అన్వేషించండి

Skanda OTT Release: 'స్కంద' ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ - కారణం ఏమిటంటే?

రామ్ పోతినేని నటించిన స్కంద మూవీ ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. అక్టోబర్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కావలసిన ఈ మూవీ టెక్నికల్ రీజన్స్ వల్ల నవంబర్ రెండవ వారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ఉస్తాద్ హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ 'స్కంద'(Skanda) ఓటీటీ రిలీజ్ వాయిదా పడింది. అక్టోబర్ 27న ఓటీటీలో విడుదల కావలసిన ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ పోన్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ స్కంద పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏంటి? డీటెయిల్స్ లోకి వెళ్తే.. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన మొదటి సినిమా 'స్కంద'. జీ స్టూడియోస్ తో కలిసి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రంలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించింది.

మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో సీనియర్ హీరో శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ, సాయి మంజ్రేకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 28న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండి మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. బోయపాటి తన సినిమాల్లో కథ కన్నా యాక్షన్, ఎలివేషన్స్ సీన్స్ కే ఎక్కువ ఇంపార్టెంట్ చేస్తారు. స్కంద లోనూ అదే చేశారు. ఈ సినిమా కోసం కథను పక్కన పెట్టేసి రామ్ ని ఉర మాస్ వేలో ప్రజెంట్ చేసి భారీ యాక్షన్ సీక్వెన్స్ లను ప్లాన్ చేశారు.

ఇందులో ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ కొన్నిచోట్ల పర్వాలేదు అనిపించినా చాలావరకు కథకి యాక్షన్స్ సన్నివేశాలకి సంబంధం లేకుండా మరీ ఓవర్ గా ఉండటంతో ఆడియన్స్ ఈ చిత్రాన్ని తిరస్కరించారు. అయితే యాక్షన్ సీన్స్ లో  రామ్ ని బోయపాటి చూపించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటిసారి రామ్ ఊర మాస్ లుక్ లో అదరగొట్టేసారు. డ్యాన్స్ కూడా ఇరగదీసారు. అయినా కూడా అవేమీ సినిమాని నిలబెట్టలేకపోయాయి. సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో చాలామంది ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్లి చూడడం మానేసి ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే 'స్కంద' మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా అక్టోబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుందని ప్రకటన వచ్చింది. కానీ తీరా చూస్తే స్కంద ఓటీటీ స్ట్రీమింగ్ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది. సినీ లవర్స్ ఈ విషయం తెలిసి కొంత నిరాశకు లోనవుతున్నారు. స్కంద ఓటీటీ పోస్ట్ పోన్ కు కారణం కొన్ని టెక్నికల్ రీజన్స్ అని అంటున్నారు. టెక్నికల్ రీజన్స్ వల్ల పోస్ట్ పోన్ అయిన స్కంద నవంబర్ రెండో వారంలో ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వస్తుందని సమాచారం వినిపిస్తోంది.

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే 'స్కంద' మూవీ క్లైమాక్స్ లో సీక్వెల్ ఉండబోతుందని బోయపాటి హింట్ ఇచ్చాడు. స్కంద రిజల్ట్ తేడా కొట్టడంతో సీక్వెల్ ఉంటుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇదే విషయంపై బోయపాటిని అడిగితే 'అఖండ' సీక్వెల్ తో పాటు 'స్కంద' సీక్వెల్ని కూడా తీస్తానని అన్నారు. మరి 'స్కంద' సీక్వెల్ తోనైనా బోయపాటి - రామ్ కాంబో సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.

Also Read : నా ఫస్ట్ లిప్ లాక్ ఆయనతోనే, అసలు విషయం చెప్పిన శ్రీలీల

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Sunday OTT Movies : ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
Least Eligible Bachelor Review - 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రివ్యూ: రెండు ఓటీటీల్లో 'జబర్దస్త్' బాబు కామెడీ సిరీస్ - హీరోగా హర్ష చెముడు ఏం చేశారంటే?
'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' రివ్యూ: హీరోగా హర్ష చెముడు... కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Romantic Action Thriller OTT : చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
చిన్నారుల కిడ్నాప్... మాఫియాను ఎలా పట్టుకున్నారు? - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget