By: Suresh Chelluboyina | Updated at : 08 May 2023 03:07 PM (IST)
Image Credit: Sanju Samson and RRR/Twitter
ఐపీఎల్లో టీమ్‌ల మధ్య కోల్డ్ వార్ సహజమే. అయితే, అది మైదానం వరకు ఉంటే పర్వాలేదు. హద్దులు దాటితే.. ఫలితంగా గట్టిగానే ఉంటుంది. ఇందుకు రాజస్థాన్ రాయల్స్ చేసిన ట్వీటే నిదర్శనం. ఈ పోస్ట్ ఇప్పుడు క్రికెట్ వర్సెస్ సినిమా లవర్స్ వార్‌గా మారింది. చివరికి.. రాజమౌళి టీమ్ కూడా ఘాటుగా స్పందించాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. ఇక రాజస్థాన్ రాయల్స్‌దే విజయం అనుకుంటున్న సమయంలో.. సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. మ్యాచ్ చివరి ఓవర్లో అనూహ్య మలుపు తిరిగింది. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. మరి, ఈ విజయాన్ని రాజస్థాన్ టీమ్ అవమానంగా భావించిందో ఏమిటో.. ట్విట్టర్ ద్వారా తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను తక్కువ చేసేందుకు ప్రయత్నించింది. రాజస్థాన్ రాయల్ కెప్టెన్ సంజూ శాంసన్ (SSS).. ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ కంటే గొప్ప అనేలా పోస్ట్ పెట్టింది. అది కాస్తా ఫ్యాన్స్ మధ్య సోషల్ వార్‌కు దారి తీసింది.
SSS (skipper sanju samson) 🏏 > RRR 🎬
— Rajasthan Royals (@rajasthanroyals) May 7, 2023
ఈ విషయం తెలిసి.. నిర్మాత డీవీవీ దానయ్య ఎంటర్‌టైన్మెంట్ స్పందించింది. ఈ సందర్భంగా ఇడియెట్‌లోని పోలీస్ స్టేషన్ సీన్‌ను షేర్ చేసింది. ‘‘తొక్క తీస్తా...’’ అనే డైలాగ్‌తో రాజస్థాన్ రాయల్స్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ‘వెంకీ’ సినిమాలో రైల్లో బ్రహ్మానందం.. రవితేజను చెంప కొట్టే మీమ్‌తో సమాధానం ఇచ్చారు. దీంతో నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. మీ నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరీ RRRతో అతడి పోలీస్తే ఎలా ఊరుకుంటాం అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ మీద పెద్ద రచ్చే జరుగుతోంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ స్పందించక తప్పలేదు.
https://t.co/ZkOjjssgNC pic.twitter.com/LebAQu4cGX
— DVV Entertainment (@DVVMovies) May 7, 2023
https://t.co/onKCCcm58U pic.twitter.com/P7tPufnbEk
— RRR Movie (@RRRMovie) May 7, 2023
ఆ ట్వీట్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ స్పందించక తప్పలేదు. ‘‘ఈ మూవీ ప్రపంచాన్నే మెప్పించింది. క్షమాపణలు తెలియజేస్తున్నాం’’ అని మరో ట్వీట్‌లో పేర్కొంది. దీనిపై ‘ఆర్ఆర్ఆర్’కు చెందిన మరో ట్విట్టర్ ఖాతా ద్వారా రాజమౌళి టీమ్ స్పందించింది. బ్రహ్మానందం GIF ఇమేజ్‌తో ‘‘అదే మ్యాజిక్కు’’ అని ఆ ట్వీట్‌కు రిప్లయ్ ఇవ్వడంతో ఫ్యాన్ వార్ కాస్త సద్దుమణిగింది. మొత్తానికి భలే సమాధానం ఇచ్చారు అంటూ సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను పొగిడేస్తున్నారు.
Also Read: సమంత హార్డ్ వర్కర్ - ఫోన్ పగలగొట్టాలనిపిస్తాది: నాగ చైతన్య
‘ఆర్ఆర్ఆర్’ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు రావడంతో ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అక్కడ కూడా ‘ఆర్ఆర్ఆర్’ తన సత్తాను చాటింది. ఈ సినిమాను అక్కడ విడుదల చేసినప్పటినుంచీ నిరంతరాయంగా థియేట్రికల్ రన్ కొనసాగుతూ దిగ్విజయంగా 20 వ వారంలోకి ప్రవేశించింది. అంతే కాదు ఇప్పటి వరకూ 80 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. జపాన్ లో 44 నగరాలలో 209 స్క్రీన్ 31 ఐమాక్స్ లలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన సినిమాగా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ టైమ్ ముగిసే సరికి 100 కోట్ల కలెక్షన్లను సాధిస్తుందని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. నిజంగా జపాన్ లో ఈ మూవీ 100 కోట్ల మార్క్ దాటితే మరో సంచలనమే అవుతుందని చర్చించుకుంటున్నారు ఫిల్మ్ లవర్స్.
Bro Movie Update: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!
The Kerala Story: కమల్ హాసన్ కామెంట్స్‌కు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ కౌంటర్
Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు
Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్ తండ్రి ఆవేదన!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ భేటీ- 40 నిమిషాలు సాగిన సమావేశం
CSK vs GT, IPL Final: సోమవారం కూడా వర్షం పడితే - ఎవరిని విజేతగా ప్రకటిస్తారు?
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!
ఒక్క ఛాన్స్ ప్లీజ్ - తెలుగులోకి వస్తానంటున్న తమిళ బ్యూటీ ప్రగ్యా నగ్రా