ముగ్గురు బడా హీరోలతో స్పై యూనివర్స్ - 'టైగర్ 3'లో సల్మాన్, షారుక్‌తో పాటూ మరో హీరో కూడా?
యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న స్పై యూనివర్స్ 'టైగర్ 3'లో షారుక్ ఎంట్రీతో పాటు హృతిక్ రోషన్ ఎంట్రీ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్లో యశ్ రాజ్ స్పై యూనివర్స్ కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ యూనివర్స్ నుంచి వచ్చిన అన్ని సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ ని సొంతం చేసుకున్నాయి. అగ్ర హీరోలతో యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నుంచి సల్మాన్ ఖాన్ నటిస్తున్న స్పై అండ్ యాక్షన్ ట్రైలర్ 'టైగర్ 3'(Tiger 3) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ లో వచ్చిన 'ఏక్తా టైగర్'(Ektha Tiger) తో ఈ స్పై యూనివర్స్ స్టార్ట్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో దీనికి సీక్వెల్ గా 'టైగర్ జిందా హై'(Tiger Zinda Hai) భారీ సక్సెస్ అందుకుంది.
ఈ రెండు సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ఈ స్పై సిరీస్ ని కొనసాగిస్తూ ఈ ఏడాది షారుక్ ఖాన్ హీరోగా 'పఠాన్'(Pathaan) ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు అందుకొని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 'పఠాన్' మూవీలో టైగర్ క్యారెక్టర్ ని లాస్ట్ లో రివిల్ చేయడం ద్వారా నెక్స్ట్ 'పఠాన్' వర్సెస్ 'టైగర్' మూవీ ఉండబోతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అలాగే ఆదిత్య చోప్రా దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలింస్ నిర్మాణంలో హృతిక్ రోషన్ హీరోగా వార్ మూవీ సైతం రూపొందింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. దీనికి సీక్వెల్ గా ఇప్పుడు 'వార్ 2'(War 2( మూవీ చేస్తున్నారు.
ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీలో హృతిక్ రోషన్ కి పోటీగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ 3' లో షారుక్ క్యారెక్టర్ తో పాటు హృతిక్ రోషన్ రోల్ కూడా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్ లో ముగ్గురు రా ఏజెంట్ పాత్రలను కలపడం ద్వారా పఠాన్ యూనివర్స్ కి కొనసాగింపు చూపించబోతున్నారట. దీని వీళ్లు ఎలా కలుపుతారు? నెక్స్ట్ సినిమాకి ఎలా లీడ్ ఇస్తారనేది సర్వత్ర ఆసక్తికరంగా మారింది. అంటే టైగర్ 3 లో సల్మాన్ ఖాన్ తో పాటు షారుక్, హృతిక్ రోషన్ ఎంట్రీస్ కూడా ఉండబోతున్నాయన్నమాట.
ఈ న్యూస్ తో టైగర్ 3 పై ఉన్న అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో బాలీవుడ్ ఆడియన్స్ 'టైగర్ 3' కోసం ఎంతోగానో వెయిట్ చేస్తున్నారు. ఇక టైగర్ 3 విషయానికి వస్తే.. సల్మాన్, కత్రినా మరోసారి ఈ మూవీతో జత కడుతున్నారు. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ భారీ రెస్పాన్స్ ని అందుకున్నాయి. ప్రీతం చక్రవర్తి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 12న హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.
Also Read : షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ.. 'ఇలాంటి వాళ్లే రేపు రేపిస్ట్లు అవుతారు' అంటూ వ్యాఖ్య
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial