అన్వేషించండి

‘యాత్ర 2’లో చంద్రబాబు ఎవరు, ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

'యాత్ర 2'లో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, ప్రేక్షకులు... ఆ మాటకు వస్తే భారతీయ రాజకీయ నాయకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'యాత్ర 2' (Yatra 2 Movie). మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక నిర్మిస్తున్న చిత్రమిది. 'యాత్ర 2' సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ సైతం మొదలైనట్లు తెలిసింది. హిందీ, మరాఠీ సినిమాలతో ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన... ప్రభాస్ 'సాహో', గోపీచంద్ 'ఒక్కడున్నాడు'తో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'టిల్లు స్క్వేర్' రిలీజ్ డేట్ - సిద్ధూ జొన్నలగడ్డ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ పేరు చెబితే తెలుగు ప్రేక్షకులకు టిల్లు క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. ఆ పాత్రలో ఆయన యాక్టింగ్ అంత ఇంపాక్ట్ చూపించింది. 'డీజే టిల్లు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సిద్ధూ జొన్నలగడ్డ ఫుల్లుగా వినోదం పంచారు. టిల్లు అంటే సిద్ధు, సిద్ధు అంటే టిల్లు అనేంతలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాకు సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆ సినిమా విడుదల తేదీ వెల్లడించారు. 2024 ఫిబ్రవరి 9వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రష్మికా మందన్న కాళ్ళు పట్టుకున్న రణబీర్ కపూర్
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కాళ్ళు పట్టుకున్నారు హిందీ హీరో రణబీర్ కపూర్! అయితే... అది బయట కాదులెండి, సినిమాలో! వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా 'యానిమల్'. అందులో కొత్త పాట 'నే వేరే...' పాటను ఇవాళ విడుదల చేశారు. 'నే వేరే... నువ్ వేరే కాదు నేస్తమా' అంటూ సాగిన 'యానిమల్'లో కొత్త పాటను చూస్తే భార్య భర్తల మధ్య గొడవలు, అనుబంధాలు, ప్రేమను చూపించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ''నా దేహం అంతా నీ స్నేహంతో నిండింది చూడు నేస్తమా... నా మౌనం అంతా నీ ధ్యానంలో మునిగింది చూడు ప్రాణమా'' అంటూ పాట మొదలైంది. కర్వా చౌత రోజు భర్త కోసం భార్య ఎదురు చూడటం చూపించారు. తర్వాత రణబీర్ కపూర్ ఏదో చెప్పడం... రష్మిక కోప్పడటం చూడవచ్చు. రణబీర్ తండ్రిగా నటించిన అనిల్ కపూర్ ''గీతాంజలి (సినిమాలో హీరోయిన్ రష్మిక పేరు) అంతా ఓకేనా?'' అని అడగటం... ''హజ్బెండ్ అండ్ వైఫ్ స్టుపిడ్ ఫైట్స్'' అంటూ రణబీర్ చెప్పడం కూడా కనిపించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘పెదకాపు1’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన రీసెంట్ మూవీ 'పెదకాపు 1' సైలెంట్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. విరాట్ కర్ణ వెండితెరకు హీరోగా పరిచయమైన ఈ మూవీ ఎటువంటి ఓటీటీ అనౌన్స్మెంట్ లేకుండా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావడం గమనార్హం. ఇంతకీ పెద్దకాపు ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే.. 'నారప్ప' వంటి మాస్ హిట్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం 'పెదకాపు 1'. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ ఈ చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు. ప్రగతి శ్రీ వాస్తవ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రావు రమేష్, రాజీవ్ కనకాల, బ్రిగిడ సాగ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘స్పై’ డిజాస్టర్‌కు కారణం అదే, అసలు విషయం చెప్పిన నిఖిల్!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన తాజా సినిమాలన్నీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులుగానే రూపొందుతున్నాయి. వాటిలో ఒకటి ‘స్వయంభు‘ కాగా మరొకటి ‘ది ఇండియన్ హౌస్‘. అటు ‘కార్తికేయ 3‘ కూడా పట్టాలు ఎక్కబోతోంది. ఆయన చివరగా నటించిన ‘స్పై‘ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ‘కార్తికేయ 2‘, ‘18 పేజెస్‘ సక్సెస్ తర్వాత భారీ బడ్జెట్ తో  సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది. ఈ సినిమా పరాభవం పట్ల అప్పట్లో నిఖిల్ తన అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Saraswati Power Lands: సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Saraswati Power Lands: సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Crime News: ట్రయల్ కోసం కుక్కను చంపి ఉడకబెట్టాడు - భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
ట్రయల్ కోసం కుక్కను చంపి ఉడకబెట్టాడు - భార్యను చంపి కుక్కర్‌లో ఉడికించిన కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
Embed widget