Animal : రష్మికా మందన్న కాళ్ళు పట్టుకున్న రణబీర్ కపూర్
Animal Movie Song : రణబీర్ కపూర్, రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న సినిమా 'యానిమల్'. ఇందులో రెండో పాటను ఇవాళ విడుదల చేశారు.
Animal Telugu Movie New Song Ney Veyrey : నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కాళ్ళు పట్టుకున్నారు హిందీ హీరో రణబీర్ కపూర్! అయితే... అది బయట కాదులెండి, సినిమాలో! వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న సినిమా 'యానిమల్'. అందులో కొత్త పాట 'నే వేరే...' పాటను ఇవాళ విడుదల చేశారు.
రష్మిక కాళ్ళు పట్టిన రణబీర్
'నే వేరే... నువ్ వేరే కాదు నేస్తమా' అంటూ సాగిన 'యానిమల్'లో కొత్త పాటను చూస్తే భార్య భర్తల మధ్య గొడవలు, అనుబంధాలు, ప్రేమను చూపించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.
''నా దేహం అంతా నీ స్నేహంతో నిండింది చూడు నేస్తమా... నా మౌనం అంతా నీ ధ్యానంలో మునిగింది చూడు ప్రాణమా'' అంటూ పాట మొదలైంది. కర్వా చౌత రోజు భర్త కోసం భార్య ఎదురు చూడటం చూపించారు. తర్వాత రణబీర్ కపూర్ ఏదో చెప్పడం... రష్మిక కోప్పడటం చూడవచ్చు. రణబీర్ తండ్రిగా నటించిన అనిల్ కపూర్ ''గీతాంజలి (సినిమాలో హీరోయిన్ రష్మిక పేరు) అంతా ఓకేనా?'' అని అడగటం... ''హజ్బెండ్ అండ్ వైఫ్ స్టుపిడ్ ఫైట్స్'' అంటూ రణబీర్ చెప్పడం కూడా కనిపించింది.
పాట అంతా ఒక ఎత్తు... పాటలోని ఓ సన్నివేశంలో రష్మిక కాళ్ళను రణబీర్ కపూర్ పట్టుకోవడం మరో ఎత్తు! అలాగే, వాళ్ళిద్దరి మధ్య ముద్దులను కూడా చూపించారు.
Also Read : 'యాత్ర 2'లో చంద్రబాబు నాయుడిగా ఎవరు నటిస్తున్నారో తెలుసా? మహేష్...
మొదటి పాటల్లోనూ హీరో హీరోయిన్ల లిప్ లాక్!
'యానిమల్' (Animal Movie) సినిమాలో తొలి పాట 'అమ్మాయి... 'ను ఈ నెల రెండో వారంలో విడుదల చేశారు. అందులో కూడా హీరో హీరోయిన్ల మధ్య ముద్దు సీన్లు ఉన్నాయి. అయితే... రెండో పాటలో ఎమోషన్ ఎక్కువ. మొదటి పాటలో రొమాన్స్ ఎక్కువ. 'అమ్మాయి...' పాటలో రణబీర్, రష్మిక మధ్య ఘాటు ముద్దు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే... వయలెన్స్ గట్టిగా ఉన్నట్లు కనపడుతోంది. యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే కాదు, ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కూడా చాలా వయలెంట్‌గా ఉంటాయట.
Also Read : 'టిల్లు స్క్వేర్' రిలీజ్ డేట్ - టిల్లన్నగా స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?
'యానిమల్'లో రణబీర్, రష్మికకు పెళ్లైందని టీజర్ చూస్తే తెలుస్తుంది. తాజాగా విడుదల చేసిన పాటలో పిల్లలు కూడా ఉన్నట్లు చూపించారు. ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నైట్ సీన్ కూడా ఉందని బాలీవుడ్ టాక్. ఒకవైపు ఫస్ట్ నైట్... మరో వైపు విలన్స్ ఎటాక్... రెండిటినీ బాలన్స్ చేస్తూ సందీప్ రెడ్డి వంగా తీసిన సీన్స్ సినిమాలో హైలైట్ అవుతాయని టాక్. ఒకవైపు గాల్లోకి విలన్లను పంపిస్తూ... మరో వైపు రొమాన్స్ చేసిన సన్నివేశాలు బాగా వచ్చాయని ఇన్‌సైడ్ టాక్. సందీప్ రెడ్డి వంగా మేకింగ్ చూసి ప్రేక్షకులు సర్‌ప్రైజ్ అవుతారట. ఇప్పటి వరకు రష్మిక ఇటువంటి సీన్ చేయలేదని ముంబై సినిమా జనాలు అంటున్నారట. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial