అన్వేషించండి

సూర్య కొత్త సినిమా ప్రకటన, ‘స్కంద’ ఓటీటీ రిలీజ్ వాయిదా - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

సూర్య సినిమాలో దుల్కర్, నజ్రియా కూడా - సుధా కొంగరతో కొత్త సినిమా గురూ!
సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వం వహించిన 'సూరారై పొట్రు' భారీ విజయం సాధించింది. ఆ సినిమా 'ఆకాశమే నీ హద్దురా' పేరుతో తెలుగులో విడుదల అయ్యింది. ఇక్కడ కూడా హిట్. తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించడమే కాదు... విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ సినిమాగా జాతీయ పురస్కారం అందుకుంది. 'ఆకాశమే నీ హద్దురా' విజయం తర్వాత సూర్య, సుధా కొంగర కలిసి మరో సినిమా చేస్తున్నారు. ఈ రోజు ఆ సినిమాను అధికారికంగా ప్రకటించారు. హీరోగా సూర్య 43వ చిత్రమిది. సూర్య 43వ చిత్రాన్ని ఆయన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. స్నేహితుడు రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్, శ్రీమతి జ్యోతికతో కలిసి సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'స్కంద' ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ - కారణం ఏమిటంటే?
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ 'స్కంద'(Skanda) ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. అక్టోబర్ 27న ఓటీటీలో విడుదల కావలసిన ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ పోన్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ స్కంద పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏంటి? డీటెయిల్స్ లోకి వెళ్తే.. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన మొదటి సినిమా 'స్కంద'. స్కంద ఓటీటీ పోస్ట్ పోన్ కు కారణం కొన్ని టెక్నికల్ రీజన్స్ అని అంటున్నారు. టెక్నికల్ రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయిన స్కంద నవంబర్ రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుందని సమాచారం వినిపిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

వీవీ వినాయక్ క్లాప్‌తో మొదలైన రవితేజ కొత్త సినిమా
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు లాంఛనంగా మొదలైంది. 'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్'... హ్యాట్రిక్ విజయాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కలయికలో తాజా చిత్రమిది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కిస్తోంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్, నటి ఇందూజ ఈ సినిమాలో కీలక క్యారెక్టర్లలో కనిపించనున్న సంగతి తెలిసిందే. రవితేజతో పాటు వాళ్ళిద్దరిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. దర్శ కేంద్రులు కె. రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. అన్మోల్ శర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అల్లు అరవింద్ చేతుల మీదుగా చిత్ర బృందం స్క్రిప్ట్ అందుకుంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నా ఫస్ట్ లిప్ లాక్ ఆయనతోనే, అసలు విషయం చెప్పిన శ్రీలీల
‘భగవంత్‌ కేసరి’ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో శ్రీలీల బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా సినిమాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆమెకు ఓ క్రేజీ ప్రశ్న ఎదురయ్యింది. ఈ ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం చెప్పింది శ్రీలీల. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే? టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే, ఎవరితో చేస్తారు? అని ఓ యాంకర్ అడిగింది. ఈ ప్రశ్నకు ఆమె ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. తొలుత తాను ఏ హీరోతో లిప్ లాక్ సీన్లు చేయను అని చెప్పింది. ఒకవేళ అలా చేయాల్సి వస్తే మాత్రం తన భర్తకే తొలి కిస్ ఇస్తానని చెప్పింది. మొత్తంగా తాను లిప్ లాక్ సీన్లు చేసే ప్రసక్తే లేదని శ్రీలీల తేల్చి చెప్పింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నా ఫస్ట్ లిప్ లాక్ ఆయనతోనే, అసలు విషయం చెప్పిన శ్రీలీల
తెలుగమ్మాయి శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఆమె నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర నిర్మాతలు ఆమెకే ప్రియారిటీ ఇస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్‌ హీరో నుంచి సీనియర్‌ హీరోల వరకు శ్రీలీలనే ఫస్ట్‌ ఛాయిస్‌ తనే అవుతోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో సుమారు అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పెద్ద సినిమాలే. ఆమె రీసెంట్ గా నటించిన ‘భగవంత్‌ కేసరి’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో  చక్కటి నటనతో అందరినీ ఆకట్టుకుంది. బాలయ్య కూతురి పాత్రలో ఒదిగిపోయిన నటించి, అందరి ప్రశంసలు అందుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
Revanth Reddy on Allu Arjun: పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
పుష్ప 2 హీరో అల్లు అర్జున్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీ
SCR: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ - తిరుపతికి వీక్లీ స్పెషల్ ట్రైన్స్, ఆ వందేభారత్‌కు అదనపు కోచ్‌లు
Sabarimala Yatra History:  శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!
శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!
YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం
Embed widget