Ammayi garu Serial Today july 14th: అమ్మాయి గారు సీరియల్: విరూపాక్షి కేసులో ట్విస్ట్! పీఏ కోసం రాజు, రూపల వేట.. అసలు నిజం తేల్చేదెలా?
Ammayi garu Today Episode రాజు, రూపలు పీఏ కోసం వెతకడం పీఏని పారిపోమని విజయాంబిక ఫోన్ చేసి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి ప్రేజల ఇళ్ల స్థలం తీసుకున్నట్లు అందరూ ఇంటి వచ్చి గోల చేస్తారు. ఒక్క రోజు టైం ఇవ్వమని విరూపాక్షి తరఫున రాజు అడుగుతాడు. రాజుని సూర్యప్రతాప్ ఆ విషయంలో దూరొద్దని చెప్తాడు. దాంతో రాజు ఇది పార్టీకి సంబంధించిన సమస్య పెద్దయ్య అంటే అమ్మ లాంటి మన సమస్య ఇక నుంచి ఇది నా సమస్య పెద్దయ్య. గతంలో మీ మీద కూడా ఇలాంటి పొరపాట్లు చేశారు కదా పెద్దయ్యా అలాగే ఇప్పడు అమ్మగారిని ఇరికిస్తున్నారు. ఇది నేను తేల్చుతా పెద్దయ్య అని రాజు అంటాడు.
చంద్ర కూడా రాజు చెప్పింది నిజమే అని అంటారు. రుక్మిణి తండ్రితో మా అమ్మ తప్పు చేయలేదు అని మేం నిరూపిస్తాను నాయనా మా అమ్మ నిర్దోషి అని నిరూపించలేకపోతే నేనే అమ్మని గెంటేస్తా అంటుంది. విజయాంబిక రుక్మినితో శభాష్ రుక్మిణి సూర్యప్రతాప్ బిడ్డవి అనిపించుకున్నావ్ అంటుంది. మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నేను నిరూపిస్తా అని రుక్మిణి అంటుంది. ఇక రాజు, రుక్మిణిలు పీఏ ఎక్కడున్నా తీసుకురావాలని పరుగులు తీస్తారు. విరూపాక్షి ఏడుస్తుంటే మందారం ధైర్యం చెప్తుంది.
విజయాంబిక, దీపక్‌లు చాలా టెన్షన్ పడతారు. రాజు రంగంలోకి దిగాడు అంటే పీఏ దొరికి పోతాడని వాడిని పారిపోమని చెప్పడానికి ఫోన్ ట్రై చేస్తుంటారు. కానీ పీఏ ఫోన్ ఎత్తడు. రాజు, రూపలు విరూపాక్షి చెప్పిన పీఏ ఇంటి అడ్రస్ దగ్గరకు వెళ్తుంటారు. ఇద్దరూ పీఏ ఇంటికి వెళ్తారు. అక్కడ పీఏ ఉండడు. మరో ఇంటిలో పీఏ తన గర్ల్ ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తుంటాడు. దీపక్ కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు. రాజు, రూపలు వస్తున్నారని జాగ్రత్త అని పారిపోమని చెప్తారు. దాంతో పీఏ ఏం భయపడొద్దు అని ఎమ్మెల్యే అరెస్ట్ అయితేనే బయటకు వస్తాను అని అంటాడు. రాజు, రూపలు అందరికీ పీఏ గురించి అడుగుతారు.
రాత్రి సూర్యప్రతాప్ బంటీతో విరూపాక్షిని చూస్తూ నువ్వు ఎవరో తెలుసా బంటీ మోసం అన్యాయం చేయని తెలియని సూర్యప్రతాప్ మనవడివి నలుగురికి పంచడం తప్ప ఎవరిదీ దోచుకోవడం తెలీని ఈ సూర్యప్రతాప్ మనవడివి ఈ ఇంటి వారసుడివి మనకు పరువే ప్రాణం నువ్వు ఇవే అలవరుచుకోవాలని అంటారు. రాజు, రూపలు ఇంటికి వస్తారు. విరూపాక్షితో రాజు పీఏ పారిపోయాడని చెప్తాడు. సూర్యప్రతాప్ రాజుతో పారిపోయాడు అంటే పబ్లిక్ ఊరుకోదు కదా మీడియా ముందు మాటిచ్చాను 24 గంటల్లో మీరే నిజం చెప్పాలి. ఎవరి వల్లో మా ప్రభుత్వం పరువు పోతుంది అంటే ఊరుకోను అంటాడు.
పీఏ దొరకలేదని విజయాంబిక, దీపక్‌లు తెగ సంతోషపడతారు. దీపక్ గదిలో మందు తాగుతాడు. మందారంతో రేపు మీ అమ్మగారు జైలుకి వెళ్లిపోతారు. రాజు, రూపల కుట్ర బయట పెడతాం వాళ్లు వెళ్లిపోతారు ఇక నీకు నేనే గతి అని అంటాడు. మందారంతో మీ అమ్మగారు జైలుకి వెళ్లడానికి కారణం నేనే అని చెప్పేస్తాడు. మందారానికి ఆమ్లెట్ వేయమని మందు కలిపి ఇవ్వమని చెప్పి దీపక్ ఎంజాయ్ చేస్తూ తాగుతాడు. ఉదయం రుక్మిణి దేవుడికి పూజ చేస్తూ తన తల్లి ఏ తప్పు చేయలేదని తనకి శిక్ష పడుకుండా చూడమని కోరుకుంటుంది. విజయాంబిక రూప దగ్గరకు వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: షాకింగ్.. విహారి కిడ్నాప్.. నడి రోడ్డు మీద కారు.. అర్థరాత్రి ఏం జరిగింది?





















