News
News
X

Nayanthara: ‘లేడీ’ వార్ - నయన్‌పై మాళవిక విమర్శలు, ఈ సారి ‘సూపర్‌స్టార్’ లొల్లి!

నయనతారపై మాళవిక మోహనన్ మరోసారి విమర్శలు చేసింది. ఆమెను లేడీ సూపర్ స్టార్ అనాల్సిన అవసరం లేదని చెప్పింది. బాలీవుడ్ లో ఎంతో మంది టాప్ హీరోయిన్లు ఉన్నా వారెవరినీ లేడీ సూపర్ స్టార్ అనడం లేదన్నది.

FOLLOW US: 
Share:

నయనతార, మాళవిక మోహనన్ మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటున్నది. తాజాగా మరోసారి నయనతారపై మాళవిక వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమెను ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలవాల్సిన అవసరం లేదని చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవికను నయనతారపై మీ అభిప్రాయం ఏంటని యాంకర్ ప్రశ్నించింది. నయనతారను లేడీ సూపర్ స్టార్ అని పిలవడం తనకు నచ్చదని చెప్పింది. హీరోయిన్లను సూపర్ స్టార్స్ అంటే సరిపోతుందని, లేడీ సూపర్ స్టార్ అంటూ ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. బాలీవుడ్ లో దీపికా పదుకొణె, కత్రినా కైఫ్, ఆలియా భట్ లాంటి హీరోయిన్లను సూపర్ స్టార్స్ అంటారు తప్ప, లేడీ సూపర్ స్టార్ అనరని చెప్పుకొచ్చింది.

గతంలోనూ నయనతారపై విమర్శలు

మాళవిక గతంలోనూ నయనతారపై విమర్శలు చేసింది. “ఓ సినిమాలో ఆసుపత్రి బెడ్ పై ఉన్నప్పుడు కూడా ఓ టాప్ హీరోయిన్ మేకప్ వేసుకుంది” అంటూ పరోక్షంగా నయనతారని విమర్శించింది. నయనతార నటించి, నిర్మించిన తాజా సినిమా ‘కనెక్ట్’. గత డిసెంబర్ 22న ఈ మూవీ విడుదలైంది. ఇందులో నయనతార హాస్పిటల్ బెడ్ మీద ఉండే సీన్ ఒకటి ఉంటుంది. ఈ సీన్ లో ఫుల్‌ మేకప్‌తో జుట్టు చెదరకుండా నటించినట్లు నయనతార పేరు చెప్పకుండా మాళవిక విమర్శించింది. ఈ విమర్శలకు నయనతార రీసెంట్ గా కౌంటర్ ఇచ్చింది. “నన్ను ఒక హీరోయిన్ ఆసుపత్రి బెడ్ పై మేకప్ వేసుకుని రియలిస్టిక్ గా లేనని విమర్శించింది. కానీ, కమర్షియల్ సినిమాలకి ఏం కావాలో డైరెక్టర్లకు తెలుసు.  మనం చెప్పాల్సిన అవసరం లేదు” అంటూ చురకలంటించింది.  

మాళవికపై నయనతార అభిమానుల ఆగ్రహం

మాళవిక మోహన్ కామెంట్స్ పై నయనతార అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “వేరే పనేం లేదా? అస్తమానం నయనతార మీద పడి ఏడుస్తావ్?” అంటూ మండిపడుతున్నారు.  మాళవిక తాజా కామెంట్స్ పై నయనతార ఎలా స్పందిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాప్ హీరోలతో నటించినా మాళవికకు కలిసి రాలేదు!

తమిళ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు అయిన విజయ్, ధనుష్ తో కలిసి సినిమాలు చేసినా మాళవిక మోహన్ కు పెద్దగా గుర్తింపు రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం అమ్మడుకు బాగా క్రేజ్ ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అభిమానులతో తరుచుగా ఇంటరాక్ట్ అవుతుంది. ప్రస్తుతం మాళవిక చేతిలో పెద్దగా సినిమాలేవీ లేదు. నయనతార మాత్రం షారుఖ్ ఖాన్ తో కలిసి ‘జవాన్‘ అనే సినిమా చేస్తోంది.

View this post on Instagram
 
A post shared by Malavika Mohanan (@malavikamohanan_)

Read Also:  ‘సీతారామం’ బ్యూటీపై దారణ ట్రోలింగ్, నేనూ మనిషినే అంటూ ఆవేదన!

Published at : 13 Feb 2023 02:47 PM (IST) Tags: nayanthara Malavika Mohanan Nayanthara-Malavika war

సంబంధిత కథనాలు

Keerthy Suresh: నాలుగు పళ్లతో నవ్వమన్నాడు - కీర్తి సురేష్‌కు షాకిచ్చిన ‘దసరా’ దర్శకుడు

Keerthy Suresh: నాలుగు పళ్లతో నవ్వమన్నాడు - కీర్తి సురేష్‌కు షాకిచ్చిన ‘దసరా’ దర్శకుడు

Gruhalakshmi March 29th: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం తెలుసుకున్న ప్రియ- లాస్య ట్రాప్ లో పడిపోయిన దివ్య

Gruhalakshmi March 29th: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం తెలుసుకున్న ప్రియ- లాస్య ట్రాప్ లో పడిపోయిన దివ్య

Guppedanta Manasu March 29th: కొత్త గేమ్ స్టార్ట్ చేసిన రిషిధార, క్షమించమని జగతిని అడిగిన ఈగో మాస్టర్!

Guppedanta Manasu March 29th:  కొత్త గేమ్ స్టార్ట్ చేసిన రిషిధార, క్షమించమని జగతిని అడిగిన ఈగో మాస్టర్!

Brahmamudi March 29th: అందరి ముందు అడ్డంగా బుక్కైన రాజ్- అన్నని ఇరికించేసిన కళ్యాణ్

Brahmamudi March 29th: అందరి ముందు అడ్డంగా బుక్కైన రాజ్- అన్నని ఇరికించేసిన కళ్యాణ్

Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత

Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్  ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్