అన్వేషించండి

Anasuya Bharadwaj : షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ.. 'ఇలాంటి వాళ్లే రేపు రేపిస్ట్​లు అవుతారు' అంటూ వ్యాఖ్య

'ఆంటీ' అంటూ యాంకర్ అనసూయని నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆంటీ అంటే తనకు కోపం ఎందుకు వస్తుందనే దానిపై క్లారిటీ ఇచ్చింది.

అనసూయ భరద్వాజ్‌ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్​గా ఓ వెలుగు వెలిగిన ఆమె, తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ప్రస్తుతం నటిగా బిజీగా మారిపోయింది. వరుస సినిమాలు చేస్తూ వెండితెర మీద సందడి చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్​గా ఉండే అనసూయ.. తన హాట్ ఫోటోలు, వీడియోలతో నెట్టింట రచ్చ చేస్తుంది. అదే సమయంలో విపరీతంగా ట్రోలింగ్​కు గురవుతూ ఉంటుంది. ముఖ్యంగా 'ఆంటీ' అంటూ ఆమెను నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. అనసూయ వీలుకుదిరినప్పుడల్లా ట్రోలర్స్​కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో పోలీస్ కేసులు పెట్టడానికి కూడా ఆమె వెనకాడలేదు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆంటీ అంటే తనకు ఎందుకు అంత కోపం వస్తుందో అనసూయ వివరించింది.

చిన్న పిల్లలు ఆంటీ అని పిలిస్తే తనకు ఇబ్బందేమీ లేదని, కానీ మరో రకంగా అలా పిలిచే పెద్దవాళ్ళకు తను ఆంటీని కాదని తెలిపింది అనసూయ. ఆంటీ అని పిలవడం తనకు నచ్చదని చెప్పినప్పుడు ఎందుకు అలా పిలవాలని ప్రశ్నించింది. ముఖ పరిచయంలేని తన మీదే వాళ్ళకి ఇంత హేట్ ఉందంటే, వారి చుట్టూ ఉన్న ఆడవాళ్ళతో ఎలా ఉంటారో ఆలోచించాలని.. ఇలాంటి వాళ్ళే రేపు రేపిస్ట్​లుగా తయారవుతారని షాకింగ్ కామెంట్స్ చేసింది. ''నేను సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేస్తే 'ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవచ్చు కదా.. ఇవన్నీ మీకు ఎందుకు ఆంటీ' అని కామెంట్స్ చేస్తుంటారు. ఆంటీ అనే పదం తప్పు కాదు. కానీ దాన్ని కొందరు కొంచెం వల్గర్​గా వాడతారు. మల్లూ ఆంటీ లాగా వాడతారనేది వాళ్ళ సౌండ్ ని బట్టి నాకు అర్థమైపోతుంది. నా పిల్లల ఫ్రెండ్స్ నన్ను ఆంటీ అనే పిలుస్తారు. వాళ్ళకి ఏ ఇంటెన్షన్ ఉండదు కాబట్టి చాలా క్యూట్ గా ఉంటుంది'' అని చెప్పింది అనసూయ. 

''ఆంటీ అంటే పిన్ని.. అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళని పిలవడానికి ఉపయోగించాలని మనకు చిన్నప్పటి నుంచి నేర్పించారు. నేను కూడా చిన్నప్పుడు చాలా మంది పక్కింటి వాళ్ళని ఆంటీ అనే పిలిచాను. ఒకవేళ వాళ్ళు అలా పిలవొద్దు, మాకు ఏజ్ వచ్చినట్లు ఫీల్ అవుతున్నాం అంటే నేను ఇంక పిలవను. నేను అలా పిలిస్తే వాళ్ళు హర్ట్ అవుతున్నారని తెలిసినప్పుడు ఆంటీ అని పిలవడం మానేస్తా. ఏదో కారణంతో నన్ను అలా పిలవడం నాకు నచ్చట్లేదు. అయినా ఎందుకు అలా పిలవాలి?. అవతలి వాళ్ళని ఎందుకు హార్ట్ చేయాలి? అలాంటి పైశాచిక ఆనందం ఎందుకు? ఈ జన్మలో మనం ఫేస్ టు ఫేస్ చూసుకుంటామో లేదో తెలియదు. అయినా నా మీద అంత హేట్ ఉందంటే, అతని చుట్టూ ఉన్న ఆడవాళ్ళతో వాడు ఎలా ఉంటాడు?. ఇలాంటి వాళ్లే రేపు రేపిస్ట్​లు అవుతారు'' అని అనసూయ చెప్పుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
 
అనసూయని ఆంటీ అంటూ గతంలో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ అయ్యేలా చేసారు. దీనిపై ఘాటుగా స్పందించిన యాంకర్‌.. తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటానని పలుమార్లు హెచ్చరించింది. చెప్పినట్లుగానే తనను ఏజ్ షేమింగ్ చేస్తున్నారంటూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే వివాదంపై ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ఆంటీ అని పిలవడంలో తప్పు లేదు కానీ, గడ్డాలు మీసాలు వచ్చిన వారు కూడా అలా పిలిస్తే ఒప్పుకోనని అనసూయ స్పష్టం చేసింది. తన పిల్లల వయసున్న వారు ఆంటీ అని పిలిస్తే అర్థం ఉందని, కానీ పెళ్లీడుకొచ్చిన అబ్బాయిలు పిలిస్తే మాత్రం ఊరుకోనని తేల్చి చెప్పింది.

ఆంటీ అని పిలిస్తే ఎందుకంత కోపం వస్తుందనే విషయంపై ఇంస్టాగ్రామ్ లో మాట్లాడుతూ ''ఆంటీ అంటూ వాళ్లు పిలిచే పిలుపులకు అర్థాలు వేరే ఉంటాయి. అందుకే నాకు కోపం వస్తుంది. అయినా ఇప్పుడు నాకు కోపం రావట్లేదు. ఎందుకంటే వాళ్ల ఖర్మకే వదిలేస్తున్నా. పైగా నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. అందుకే ఆ చెత్త కామెంట్లను పట్టించుకోవటం మానేశాను'' అని అనసూయ తెలిపింది. ఇప్పుడు లేటెస్టుగా మరోసారి ఆంటీ వివాదంపై వివరణ ఇచ్చింది. 

టాప్ హెడ్ లైన్స్

Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
Nagarjuna: వాయిదాలు ఎందుకు? టాలీవుడ్‌లో తప్పుల్ని బయటపెట్టిన నాగార్జున
వాయిదాలు ఎందుకు? టాలీవుడ్‌లో తప్పుల్ని బయటపెట్టిన నాగార్జున
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Rajamouli Reaction : రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ
రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
తిరుమల యాత్రలో వారాహి అమ్మవారి దర్శనం: కోరికలు తీర్చే శ్రీశక్తిపీఠం రహస్యం!
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Embed widget