రాజస్థాన్ రాయల్స్‌కు RRR వార్నింగ్, చైతూతో డేటింగ్‌పై శోభిత స్పందన - ఈ రోజు సినీ విశేషాలివే!
టాప్-5 ఎంటర్‌టైన్మెంట్ న్యూస్ @ 5 pm - ఈ రోజు సినీ విశేషాలివే!
తొక్క తీస్తా, రాజస్థాన్ రాయల్స్‌కు ‘RRR’ మాస్ వార్నింగ్
ఐపీఎల్‌లో టీమ్‌ల మధ్య కోల్డ్ వార్ సహజమే. అయితే, అది మైదానం వరకు ఉంటే పర్వాలేదు. హద్దులు దాటితే.. ఫలితంగా గట్టిగానే ఉంటుంది. ఇందుకు రాజస్థాన్ రాయల్స్ చేసిన ట్వీటే నిదర్శనం. ఈ పోస్ట్ ఇప్పుడు క్రికెట్ వర్సెస్ సినిమా లవర్స్ వార్‌గా మారింది. చివరికి.. రాజమౌళి టీమ్ కూడా ఘాటుగా స్పందించాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
నాగచైతన్యతో డేటింగ్ పై శోభిత ధూళిపాళ్ల క్లారిటీ
గత కొంతకాలం నుంచి టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. స్టార్ హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత శోభిత, నాగ చైతన్యకు దగ్గరైందంటూ, వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ పలు కథనాలు కూడా వచ్చాయి. ఈ ప్రచారంపై తాజాగా శోభిత ధూళిపాళ్ల స్పందించారు. ఎవరో ఏదో అంటున్నారని దాన్ని పట్టించుకుని ఫీలైపోవాల్సిన అవసరం లేదని, ఆ రూమర్స్ తో తనకెలాంటి సంబంధం లేనప్పుడు, తాను ఏ తప్పూ చేయనప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన పనికూడా లేదని ఆమె తేల్చి చెప్పేశారు. ఈ ఆసక్తికరమైన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సమంత హార్డ్ వర్కర్ - ఫోన్ పగలగొట్టాలనిపిస్తాది: నాగ చైతన్య
అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ మూవీ ఫ్లాప్ నేపథ్యంలో అందరి కళ్లు ఇప్పుడు నాగ చైతన్య ‘కస్టడీ’పై ఉన్నాయి. అయితే, ‘ఏజెంట్’తో పోల్చితే ‘కస్టడీ’కి కాస్త పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. మరోవైపు ‘కస్టడీ’ టీమ్ ప్రమోషన్స్ కూడా జోరుగానే చేస్తోంది. ఈ సందర్భంగా నాగ చైతన్య పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. అయితే, ప్రతి ఇంటర్వ్యూలో ఆయనకు సమంతతో విడాకుల గురించే ప్రశ్నలు ఎదురవ్వుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చైతుకు మరోసారి తన విడాకుల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు చైతూ కాస్త అసహనం ప్రదర్శిస్తూనే.. చాలా కూల్‌గా సమాధానం చెప్పారు. అంతేకాదు, సమంత గురించి కూడా పాజిటివ్‌గా స్పందించారు. దీంతో చైతూను అభిమానులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రజినీ 'లాల్ సలామ్' ఫస్ట్ లుక్: ఎప్పుడూ కనిపించని లుక్‌లో సూపర్ స్టార్
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తోన్న 'లాల్ సలామ్' చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్ ఫుల్ క్యామియోలో నటిస్తున్నారనే వార్త అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'మోయిద్దీన్ భాయ్' పాత్రలో రజినీకాంత్ క్యారెక్టర్ పోస్టర్‌ను 'లాల్ సలామ్' బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
నాగ చైతన్య 'కస్టడీ సీక్వెల్'పై హింట్ ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ ప్రభు
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య ద్విభాషా చిత్రం, 'కస్టడీ' మే 12, 2023న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమైంది. ఈ విడుదలకు ముందు, మేకర్స్ హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. కస్టడీ కి సీక్వెల్ ఉంటుందని ఆయన ఇన్ డైరెక్ట్ గా రివీల్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)