Sreeleela First Lip Lock: నా ఫస్ట్ లిప్ లాక్ ఆయనతోనే, అసలు విషయం చెప్పిన శ్రీలీల
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల లిప్ లాక్ సీన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన తొలి లిప్ లాక్ సీన్ ఆయనతోనే అంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
తెలుగమ్మాయి శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ఆమె నటించిన సినిమాలు మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర నిర్మాతలు ఆమెకే ప్రియారిటీ ఇస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ హీరో నుంచి సీనియర్ హీరోల వరకు శ్రీలీలనే ఫస్ట్ ఛాయిస్ తనే అవుతోంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో సుమారు అర డజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పెద్ద సినిమాలే. ఆమె రీసెంట్ గా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చక్కటి నటనతో అందరినీ ఆకట్టుకుంది. బాలయ్య కూతురి పాత్రలో ఒదిగిపోయిన నటించి, అందరి ప్రశంసలు అందుకుంది.
నా తొలి లిప్ లాక్ అతడితోనే- శ్రీలీల
తాజాగా ‘భగవంత్ కేసరి’ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా సినిమాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే ఆమెకు ఓ క్రేజీ ప్రశ్న ఎదురయ్యింది. ఈ ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం చెప్పింది శ్రీలీల. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే? టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే, ఎవరితో చేస్తారు? అని ఓ యాంకర్ అడిగింది. ఈ ప్రశ్నకు ఆమె ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది. తొలుత తాను ఏ హీరోతో లిప్ లాక్ సీన్లు చేయను అని చెప్పింది. ఒకవేళ అలా చేయాల్సి వస్తే మాత్రం తన భర్తకే తొలి కిస్ ఇస్తానని చెప్పింది. మొత్తంగా తాను లిప్ లాక్ సీన్లు చేసే ప్రసక్తే లేదని శ్రీలీల తేల్చి చెప్పింది.
View this post on Instagram
విడుదలకు రెడీ అవుతున్నన ‘ఆది కేశవ’
ప్రస్తుతం ‘పంజా’ వైష్ణవ్ తేజ్ తో కలిసి శ్రీలీల ‘ఆది కేశవ’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఈ మూవీ నుంచి ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘లీలమ్మో’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఈ ఫాటలో శ్రీలీల వేసిన డ్యాన్స్ అందరి మతి పోగొడుతోంది. క్రేజీ స్టెప్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి ‘గుంటూరు కారం’, పవన్ కల్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, విజయ్ దేవరకొండ, నితిన్ తో సినిమాలు చేస్తోంది. మరికొన్ని సినిమాలకు కూడా శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరుస సినిమాలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది శ్రీలీల.
Read Also: దీపిక-రణ్‌వీర్ వెడ్డింగ్ వీడియో చూశారా? పెళ్లైన 5 ఏళ్లకు బయటకు వచ్చింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial