అన్వేషించండి

Nikhil Siddharth: ‘స్పై’ డిజాస్టర్‌కు కారణం అదే, అసలు విషయం చెప్పిన నిఖిల్!

నిఖిల్ రీసెంట్ మూవీ ‘స్పై‘ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. తాజాగా ఈ మూవీ పరాజయంపై యంగ్ హీరో స్పందించారు. సినిమా ఎందుకు ప్రేక్షకులను అలరించలేకపోయింది వెల్లడించారు.

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన తాజా సినిమాలన్నీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులుగానే రూపొందుతున్నాయి. వాటిలో ఒకటి ‘స్వయంభు‘ కాగా మరొకటి ‘ది ఇండియన్ హౌస్‘. అటు ‘కార్తికేయ 3‘ కూడా పట్టాలు ఎక్కబోతోంది. ఆయన చివరగా నటించిన ‘స్పై‘ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ‘కార్తికేయ 2‘, ‘18 పేజెస్‘ సక్సెస్ తర్వాత భారీ బడ్జెట్ తో  సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది. ఈ సినిమా పరాభవం పట్ల అప్పట్లో నిఖిల్ తన అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు.   

‘స్పై‘ డిజాస్టర్ కు కారణం ఏంటంటే?

తాజాగా ఈ సినిమా గురించి మరోసారి స్పందించారు నిఖిల్. అసలు ‘స్పై‘ సినిమా ఎందుకు డిజాస్టర్ గా మిగిలిందో చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవానికి  ఈ సినిమాకు సంబంధించి ఇంకా 10 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉన్నట్లు చెప్పారు. అది పూర్తి చేయకుండానే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయాలని నిర్మాత నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు, హడావిడిగా ఈ సినిమాను రిలీజ్ చేసినట్లు చెప్పారు. ఈ కారణంగానే సినిమా అసంపూర్ణంగా మిగిలిందన్నారు. ప్రేక్షకులు కూడా ఈ సినిమా అర్థంకాక అవస్థలు పడినట్లు చెప్పారు. నిర్మాత తీసుకున్న తొందరపాటు నిర్ణయమే సినిమా పరాజయానికి కారణం అయ్యిందన్నారు. అంతేకాదు, ఈ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు ఇకపై ఉండవని చెప్పారు. వచ్చే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటానని వెల్లడించారు. ప్రేక్షకులు తన నుంచి ఎలాంటి సినిమాలను ఆశిస్తారో, అలాంటి వాటికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తానని చెప్పారు.  

‘స్వయంభు‘ సినిమా షూటింగ్ లో నిఖిల్ బిజీ

ప్రస్తుతం నిఖిల్ ‘స్వయంభు‘ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నిఖిల్ రాజు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడుతున్నారట. పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాల కోసం మూడు నెలల పాటు స్పెషల్ గా ట్రైనింగ్ తీసుకున్నారట. అతడి కెరీర్ లో తొలిసారి పూర్తి స్థాయి పీరియాడికల్ మూవీలో యువరాజుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అటు ‘ది ఇండియన్ హౌస్‘ అనే సినిమాలోనూ నటిస్తున్నారు నిఖిల్. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలుగా రూపొందుతున్నాయి. ఈ సినిమాలతో మళ్లీ నిఖిల్ హిట్ బాట పట్టాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా ఆయన చెప్పినట్లు వచ్చే సినిమాలన్నీ ఆయన రేంజికి తగినట్లు ఉంటాయో? లేదో? తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nikhil Siddhartha (@actor_nikhil)

Read Also: శ్రద్ధా, పూజా హెగ్డే మాత్రమే కాదు... సోనాల్ చౌహన్ కూడా - కొత్త కారు కొన్న హీరోయిన్!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Embed widget