Ravi Teja New Movie : వీవీ వినాయక్ క్లాప్‌తో మొదలైన రవితేజ కొత్త సినిమా
RT4GM Movie Updates : మాస్ మహారాజ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమా ఈ రోజు పూజా కార్యక్రమాలతో మొదలయింది.
Ravi Teja Gopichand Malineni Movie : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా పూజా కార్యక్రమాలతో ఈ రోజు లాంఛనంగా మొదలైంది. 'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్'... హ్యాట్రిక్ విజయాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కలయికలో తాజా చిత్రమిది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కిస్తోంది. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు.
తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్, నటి ఇందూజ ఈ సినిమాలో కీలక క్యారెక్టర్లలో కనిపించనున్న సంగతి తెలిసిందే. రవితేజతో పాటు వాళ్ళిద్దరిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. దర్శ కేంద్రులు కె. రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు. అన్మోల్ శర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అల్లు అరవింద్ చేతుల మీదుగా చిత్ర బృందం స్క్రిప్ట్ అందుకుంది. త్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
With all the anticipation & hype from the announcements, #RT4GM pooja ceremony was conducted on an auspicious note 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) October 26, 2023
The much awaited project begins its shoot very soon ❤🔥#RT4GMBlast 💥
MASS MAHARAJA @RaviTeja_offl @megopichand @selvaraghavan @Actress_Indhuja… pic.twitter.com/41IHrsE7C0
దర్శకుడితో 7... రవితేజతో 12!
రవితేజ, గోపీచంద్ కలయికలో రూపొందుతున్న నాలుగో చిత్రమిది. వాళ్ళిద్దరితో తమన్ హ్యాట్రిక్ సినిమా. ఇంకా చెప్పాలంటే... రవితేజతో తనకు ఇది 12వ సినిమా అని తమన్ ట్వీట్ చేశారు. గోపీచంద్ దర్శకత్వంలో 7వ సినిమా అని, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో తనకు నాలుగో సినిమా అని పేర్కొన్నారు.
Also Read : రెండో పెళ్ళికి 'ఎస్' చెప్పిన అమలా పాల్ - వరుడు ఎవరంటే?
It’s all the closets People Coming back together 🔥
— thaman S (@MusicThaman) October 25, 2023
My 12th film with Our dear #MassMaharaj @RaviTeja_offl gaaru
My 7th #Blockbuster Film with my bawss @megopichand ❤️
My 4th Super Successful Project with @MythriOfficial
With a fantastic Technical Team @dop_gkvishnu… https://t.co/IToL6M7SLX
'బిగిల్', 'మెర్సల్', షారుఖ్ ఖాన్ లేటెస్ట్ హిట్ 'జవాన్' చిత్రాలకు అద్భుతమైన కెమెరా వర్క్ అందించిన జికె విష్ణు ఈ RT4GM చిత్రానికి సినిమాటోగ్రాఫర్. జాతీయ పురస్కార గ్రహీత ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తుండగా... మయూక్ ఆదిత్య, శ్రీనివాస్ గవిరెడ్డి, ఎం వివేక్ ఆనంద్, శ్రీకాంత్ నిమ్మగడ్డ రచనా విభాగంలో పని చేస్తున్నారు.
Also Read : చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - ఆ పేరు సినారే ఓ పుస్తకం కూడా రాశారండోయ్
ఈ చిత్రానికి కథ, దర్శకత్వం: గోపీచంద్ మలినేని, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్, సిఈవో: చెర్రీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : దినేష్ నరసింహన్, సంగీతం : థమన్, ఛాయాగ్రహణం : జీకే విష్ణు
కూర్పు : నవీన్ నూలి, మాటలు : సాయి మాధవ్ బుర్రా.
కథానాయికగా 'ఉప్పెన' ఫేమ్ కృతి శెట్టి?
ఈ సినిమాలో కథానాయికగా నేషనల్ క్రష్ నటించనున్నట్లు ఆ మధ్య ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. ఇప్పటి వరకు రవితేజ, రష్మిక మందన్నా కలిసి సినిమా చేయలేదు. అందువల్ల, వాళ్ళ కాంబినేషన్ కొత్తగా ఉంటుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే... ఇప్పుడు కొత్త పేరు వినబడుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'ఉప్పెన' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టిని ఈ సినిమాలోనూ కథానాయికగా తీసుకున్నారట.