Suriya 43 : సూర్య సినిమాలో దుల్కర్, నజ్రియా కూడా - సుధా కొంగరతో కొత్త సినిమా గురూ!
Suriya 43 Movie Update : సూర్య హీరోగా ఇవాళ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఆయనతో 'ఆకాశమే నీ హద్దురా' వంటి హిట్ సినిమా తీసిన సుధా కొంగర దీనికి డైరెక్టర్. ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?
Suriya 43 Movie : సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వం వహించిన 'సూరారై పొట్రు' భారీ విజయం సాధించింది. ఆ సినిమా 'ఆకాశమే నీ హద్దురా' పేరుతో తెలుగులో విడుదల అయ్యింది. ఇక్కడ కూడా హిట్. తెలుగు, తమిళ భాషల్లో భారీ విజయం సాధించడమే కాదు... విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఉత్తమ సినిమాగా జాతీయ పురస్కారం అందుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి ప్రస్తావన ఎందుకంటే...
'ఆకాశమే నీ హద్దురా' విజయం తర్వాత సూర్య, సుధా కొంగర కలిసి మరో సినిమా చేస్తున్నారు. ఈ రోజు ఆ సినిమాను అధికారికంగా ప్రకటించారు. హీరోగా సూర్య 43వ చిత్రమిది. సూర్య 43వ చిత్రాన్ని ఆయన సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. స్నేహితుడు రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్, శ్రీమతి జ్యోతికతో కలిసి సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
దుల్కర్, నజ్రియా, విజయ్ వర్మ కూడా
Suriya 43 Cast Crew : ఈ సినిమాలో మలయాళ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన దుల్కర్ సల్మాన్, మలయాళ హీరోయిన్ నజ్రియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వాళ్ళిద్దరూ సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. విలన్ రోల్ తమన్నా భాయ్ ఫ్రెండ్, హిందీ యాక్టర్ విజయ్ వర్మ చేస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. సంగీత దర్శకుడిగా ఆయన 100వ చిత్రమిది.
Also Read : రెండో పెళ్ళికి 'ఎస్' చెప్పిన అమలా పాల్ - వరుడు ఎవరంటే?
Dear all we are excited! Joining hands with @Sudha_Kongara again in a @gvprakash musical, his 100th! SO looking forward to work with my brother @dulQuer & the talented #Nazriya & the performance champ @MrVijayVarma Glad @2D_ENTPVTLTD is producing this special film! #Jyotika… pic.twitter.com/wW9iu0jMeR
— Suriya Sivakumar (@Suriya_offl) October 26, 2023
తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశారట. ఇందులో పోరాటాలు వంటివి ఉన్నాయట. ఈ సినిమాలో సూర్యది కాలేజీ స్టూడెంట్ రోల్ అని కోలీవుడ్ టాక్. అదీ కొన్ని సన్నివేశాల్లో ఆయన విద్యార్థిగా కనిపిస్తారట. ఆ ఎపిసోడ్ కోసం సూర్య బరువు తగ్గాలని అనుకుంటున్నారట. దర్శకురాలు కాక ముందు మణిరత్నం దగ్గర దర్శకత్వ శాఖలో సుధా కొంగర పని చేశారు. అప్పుడు మణిరత్నం దర్శకత్వంలో సూర్య 'యువ' (తమిళంలో Aaytha Ezhuthu) సినిమా చేశారు. ఆ క్యారెక్టర్ ఛాయలు ఈ సినిమాలో కనిపిస్తాయట.
Also Read : చిరంజీవి కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - ఆ పేరు సినారే ఓ పుస్తకం కూడా రాశారండోయ్
ఇప్పుడు సూర్య 'కంగువ' సినిమా చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం టీజర్ విడుదల చేశారు. ఒక్కసారిగా సినిమాపై అంచనాలను ఆ టీజర్ పెంచింది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం కూడా హైలైట్ అయ్యింది. ఆ చిత్రానికి శివ దర్శకత్వం చేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial