్షికి ప్రసాదం ఇస్తారు. విరూపాక్షి సూర్యప్రతాప్‌కి ప్రసాదం తినిపిస్తుంది. విరూపాక్షి చాలా సంతోషపడుతుంది. మిగతా అందరూ తమ భర్తలకు ప్రసాదం తినిపిస్తారు. తర్వాత సూర్యప్రతాప్ విరూపాక్షికి తినిపిస్తాడు. విరూపాక్షి సంతోషానికి అవధులు ఉండవు. చాలా చాలా సంతోషపడుతుంది. తల్లీకొడుకులు రగిలిపోయి వెళ్లిపోతారు.
మరోవైపు ఆనంద్ రాఘవని తీసుకొని వస్తాడు. దీపక్ చూసి తల్లికి చెప్తాడు. ఇద్దరూ షాక్ అయిపోతారు. రూప, రాజులు బయటకు వెళ్తారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఆనంద్, రాఘవల్ని చూస్తారు. ఇద్దరి దగ్గరకు పరుగున వెళ్తారు. రూప రాఘవతో వచ్చావా రాఘవ నువ్వు చెప్పే నిజం మా జీవితాల్లో వసంతం కలుపుతుంది. రంగుల మయం చేస్తుంది అని అంటుంది. వెంటనే దీపక్ చూసి వాళ్ల మీద పసుపు కుంకుమ వేసి రాఘవని తీసుకొని పక్కకి వెళ్లిపోతాడు. విజయాంబిక కూడా వెళ్లి రాఘవని కొడుతుంది. రాజు, ఆనంద్, రూపలు రాఘవ కోసం వెతుకుతారు. దీపక్ రాఘవ నోరు నొక్కేసి కారు వెనకాలే దాచేస్తాడు. రాజు వాళ్లు కారు వెనకాలే చూస్తూ ఒక్కో వైపు తిప్పుతూ రాఘవని దాచేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆదిత్య-దేవాల పోరాటం.. మిథునని తండ్రి తీసుకెళ్లిపోతాడా? సత్యమూర్తి దేవాకి ఏం చెప్పాడు?





















