రజినీ 'లాల్ సలామ్' ఫస్ట్ లుక్: ఎప్పుడూ కనిపించని లుక్‌లో సూపర్ స్టార్
'జైలర్' సినిమా తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తన లేటెస్ట్ మూవీ 'లాల్ సలామ్' పై దృష్టి సారించారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను.. చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు.
Lal Salaam: ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తోన్న 'లాల్ సలామ్' చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ పవర్ ఫుల్ క్యామియోలో నటిస్తున్నారనే వార్త అందరికీ తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'మోయిద్దీన్ భాయ్' పాత్రలో రజినీకాంత్ క్యారెక్టర్ పోస్టర్‌ను 'లాల్ సలామ్' బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తోంది.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్స్తున్న లాల్ సలామ్ లో తాజాగా రిలీజైన రజినీకాంత్ పోస్టర్ అందర్నీ ఆకర్షిస్తోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చిన మేకర్స్.. భాయ్ పేరును మే 8న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. చెప్పినట్టుగానే రజినీకాంత్ ఇంట్రస్టింగ్ లుక్ ను విడుదల చేశారు. దాంతో పాటు ఈ సినిమాలో రజినీకాంత్ పేరును కూడా మేకర్స్ వెల్లడించారు. మోయిద్దీన్ భాయ్ అనే పాత్రని రజినీ చేస్తున్నట్లు రివీల్ చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్‌లో రజనీకాంత్ కుర్తా ధరించారు. ఎర్రని క్యాప్, బ్లాక్ గ్లాసెస్, నెరిసిన గెడ్డంతో మోస్ట్ స్టయిలీష్‌గా కనిపిస్తున్నారు. గేట్ వే ఆఫ్ ఇండియా(ముంబయి) వద్ద బ్యాక్ గ్రౌండ్‌లో అల్లర్లు జరుగుతుండగా, అందులో నుంచి రజనీకాంత్ స్టయిల్‌గా నడుచుకుంటూ వస్తున్నారు. అల్లర్లు, హిందూ, ముస్లిం మత ఘర్షణల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కినట్టు తెలుస్తోంది. కంటెంట్ పరంగా చూసుకుంటే ఆమె ఈ సారి కాస్తా సెన్సిటివ్ ఎలిమెంట్స్ ను టచ్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. ఈ సన్నివేశాల్లో రజినీ, ప్రేక్షకుల్ని ఎలా మెప్పిస్తారు.. దాన్ని తెరపై ఎలా చూపిస్తారన్నది తెలియాల్సి ఉంది.
Everyone’s favourite BHAI is back in Mumbai 📍 Make way for #Thalaivar 😎 SuperStar 🌟 #Rajinikanth as #MoideenBhai in #LalSalaam 🫡
— Lyca Productions (@LycaProductions) May 7, 2023
இன்று முதல் #மொய்தீன்பாய் ஆட்டம் ஆரம்பம்…! 💥
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl
🎥… pic.twitter.com/OE3iP4rezK
ప్రముఖ దర్శకుడు నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ 'జైలర్' మూవీని ఇటీవలే కంప్లీట్ చేశారు. ప్రస్తుతం ఆయన లాల్ సలామ్ కోసం డేట్స్ ను లాక్ చేయగా.. స్టార్ దర్శకులతోనే సినిమా తీయాలన్న భావనను పక్కకు నెట్టి టాలెంటెడ్ డైరెక్టర్స్ తో పనిచేయడానికి సిద్ధమయ్యారు. లాల్ సలామ్ తర్వాత రజినీ.. విజయ్ దళపతి 'లియో' డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మూవీలో నటించనున్నట్టు కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దాంతో పాటు తెలుగులో నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో బాబీ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది.
'లాల్ సలామ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రజినీకాంత్.. తన కూతురు డైరెక్షన్ లో రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీపై సాధారణం కంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ లో గడుపుతోన్న ఆయన.. ఒక్కోక్క సినిమాను లైనప్ లో కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. కాగా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. లైకా ప్రొడక్షన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయానికొస్తే.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.