'గుంటూరు కారం' నుంచి 'దమ్ మసాలా' సాంగ్ ప్రోమో వచ్చిసిందోచ్ - మీరు చూశారా?
మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' నుంచి ఫస్ట్ సింగిల్ 'దమ్ మసాలా' సాంగ్ ప్రోమోని తాజాగా విడుదల చేశారు మేకర్స్.
సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు.. సినీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'గుంటూరు కారం'(Guntur Karam) ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది. కొద్దిసేపటికి క్రితమే ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు మేకర్స్. దమ్ మసాలా(Dum Masala) అంటూ సాగే ఈ ప్రోమో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'గుంటూరు కారం'(Guntur karam). 'అతడు', 'ఖలేజా' వంటి సినిమాల తర్వాత మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ ఆడియన్స్ లోనూ ఈ మూవీపై భారీ అంచనాల నెలకొన్నాయి.
ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ దసరాకి రిలీజ్ చేస్తామని చెప్పినా దసరా అయిపోయి దీపావళి కూడా వస్తుండటంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నిన్న ఉదయం గుంటూరు కారం సాంగ్ అంటూ 'మసాలా బిర్యాని' అనే ఓ పాట లీకై సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. దీంతో చిత్ర యూనిట్ అప్రమత్తమై ఫస్ట్ సాంగ్ 'దమ్ మసాలా'(Dum Masala) ప్రోమోని నేను విడుదల చేస్తామని ప్రకటించారు.
#DumMasala... Coming to you soon!! 🔥https://t.co/TbFQwJNmaN#Trivikram @sreeleela14 @Meenakshiioffl @vamsi84 @MusicThaman @ramjowrites #SanjithHegde @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th
— Mahesh Babu (@urstrulyMahesh) November 5, 2023
చెప్పినట్లుగానే కాసేపు క్రితమే మేకర్స్ 'గుంటూరు కారం' ఫస్ట్ సింగిల్ 'ధమ్ మసాలా' ప్రోమో ని రిలీజ్ చేశారు. ఈ ప్రోమోని ఎలాంటి వీడియో బైట్స్ చూపించకుండా కేవలం మోషన్ పోస్టర్ తోనే రిలీజ్ చేయడం విశేషం. "ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కా పై గుండి" అనే లిరిక్స్ తో ఈ పాట మొదలైంది. ఓ రెడ్ కలర్ జీప్ లో మహేష్ మాస్ ఎంట్రీని మోషన్ పోస్టర్ రూపంలో చూపించారు. ఈ ప్రోమోని చూసిన కొందరు ఫ్యాన్స్ ఇది 'గుంటూరు కారం'లో మహేష్ ఇంట్రో సాంగ్ అని కామెంట్స్ చేస్తున్నారు. నవంబర్ 7న ఫుల్ సాంగ్ విడుదల చేస్తున్నట్లు ప్రోమో లో పేర్కొన్నారు. ఇక తాజాగా విడుదలైన ఈ ప్రోమో సాంగ్ మహేష్ ఫ్యాన్స్ తో పాటు నెటిజెన్స్ ని సైతం ఆకట్టుకుంటుంది.
ఎస్. ఎస్ తమన్ కంపోజిషన్లో ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రచించగా.. సంచిత్ హెగ్డే, తమన్ కలిసి ఆలపించారు. మరి ఫుల్ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే నవంబర్ 7 వరకు వేచి చూడాల్సిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బార్డర్ పై ఎస్. రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్. ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
Also Read : 'కన్నప్ప' కోసం ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ - మంచు విష్ణు ఎక్కడా తగ్గట్లేదుగా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial