‘నంది’ విమర్శలపై పోసాని ఎదురుదాడి, హిందీ ‘ఛత్రపతి’ ట్రైలర్‌తో వచ్చేసిన బెల్లంకొండ - ఈ రోజు సినీ విశేషాలివే!
‘నంది’ వివాదం మరింత ముదురుతోంది. నిర్మాత అశ్వనీదత్ వ్యాఖ్యలపై పోసాని స్పందించారు. బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’ హిందీ ట్రైలర్ వచ్చేసింది. ఇంకా మరెన్నో విశేషాలను ఇక్కడ చూడండి.
బెల్లంకొండ ‘ఛత్రపతి’ హిందీ ట్రైలర్ రిలీజ్, మాస్ యాక్షన్ తో ఊచకోత!
తెలుగులో ప్రభాస్ హీరోగా, దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఛత్రపతి’. ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలోకి రీమేక్ అవుతోంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాను హిందీలో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పూజా హెగ్డేతో డేటింగ్‌కు వెళ్తా - రాత్రిపూట గోడ దూకేసి వెళ్లిపోయేవాడిని: అఖిల్
బుల్లి తెర టాప్ యాంకర్ సుమ హోస్ట్ చేసే షోలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షోలో పార్టిసిపేట్ చేసే సెలెబ్రిటీలపై అదిరిపోయే పంచులు వేస్తూ షోని రక్తి కట్టిస్తుంది. అలా తాను చేసే షోలలో 'సుమ అడ్డా ' కూడా ఒకటి. ప్రతి వారం సరికొత్త సెలెబ్రిటీలతో ఆడియన్స్ కి ఈ షో ద్వారా మంచి వినోదాన్ని అందిస్తూ ఉంటుంది సుమ. ఇక తాజాగా ఈ వారం ఎపిసోడ్ లో 'ఏజెంట్' మూవీ టీమ్ సందడి చేసింది. హీరో అఖిల్ ,హీరోయిన్ సాక్షి వైద్య ఈ షోలో పాల్గొని నవ్వులు పూయించారు. ఇక అఖిల్ ఈ షోలో సుమ అడిగిన కొన్ని ప్రశ్నలకు ఫన్నీగా ఆన్సర్లు ఇచ్చాడు. ఇక తాజాగా విడుదలైన ఈ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
రజినీకాంత్ వివాదంలో టాలీవుడ్ స్పందనేంటి? ఆయన బెస్ట్ ఫ్రెండ్ మౌనమేలా?
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలతో కాకుండా ఇప్పుడు రాజకీయాలతో వార్తల్లో నిలిచారు. నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రజనీ.. లెజండరీ నటుడి గొప్పదనం గురించి మాట్లాడారు. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. పనిలో పనిగా పక్కనే ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని విజనరీ లీడర్, విజన్ 2047తో ముందుకు సాగుతున్నాడంటూ పొగడ్తల వర్షం కురిపించడమే ఆయన్ను ఓ వర్గం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
మహాబలేశ్వరంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక - ఏం చేస్తున్నారంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న ఫుల్ లెంగ్త్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) They Call Him OG... అనేది ఉపశీర్షిక. ఇందులో ప్రియాంకా అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) కథానాయిక. ప్రస్తుతం వీళ్ళిద్దరూ మహాబలేశ్వరంలో ఉన్నట్లు తెలిసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఉత్తమ రౌడీ కాదు, ఉత్తమ వెన్నుపోటు దారుడు, గురికాడు అవార్డులు ఇవ్వాలి - పోసాని కౌంటర్
నంది పురస్కారాలపై రాజకీయ రంగు పడింది. ఇది ఏమీ కొత్తది కాదు, కానీ కొత్తగా మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా తెలుగు చలన చిత్రసీమ ప్రముఖులు చేసే వ్యాఖ్యలను పరిశ్రమలో కొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారని చెప్పడం సబబు ఏమో! తాజాగా నిర్మాత అశ్వినీదత్ చేసిన కామెంట్లపై పోసాని కృష్ణమురళి స్పందించారు. నంది అవార్డుల వివాదాన్ని మరింత పెద్దది చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)