అన్వేషించండి

Peddha Kapu 1 OTT Release Date: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘పెదకాపు1’ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా నటించిన 'పెదాకాపు-1' తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన రీసెంట్ మూవీ 'పెదకాపు 1' సైలెంట్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. విరాట్ కర్ణ వెండితెరకు హీరోగా పరిచయమైన ఈ మూవీ ఎటువంటి ఓటీటీ అనౌన్స్మెంట్ లేకుండా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రావడం గమనార్హం. ఇంతకీ పెద్దకాపు ఏ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే.. 'నారప్ప' వంటి మాస్ హిట్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం 'పెదకాపు 1'. అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ ఈ చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు. ప్రగతి శ్రీ వాస్తవ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రావు రమేష్, రాజీవ్ కనకాల, బ్రిగిడ సాగ, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషించారు.

మరో విశేషం ఏంటంటే ఈ సినిమాతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తనలోని నటుడిని బయటపెట్టారు. ఇందులో శ్రీకాంత్ అడ్డాల విలన్ రోల్ పోషించారు. ఓ సామాన్యుడి సంతకం అనే ట్యాగ్ లైన్ తో సెప్టెంబర్ 29న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ ఫ్లాట్ బాగున్నా దాన్ని స్క్రీన్ పై ప్రజెంట్ చేసిన విధానం ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. కథనం మరీ సాగదీతగా ఉండడంతో ఈ చిత్రాన్ని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. ఈ సినిమాకు మొదటి ఆట నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పోస్ట్ చేశారు.

అసలు సినిమాలో ఎమోషన్ లేదని, చాలా స్లో నేరేషన్ ఉందని కామెంట్లు పెట్టారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ పరాజయాన్ని అందుకుంది. కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అవ్వకుండా నిర్మాతకి భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో చడి చప్పుడు చేయకుండా సినిమా విడుదలైన నెల రోజుల్లో పై ఓటీటీ లోకి వచ్చేసింది. సినిమాకి భారీగా నష్టాలు రావడంతో మేకర్స్ ఓటీటీ రిలీజ్ విషయంలో అంతగా శ్రద్ధ చూపలేదని కొందరు చెబుతున్నారు. అందుకే ఎటువంటి ప్రమోషన్స్, అనౌన్స్మెంట్ లేకుండా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. 'పెదకాపు 1' అక్టోబర్ 27 శుక్రవారం నుండి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

థియేటర్స్ లో జనాల్ని మెప్పించలేకపోయిన మూవీ ఓటీటీలో అయినా ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ని అందుకుంటుందేమో చూడాలి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. మొదటి భాగమే ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరచడంతో ఇప్పుడు సీక్వెల్ సంగతి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి శ్రీకాంత్ అడ్డాల 'పెదకాపు' సీక్వెల్ తెరకెక్కిస్తారా? లేక ఆపేస్తారా? అనేది చూడాలి. కెరియర్ ఆరంభంలో 'కొత్త బంగారులోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి క్లాస్ మూవీస్ తో దర్శకుడిగా ప్రేక్షకులకు దగ్గరైన శ్రీకాంత్ అడ్డాల చాలా గ్యాప్ తర్వాత 'నారప్ప' లాంటి ఊరమాస్ మూవీని తీసి దర్శకుడిగా ఓ మెట్టు పైకి ఎక్కాడు. ఆ తర్వాత తెరకెక్కించిన 'పెదకాపు 1' మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో చాలామంది విశ్లేషకులు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ పై విమర్శలు చేశారు.

Also Read : 'యాత్ర 2'లో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో తెలుసా? మహేష్...

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NTR Neel Glimpse: 'డ్రాగన్'తో బ్లడ్ బాత్, భారీ యాక్షన్ గ్యారెంటీ... ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్‌ వచ్చేసిందోచ్
'డ్రాగన్'తో బ్లడ్ బాత్, భారీ యాక్షన్ గ్యారెంటీ... ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్‌ వచ్చేసిందోచ్
Manchu Manoj: దమ్ముంటే వాళ్ళను అడగండి... మైక్‌తో కాదు, హెల్మెట్‌తో వెళ్ళండి - ఫ్యామిలీ ఇష్యూలపై మంచు మనోజ్
దమ్ముంటే వాళ్ళను అడగండి... మైక్‌తో కాదు, హెల్మెట్‌తో వెళ్ళండి - ఫ్యామిలీ ఇష్యూలపై మంచు మనోజ్
NTR Cars Collection: పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?
పోర్షే నుంచి లంబోర్ఘిని వరకు... ఎన్టీఆర్ గ్యారేజీలో కార్ కలెక్షన్, ఆయన టోటల్ నెట్ వర్త్ తెలుసా?
Rishab Shetty On Peddi: 'పెద్ది' ట్రైలర్‌కు 'కాంతార' రిషబ్ శెట్టి రివ్యూ... రామ్ చరణ్ గురించి ఏమన్నారంటే?
'పెద్ది' ట్రైలర్‌కు 'కాంతార' రిషబ్ శెట్టి రివ్యూ... రామ్ చరణ్ గురించి ఏమన్నారంటే?

వీడియోలు

Jaanvi on BucchiBabu: ఈ డైరక్టర్ మామూలోడు కాదు.. పెద్ద రౌడీ.. బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Adilabad Garden Village: ఇంటింటికి పూలవనం... దానితోనే ధనం
RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Heatwave: మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
మండుతున్న ఆంధ్రప్రదేశ్‌! 47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు! ఈ జిల్లావాసులు అవసరమైతే తప్ప బయటకు రావద్దు! 
Telangana Heatwave : నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
నిప్పుల కొలిమిలా తెలంగాణ! 13 జిల్లాలకు రెడ్ అలర్ట్! బయటకు రావద్దని హెచ్చరికలు!
అరటి పండు తొక్క ఎలా తీయాలి? అదే మీ వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని చెబుతుందా?
అరటి పండు తొక్క ఎలా తీయాలి? అదే మీ వ్యక్తిత్వం, మనస్తత్వాన్ని చెబుతుందా?
Thalapathy Vijay CM: రాజకీయ నాయకులు తెల్లటి దుస్తులు ధరిస్తుంటారు, మరి విజయ్ నల్ల కోటు వెనుకున్న రాజకీయ రహస్యం ఏంటి?
రాజకీయ నాయకులు తెల్లటి దుస్తులు ధరిస్తుంటారు, మరి విజయ్ నల్ల కోటు వెనుకున్న రాజకీయ రహస్యం ఏంటి?
IPL 2026 RR VS LSG Result Update: వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్,
వైభ‌వ్ సిక్స‌ర్ల సునామీ.. రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ.. ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన జురేల్, జైస్వాల్
NTR Neel Glimpse: 'డ్రాగన్'తో బ్లడ్ బాత్, భారీ యాక్షన్ గ్యారెంటీ... ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్‌ వచ్చేసిందోచ్
'డ్రాగన్'తో బ్లడ్ బాత్, భారీ యాక్షన్ గ్యారెంటీ... ఎన్టీఆర్ నీల్ సినిమా గ్లింప్స్‌ వచ్చేసిందోచ్
MS Dhoni IPL Future: ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై వీడని సస్పెన్స్: వచ్చే సీజన్ లో ఆడ‌టంపై కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు
ధోని ఐపీఎల్ భవిష్యత్తుపై వీడని సస్పెన్స్: వచ్చే సీజన్ లో ఆడ‌టంపై కోచ్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు
Bhuma Mounika Reddy: రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?
రాజకీయాల్లోకి మరో భూమా వారసురాలు - మౌనిక పోటీపై మంచు మనోజ్ అధికారిక ప్రకటన - ఏ పార్టీలోకి ?
Embed widget