అన్వేషించండి

‘కీడా కోలా’, ‘పొలిమేర 2’ రివ్యూలు, ‘ఖైదీ 2’పై కార్తీ క్లారిటీ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

కీడా కోలా రివ్యూ : తరుణ్ భాస్కర్ క్రైమ్ కామెడీ నవ్వించిందా? లేదా?
దర్శకుడిగా పరిచయమైన 'పెళ్లి చూపులు', ఆ తర్వాత తీసిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'కీడా కోలా'. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తీశారు. ఈ సినిమా ఎలా ఉంది? ఏమిటి? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఆ ప్రాజెక్ట్ తర్వాతే సీక్వెల్ ఉంటుంది - 'ఖైదీ 2' పై క్లారిటీ ఇచ్చిన కార్తీ!
కోలీవుడ్ అగ్ర హీరో కార్తీ ఖైదీ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాను నటించిన 'జపాన్'(Japan) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కార్తి 'ఖైదీ 2' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా 2019లో వచ్చిన 'ఖైదీ'(Khaidi) మూవీ సూపర్ హిట్టైంది. ఈ సినిమాతోనే దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఖైదీ సక్సెస్ తో తమిళ్, తెలుగు సినిమా ఇండ్రస్ట్రీ లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో లోకేష్ కి భారీ మార్కెట్ క్రియేట్ అయింది. అప్పటి నుంచీ ఖైదీ సీక్వెల్ గురించి చర్చ జరుగుతూనే వస్తోంది. ప్రమోషన్ లో భాగంగా కార్తీ మీడియాతో మాట్లాడుతూ 'ఖైదీ 2' గురించి క్లారిటీ ఇచ్చాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'పొలిమేర 2' రివ్యూ : థియేటర్లలో హిట్ అయ్యే కంటెంట్ ఉందా? ఫస్ట్ పార్ట్ కంటే బావుందా?
తెలుగు సినిమాలు కొన్నిటిలో తాంత్రిక పూజలు, మాంత్రిక విద్యలు, చేతబడి వంటి నేపథ్యంలో సన్నివేశాలు ఉన్నాయి. అయితే పూర్తిగా చేతబడి నేపథ్యంలో వచ్చిన సినిమా మా ఊరి పొలిమేర. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. సత్యం రాజేష్, కామాక్షీ భాస్కర్ల, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీలో విడుదలైన ఆ సినిమాకు ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించారు. మా ఊరి పొలిమేర 2ను థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'తంగలాన్' లో విక్రమ్ డైలాగ్స్ పై స్పందించిన మేనేజర్ - తప్పుగా అర్థం చేసుకున్నారంటూ!
రీసెంట్ గా 'పొన్ని యన్ సెల్వన్' మూవీతో మంచి సక్సెస్ అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ త్వరలోనే 'తంగలాన్'(Thangalaan) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ సినిమా కోసం ప్రయోగం చేశాడు విక్రమ్. రీసెంట్ గా విడుదలైన టీజర్ లో విక్రమ్ గెటప్ చూసి అందరూ షాక్ అయిపోయారు. మంచి ఫిజిక్ తో ఉండే విక్రమ్ తంగలాన్ కోసం పూర్తిగా బరువు తగ్గిపోయి బక్క చిక్కిపోయి కనిపించాడు. సినిమా కోసం ఏకంగా 20 కేజీల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి ప్రయోగాలు విక్రమ్ కి కొత్తమీ కాదు. గతంలో 'శివపుత్రుడు', 'అపరిచితుడు', 'ఐ' సినిమాల్లో చేసి ప్రేక్షకుల్ని అలరించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

హాలీవుడ్ సినిమాలను తలపించేలా 'సలార్' యాక్షన్ సీక్వెన్స్ - అంచనాలు పెంచేస్తోన్న లేటెస్ట్ అప్డేట్!
ఇండియన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్'(Salaar) కోసం సినీ లవర్స్ ఎంత ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'కేజిఎఫ్' మూవీ తో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కించడం, చాలాకాలం తర్వాత ప్రభాస్ చేస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అన్ని బాగుండుంటే ఇప్పటికే ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేది. కానీ బెస్ట్ అవుట్ పుట్ కోసం మూవీ రిలీజ్ ని డిసెంబర్ 22 కు వాయిదా వేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Farmers Protest: ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
ఈ 6 నుంచి రైతుల ‘ఢిల్లీ ఛలో’ పాదయాత్రతో అలర్ట్, భారీగా పోలీసుల మోహరింపు
Embed widget