Ammayi garu Serial Today December 23rd: అమ్మాయి గారు సీరియల్: ఇన్నాళ్ల దూరం.. గుండెల్లో గాయం.. అయింది బంధం.. విమానంలో తల్లికి బిడ్డ వీడ్కోలు!
Ammayi garu Today Episode రూపని సూర్య న్యూయార్క్ పంపేయడం రాజు ఫ్యామిలీ మధ్య తరగతి కుటుంబంలా మారిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Ammayi garu Serial Today Episode రాజు ఇంట్లో వాళ్లతో బిడ్డ బతికే ఉన్న విషయం రూప వాళ్లకి ఎప్పటికీ తెలీకూడదని తెలిస్తే చంపేస్తారని అంటాడు. ఇక విజయాంబిక వాళ్లు రూప వాళ్లకి విషయం ఎప్పటికీ తెలీకూడదని అంటారు. రూపని తీసుకొని సూర్యప్రతాప్ ఇంటికి బయల్దేరుతారు. ఇక విరూపాక్షి రాజు వాళ్లతో ఈ రోజు వాళ్ల ఇంటి వైపు ఎవరూ చూడకూడదని వాళ్లతో ఎలాంటి సంబంధం ఉండకూడదని అంటుంది.
రాజు: మా కోసం మీరు ఎందుకు అమ్మగారు మీ రక్త సంబంధాన్ని వదలుకోవడం.
విరూపాక్షి: రక్త సంబంధం విలువ తెలియని అలాంటి రాక్షసులతో నాకు మాత్రం ఏం సంబంధం ఉంటుంది రాజు.. రూప పెరిగినట్లు వీడు పెరగకూడదు. పేద రక్తమైన నువ్వు గొప్పగా పెరిగావు. రూప తప్పుగా పెరిగింది. ఈ పేద రక్తం గురించి పది మంది గొప్పగా మాట్లాడుకునేలా పెంచుదాం వీడిని. అంటూ బిడ్డని అక్కున చేర్చుకొని నలుగురు ఆడవాళ్లు బాబుని చూసి సంతోషపడతారు. ఇక రాజు తండ్రి బామ్మర్ది రాజు దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేసి అండగా నిలుస్తారు.
సుమ: రూప ఎంత కాలం ఇలా బాధ పడుతూ కూర్చొంటావ్ తిందువు రామ్మా.
రూప: నాకు ఆకలిగా లేదు పిన్ని నా మనసు ఏం బాలేదు. ఎంత ప్రయత్నిస్తున్నా మర్చిపోవడానికి నా వల్ల కావడం లేదు. అసలు నేను ఏం తప్పు చేశాను నాకే ఎందుకు ఆ భగవంతుడు ఇంత శిక్ష వేశాడు. రాజు కానీ రాజు ఫ్యామిలీలో ఏ ఒక్కరు కానీ కనీసం పలకరించడానికి కూడా రాలేదు.
విజయాంబిక: కావాలనే నిన్ను దూరం చేసుకున్న వాళ్లు ఎందుకు వస్తారు రూప.
సూర్య: రూప ఒంటరిగా ఇలా ఏడుస్తూనే ఉంది తను ఇలా ఏడ్వడం మనకు మంచిది కాదు తనకు కాదు. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. అమ్మా రూప జరిగింది అంతా ఓ పీడకల అని మర్చిపో అని నేను చెప్పను కానీ నువ్వు మామూలు మనిషి అవ్వడానికి కొన్ని రోజులు న్యూయార్క్‌లో ఉండమ్మా. అక్కడ నువ్వు ఉన్నన్నిరోజులు నీకు కావాల్సినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు మళ్లీ మామూలు రూపవి అయ్యానని నీకు అనిపించినప్పుడు మళ్లీ తిరిగి ఇండియాకు రా. నిన్ను చూడకుండా ఉండటం మాకు కష్టంగానే ఉంటుంది కానీ నిన్ను ఇలా చూడటం ఎక్కువ కష్టంగా ఉంటుంది. నీ నిర్ణయం ఏంటో చెప్పు.
రూప: సరే నాన్న.
రాజు బాబుని ఆరు బయట ఆడిపిస్తూ ఉంటాడు. ఇక సూర్యప్రతాప్ ఇంట్లో అందరూ ఎమోషనల్ అవుతూ రూపని న్యూయార్క్ సాగనంపుతారు. బయట విమానం వెళ్తున్న సౌండ్ వినిపించి ఏడుస్తున్న బాబుని తీసుకొని రాజు బయటకు వెళ్లి అదిగో మీ మమ్మీ వస్తుంది చూడు మమ్మీ ఫ్లైట్‌లో వస్తుంది చూడు అని ఆడిపిస్తాడు. ఆ సీన్ చూడటానికి చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. రూప వెళ్తున్న విమానాన్నే రాజు చూపించడం విమానంలో రూప కూడా బిడ్డని తలచుకొని ఏడ్వడం బాధగా ఉంటుంది.
కొన్ని సంవత్సరాల తర్వాత..
సూర్యప్రతాప్‌కి విజయాంబిక హారతి ఇస్తుంది. ఎందుకు అక్క కొత్తగా అని సూర్య అడిగితే చాలా ఏళ్ల తర్వాత రూప వస్తుంది కదా ఇక్కడ నుంచి వెళ్లినట్లు కాకుండా కొత్తగా వస్తుందని అంటాడు. ఇక రాజు వాళ్లు గతంలో ఇళ్లు అమ్మడం ఆ ఇంటిని విజయాంబిక కొనిచ్చుంటుంది. సూర్య వాళ్లు అక్కడే ఉంటారు. ఆ ఇంటిని చూసి రూప చాలా హ్యాపీగా ఫీలవుతుందని అనుకుంటారు. ఇక దీపక్‌ని సూర్య కార్పొరేటర్‌ని చేస్తాడు. దీపక్ సూర్య కాళ్ల మీద పడి దేవుడు అని పొగుడేస్తాడు. రూపని సొంతం చేసుకోవాలని రూప దగ్గరైన తర్వాత తన ఒరిజినాలటీ చూపిస్తానని అనుకుంటారు. చంద్ర ఇంట్లో ఉండటం చూసిన సూర్య ఎందుకు ఎయిర్ పోర్ట్‌కి వెళ్లలేదు అని అంటే రూప వెయికిల్ మాత్రమే పంపమని చెప్పిందని అంటాడు. రూప 6, 7 ఏళ్ల ఓ బిడ్డని తీసుకొని ల్యాండ్ అవుతుంది. రూప గదిని పింకీ అలంకరించేస్తుంది. రూప కారులో ఇంటికి బయల్దేరుతుంది. ఇక అప్పలనాయుడు ఓ ఆటో తుడుస్తూ ఉంటే ముత్యాలు అంట్లు తోముటుంటుంది. చూస్తే రాజు వాళ్లు ఆ పెద్ద ఇళ్లు వదిలేసి ఓ మధ్యతరగతి బతుకు బతుకుతుంటారు. రాజు, రూప విడిపోయిన తర్వాత విజయాంబిక రాజు ఫ్యామిలీని కావాలనే వాళ్లని మధ్యతరగతి స్థితికి తీసుకొచ్చేసుంటుంది. ముత్యాలు వాళ్లు రూప కోసమే సూర్య వాళ్లని ఆ దుస్థితి తీసుకొచ్చాడని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: పట్నం చేరుకున్న త్రినేత్రి బామ్మ.. ఇంట్లో రచ్చ చేస్తున్న వల్లభ!