అన్వేషించండి

Director Harish Shankar: ‘మిస్టర్ బచ్చన్’కు ఫ్లాప్ టాక్- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉంటుందా? ఉండదా?

భారీ అంచనాల నడుమ విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు హరీష్ శంకర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూవీ ఎఫెక్ట్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై పడే అవకాశం కనిపిస్తోంది.

Mr Bachchan Flop Effect On Ustad Bhagath Singh: మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం భారీ అంచనాల నడుమ ఆగష్టు 15న విడుదలైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఈ మూవీ ఏమాత్రం  ఆకట్టుకోలేకపోయింది. డైలాగులు, ఫైట్స్, పాటల.. ఏవీ ఆడియెన్స్ ను అలరించలేకపోయాయి. మరోవైపు చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మూవీలోని సీన్లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. హరీష్ శంకర్ కెరీర్ తో పాటు రవితేజ కెరీర్ లోనూ అత్యంత చెత్త సినిమా ఇదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలోనే ఇంత దారుణమైన సినిమా ఎవరూ తీసి ఉండరంటూ విమర్శిస్తున్నారు. ఈ మూవీలోని సన్నివేశాలు, డైలాగులు చౌకబారుగా ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు. అసలు రవితేజ ఇలాంటి సినిమాను ఎలా ఒప్పుకున్నాడో అర్థం కావట్లేదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ శంకర్ మాత్రం షోలు పెరుగుతున్న కొద్దీ పాజిటివ్ టాక్ వస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

‘ఉస్తాద్ భగత్ సింగ్’పై ‘మిస్టర్ బచ్చన్’ ఎఫెక్ట్

‘మిస్టర్ బచ్చన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన నేపథ్యంలో, ఈ ఎఫెక్ట్ హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై పడే అవకాశం ఉంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రెండవ సినిమాగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి 20 శాతం సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న ఆయన, త్వరలోనే తను అంగీకరించిన సినిమాలు పూర్తి చేసే అవకాశం ఉంది. ముందు 'OG', 'హరిహార వీరమల్లు' సినిమాలను కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. 'OG', 'హరిహార వీరమల్లు' సినిమాలకు కొన్ని డేట్స్‌ ఇస్తే సరిపోతుంది. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’కు చాలా డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ‘మిస్టర్ బచ్చన్’ ఎఫెక్ట్ తో ఈ సినిమా ముందుకు సాగుతుందా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.  త్వరలోనే ఈ మూవీ భవిష్యత్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

'హరిహర వీరమల్లు' షూటింగ్‌ షురూ

రీసెంట్ గా 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. స్టంట్ డైరెక్టర్ సిల్వ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ లేకుండానే ఈ షూటింగ్ ప్రారంభం అయ్యింది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ కు ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Read Also: ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో ‘కొటెషన్ గ్యాంగ్’ - కిరాయి హత్యల ముఠా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget