By: ABP Desam | Updated at : 02 May 2023 12:49 PM (IST)
Image Credit: TDP/Twitter
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలతో కాకుండా ఇప్పుడు రాజకీయాలతో వార్తల్లో నిలిచారు. నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రజనీ.. లెజండరీ నటుడి గొప్పదనం గురించి మాట్లాడారు. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. పనిలో పనిగా పక్కనే ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని విజనరీ లీడర్, విజన్ 2047తో ముందుకు సాగుతున్నాడంటూ పొగడ్తల వర్షం కురిపించడమే ఆయన్ను ఓ వర్గం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొనేలా చేసింది.
విజయవాడ వేదికగా చంద్రబాబు గురించి రజినీ కాంత్ మాట్లాడిన మాటలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికారిక వైఎస్సార్ పార్టీ దారుణమైన విమర్శలు చేస్తోంది. ఆయన అలా మాట్లాడడంపై ఏపీ మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఏపీ రాజకీయాల గురించి ఏం తెలుసని.. పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత రజనీకి లేదని, ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడవడంతో రజినీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు.
చంద్రబాబు గురించి ఎన్టీఆర్ గతంలో మాట్లాడిన వీడియోలను రజినీకాంత్ కు పంపిస్తామని.. ఆయన వ్యాఖ్యలతో దివంగత ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు. ఓ అడుగు ముందుకేసి రజినీ తమిళనాడులో హీరో కావొచ్చుగానీ ఇక్కడ కాదని.. పక్క రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. రజినీని విమర్శించిన వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన రోజా, పోసాని కృష్ణ మురళి వంటి వారు కూడా ఉన్నారు. రజినీ ప్రసంగంపై వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శలు చేస్తుంటే.. ఫ్యాన్స్ , టీడీపీ నాయకులు తలైవాకి మద్దతుగా నిలిచారు. అయితే ఈ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరూ స్పందించకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
రజినీకాంత్ పై విమర్శలు చేసినందుకుగాను, ఆయనకు వైకాపా నేతలు క్షమాపణలు చెప్పాలంటూ అభిమానులు ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్ తో కామెంట్లు పెడుతూ ట్రెండ్ చేశారు. రజినీ ఎవరినీ కించపరచనప్పటికీ అలా ఎలా ట్రోల్ చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు సైతం వైఎస్సార్‌సీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంపై రజనీ చిన్న విమర్శ చేయకపోయినా, వైఎస్సార్‌సీపీ ఆయనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తోందన్నారు. సమాజంలో ఎంతో గౌరవం ఉండే లెజెండరీ పర్సనాలటీపై ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం బాధ కలిగిస్తుందని అన్నారు. అయితే ఇంత జరుగుతున్నా అటు కోలీవుడ్ ప్రముఖులు కానీ, ఇటు టాలీవుడ్ పెద్దలు కానీ ఈ వ్యవహారంపై స్పందించలేదు. రజినీకి చిరకాల మిత్రుడిగా చెప్పుకునే మోహన్ బాబు కూడా సైలెంట్ గా ఉన్నారేంటి? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు రజినీకాంత్ కు మధ్య ఎన్నో ఏళ్ళ నుంచి మంచి అనుబంధం కొనసాగుతోంది. తమ మధ్య ఫ్రెండ్ షిప్ గురించి ఇద్దరూ అనేక సందర్భాల్లో వెల్లడించారు. అయితే ఇప్పుడు రజినీపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నా, మోహన్ బాబు మాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడికి డైలాగ్ కింగ్ ఎందుకు సపోర్ట్ గా నిలవలేదని.. అలా సైలెంట్ గా ఉండటంలో అర్థమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తన స్నేహితుడిని అంత దారుణమైన మాటలు అంటుంటే ఆయన ఎలా తట్టుకోగలుగుతున్నారని అంటున్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో మంచు ఫ్యామిలీకి బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ కుటుంబానికి చెందిన విరానికా రెడ్డిని మంచు విష్ణు పెళ్లి చేసుకున్నాడు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున తండ్రీకొడుకులు ప్రచారం కూడా చేశారు. అందుకే ఇప్పుడు రజినీ వివాదంపై మోహన్ బాబు మౌనం వహిస్తున్నారని ఓ వర్గం నెటిజన్లు అంటున్నారు. ఈ విషయంపై మాట్లాడితే, పరోక్షంగా జగన్ ప్రభుత్వంపై వైసీపీ నాయకులపై కామెంట్స్ చేసినట్లు అవుతుందని నిశబ్దంగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. మిగతా సినీ ప్రముఖులు సైతం ఈ కారణం చేతనే రజినీ కాంత్ వ్యవహారంలో స్పందించడం లేదనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఏపీ మంత్రుల నోటికి టాలీవుడ్ కూడా బెదిరిపోతోందని అర్థమవుతోంది. తోటి నటుడిపై దారుణమైన విమర్శలు చేస్తుంటే మద్దతుగా నిలిచే దమ్ము మన రీల్ హీరోలకు లేదంటూ నెటిజనులు విమర్శిస్తున్నారు.
Also Read: తెలుగులో ఏకైక సూపర్ స్టార్ చిరంజీవి - రజనీపై పోసాని సెటైర్లు
JioCinema: నెట్‌ఫ్లిక్స్, డిస్నీల బాటలో ‘జియో సినిమా’ - ఇక యూనివర్సల్ కంటెంట్‌తో పిచ్చెక్కించేస్తారట!
ముంబై షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న 'నాని 30'
Prabhas Vs Bollywood Heroes : ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?
NTR Workouts For Devara : సెలవుల్లోనూ రెస్ట్ తీసుకొని 'దేవర' - విదేశాల్లో వర్కవుట్స్
Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
Delhi Murder Case: మాట్లాడటం లేదనే ఢిల్లీలో బాలిక హత్య- నేరాన్ని అంగీకరించిన సాహిల్
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !