Ammayi garu Serial Today April 11th: అమ్మాయి గారు సీరియల్: జీవన్ రాధికను పెట్రోల్ పోసి చంపేస్తాడా.. సూర్య మీద మరో నింద పడుతుందా!
Ammayi garu Today Episode అందరూ కోర్టుకు వెళ్తారు జీవన్ రాధికను చంపేయాలని కాచుకు కూర్చొవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode రూప ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టేయడంతో విజయాంబిక, దీపక్‌లు ఆస్తి వస్తుందని గదిలోకి వెళ్లి గంతులేస్తారు. అది చూసిన మందారం మీలాంటి వాళ్లకు దేవుడు ఏం శిక్ష వేస్తాడో తెలీదు కానీ నేను అయితే శిక్ష వేస్తాను అనుకొని కరెంట్ ఆపేస్తుంది. తర్వాత తన చీర కొంగు పిన్ను తీసి దీపక్ కాళ్ల మీద పొడిచేస్తుంది. ఏదో కొట్టిందని దీపక్ అరుస్తాడు.
విజయాంబిక ఫోన్‌లో లైట్ వేస్తానని వెళ్తుంటే మందరాం విజయాంబికకు కూడా పిన్నుతో గుచ్చేస్తుంది. ఇద్దరూ నొప్పి నొప్పి అని విలవిల్లాడిపోతారు. తర్వాత మందారం మెయిన్ ఆన్ చేస్తుంది. తల్లీకొడుకుల దగ్గరకు వచ్చి పాము బయటకు వెళ్తుందని అంటుంది. ఇద్దరూ కాళ్ల మీద గాటులు చూసి కంగారు పడతారు. హాస్పిటల్‌కి వెళ్తామని అంటారు. దాంతో మీరు హాస్పిటల్‌కి వెళ్లే లోపు చచ్చిపోతారని తానే విషం తీసేస్తానని ఇద్దరి కాళ్లకు విషం తీస్తానంటూ కొరికేస్తుంది. ఇద్దరు కెవ్వుమంటారు. ఇక పసరు వైద్యం చేయాలని అంటుంది. ఇలా అయిందేంటని తల్లీకొడుకులు అనుకుంటారు.
మందరాం పసరు మందు తీసుకొచ్చి ఇద్దరి కాళ్ల మీద పెడుతుంది. రాత్రంతా పడుకోకుండా ఉంటే ప్రాణాలతో ఉంటారు. లేదు అంటే విషం నెత్తికి ఎక్కి చనిపోతారని అంటుంది. విజయాంబిక మందారంతో మేం పడుకోకుండా ఉంటాం కానీ పొరపాటున పడుకుంటే మమల్ని లేపు అని అంటుంది. పాము మిమల్ని కాటేసింది నేను ఎందుకు నిద్ర పోకుండా ఉండాలి అంటుంది. దీపక్ బతిమాలడంతో మందారం సరే అంటుంది. ఇద్దరికీ కాఫీ తీసుకొస్తా అని వెళ్తుంది. ఆ పాము మందారానికి కాటేసుంటే బాగుండేదని అనుకుంటారు. ఇద్దరూ మందారం తెచ్చిన కాఫీ తాగుతారు.
మందారం దీపక్ వాళ్లతో మీకు గంటకో సారి కాఫీ ఇవ్వడానికి నేను మేలుకొని ఉండాలి అందుకే కాఫీలో మోషన్ ట్యాబ్లెట్స్ కలిపేశానని అంటుంది. ఇద్దరూ బిత్తరపోతారు. కాఫీ ఊసేస్తారు. మిమల్ని కాపాడుకోవడానికే ఇలా చేశానని అంటుంది. ఇద్దరూ గంట కొట్టినట్లు కడుపు పట్టుకొని నేను వెళ్తానంటే నేను వెళ్తానని పరుగులు తీస్తారు. ఇద్దరూ నిద్ర వస్తుంది అని అనుకుంటారు. మందారం నిద్ర మాత్ర కూడా కలిపా మీకు నిద్ర రావాలి నేను నిద్ర పోగొట్టాలి అని అనుకుంటుంది. అత్తయ్య కాఫీ ఇవ్వాలా అని అడగటంతో ఇద్దరూ తడబడుతూ లేచేస్తారు. మందారం నవ్వుకుంటుంది.
ఉదయం రూప బాబాకి దండం పెట్టుకుంటుంది. తన తండ్రి ఏ తప్పు చేయలేదని తేలి బయటకు రావాలని అలా జరగకపోతే ఇవే చివరి మాటలు అంటుంది. ఇక రాజు వచ్చి కోర్టుకి వెళ్దామని అంటాడు. రూప విరూపాక్షికి కాల్ చేస్తుంది. విరూపాక్షి కోర్టుకి బయల్దేరుతుంది. సూర్యని పోలీస్ కోర్టుకి తీసుకెళ్తానని అంటాడు. మీరు ఎలాంటి వారో తెలిసినప్పుటికి మేం ఏం చేయలేం సారీ సార్ అంటాడు. ఇలాంటి కేసుల్లో ఆవిడ చెప్పిన మాటలకే కోర్టు తీర్పు ఇస్తుందని అంటాడు. నా కూతురు నేను ఏం తప్పు చేయలేదని నమ్ముతుంది అది చాలు కోర్టు ఏ తీర్పు ఇచ్చినా నాకు పర్లేదని సూర్య అంటాడు. రూప బాబాయ్‌ని కోర్టుకి వెళ్దామని అంటుంది. రాధిక కోర్టుకి బయల్దేరుతుంది. ఈ ఒక్క రోజు గడిచిపోతే చాలా కోటీశ్వరురాలిని అయిపోతా అనుకుంటుంది. దీపక్ కాల్ చేస్తే వాళ్లు డాక్యుమెంట్స్ రెడీ చేసి సంతకం చేశారని కానీ జీవన్‌తో జాగ్రత్త అని విజయాంబిక చెప్తుంది. జీవన్ ఏం చేయలేడులే అని రాధిక అంటుంది.
జీవన్ తన రౌడీలతో మందు తాడుతూ కానిస్టేబుల్ పంపిన వీడియో చూపి నవ్వుకుంటాడు. సూర్యప్రతాప్ చెప్పినట్లు రాధికను చంపేసి సూర్య అకౌంట్‌లో వేసేస్తా అనుకుంటాడు. రాధికను చంపడానికి పెట్రోల్ తీసుకొని జీవన్ బయల్దేరుతాడు. ఇక అందరూ కోర్టు దగ్గర వెయిట్ చేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!





















