‘లియో’ ఓటీటీ రిలీజ్ డేట్, ‘టైగర్ 3’లో హృతిక్ కూడా - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'లియో' - కారణం అదేనా?
కోలీవుడ్ అగ్ర హీరో దళపతి విజయ్ నటించిన 'లియో'Leo) మూవీ అనుకున్న దానికంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతోంది. ప్రస్తుతం థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటున్న ఈ మూవీని అనుకున్న డేట్ కి కాకుండా ముందుగానే రిలీజ్ చేయబోతుండటం గమనార్హంగా మారింది. అందుకు కారణం లియో మూవీ ఆన్ లైన్ లో లీక్ అవ్వడమే అని చెబుతున్నారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. 'విక్రమ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ - దళపతి విజయ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'లియో'(Leo) దసరా కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. తొలి రోజు నుంచి మూవీకి మిక్స్ టాక్ వచ్చినా కలెక్షన్స్ మాత్రం దుమ్మురేపింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ముగ్గురు బడా హీరోలతో స్పై యూనివర్స్ - 'టైగర్ 3'లో సల్మాన్, షారుక్‌తో పాటూ మరో హీరో కూడా?
బాలీవుడ్లో యశ్ రాజ్ స్పై యూనివర్స్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యూనివర్స్ నుంచి వచ్చిన అన్ని సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ ని సొంతం చేసుకున్నాయి. అగ్ర హీరోలతో యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నుంచి సల్మాన్ ఖాన్ నటిస్తున్న స్పై అండ్ యాక్షన్ ట్రైలర్ 'టైగర్ 3'(Tiger 3) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ లో వచ్చిన 'ఏక్ థా టైగర్'(Ek Tha Tiger) తో ఈ స్పై యూనివర్స్ స్టార్ట్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్ గా 'టైగర్ జిందా హై'(Tiger Zinda Hai) భారీ సక్సెస్ అందుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
త్రిష నటించిన మిస్టరీ థ్రిల్లర్ 'ది రోడ్' ఓటీటీలోకి వచ్చేస్తోంది - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష నటించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ రెడీ అయింది. ఆహా తమిళం ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇంతకీ ఆ మూవీ పేరేంటి? ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? అనే వివరాల్లోకి వెళితే.. చెన్నై బ్యూటీ త్రిష కోలీవుడ్లో రీసెంట్ గా 'ది రోడ్'(The Road) అనే మూవీలో నటించింది. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ నెల రోజుల కింద థియేటర్స్ లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. కానీ కమర్షియల్ గా అంతగా సక్సెస్ అవ్వలేకపోయింది. అరుణ్ వసీగరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కొన్ని నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కగా, ఇందులో త్రిష లీడ్ రోల్ పోషించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రవితేజ 'ఈగల్' టీజర్‌కి ముహూర్తం ఖరారు - ఎప్పుడంటే?
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'ఈగల్'(Eagle) మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ని అందించారు. ఇటీవల 'ఈగల్' మూవీ టీజర్ అనౌన్స్మెంట్ అంటూ పోస్టర్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో స్పెషల్ పోస్టర్‌తో ఈగల్ టీజర్ డేట్ అండ్ టైం ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రజెంట్ రవితేజ హిట్, ప్లాప్స్తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ గా 'టైగర్ నాగేశ్వరావు'(Tiger Nageshwararao) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని వంశీకృష్ణ దర్శకత్వం వహించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'గుంటూరు కారం' నుంచి 'దమ్ మసాలా' సాంగ్ ప్రోమో వచ్చిసిందోచ్ - మీరు చూశారా?
సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు.. సినీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'గుంటూరు కారం'(Guntur Karam) ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది. కొద్దిసేపటికి క్రితమే ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. దమ్ మసాలా(Dum Masala) అంటూ సాగే ఈ ప్రోమో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'(Guntur karam). 'అతడు', 'ఖలేజా' వంటి సినిమాల తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ లోనూ ఈ మూవీపై భారీ అంచనాల నెలకొన్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)