News
News
వీడియోలు ఆటలు
X

Pawan Kalyan - OG Song Shoot : మహాబలేశ్వరంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక - ఏం చేస్తున్నారంటే?  

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న 'ఓజీ'లో ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయిక అని తెలుసు. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు. 

FOLLOW US: 
Share:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రూపొందుతున్న ఫుల్ లెంగ్త్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) They Call Him OG... అనేది ఉపశీర్షిక. ఇందులో ప్రియాంకా అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) కథానాయిక. ప్రస్తుతం వీళ్ళిద్దరూ మహాబలేశ్వరంలో ఉన్నట్లు తెలిసింది. ఎందుకు అంటే... 

మూడు రోజులు సాంగ్ షూట్!
మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో మూడు రోజుల పాటు పవన్, ప్రియాంక మీద సాంగ్ షూటింగ్ చేయనున్నారని సమాచారం. దీనికి ఆల్రెడీ సంగీత దర్శకుడు తమన్ మాంచి ట్యూన్ అందించారట. సాధారణంగా పవన్ సినిమాల్లో పాటల చిత్రీకరణ ప్రత్యేకంగా ఉంటుంది. పైగా, దర్శకుడు పవన్ అభిమాని కావడంతో ఆ సాంగ్ మరింత ప్రత్యేకంగా ఉండేలా డిజైన్ చేశారట. 

'ఓజీ' చిత్రానికి పవర్ స్టార్ అభిమాని, 'సాహో' ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ ముంబైలో ఓ షెడ్యూల్ చేశారు. అందులో పవన్ పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ (Prakash Raj In OG) కూడా నటిస్తున్నారు. ఆయన కూడా ఇటీవల షూటింగులో జాయిన్ అయ్యారు.

Also Read : ఎన్టీఆర్ 30లో 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్ హీరోయిన్ చైత్ర - రోల్ ఏంటంటే?

పదిహేను సార్లు క్లైమాక్స్ మార్చిన సుజీత్!
షూటింగ్ మొదలైన సందర్భంగా విడుదల చేసిన వీడియోలో క్లైమాక్స్ గురించి సుజీత్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నోటితో నేరుగా ఏదీ చెప్పలేదు. కానీ, వీడియో మీద ఓ లుక్ వేస్తే... క్లైమాక్స్ కోసం చాలా డ్రాఫ్ట్స్ రాసినట్టు ఈజీగా అర్థమైంది. 'క్లైమాక్స్ 15' అని రాసి, చివరకు దాన్ని చెత్తబుట్టలో పడేశారు. అంటే... 15 సార్లు క్లైమాక్స్ చేంజ్ చేశారన్నమాట. చివరకు, 16వ క్లైమాక్స్ ఓకే చేసినట్టు తెలుస్తోంది. వీడియో ప్రారంభంలో ఓ సీన్ పేపర్ వస్తుంది. ఒక ప్రయివేట్ పోర్టులో, ఒక పెద్ద ఐరన్ గేటు ముందు, పోర్టులో ఎంటర్ అయ్యే దారిలో వందల మంది గన్నులతో నిలబడతారు. అందులో ఇద్దరి పేర్లు డంగి, ఫైజల్! ఇక్కడికి రావాలని అనుకుంటే వాడి కంటే మూర్ఖుడు ఉండదని డంగి అంటాడు.

Also Read : అఖిల్‌ను మళ్ళీ రీ లాంచ్ చేయాల్సిందేనా... ఆర్‌సీబీ కప్పు, అఖిల్ హిట్ కొట్టడం కలేనా? - ఇంత దారుణమైన ట్రోల్స్ చూసి ఉండరు!

బుల్లెట్ సౌండ్ వినిపించడంతో డంగి, ఫైజల్... ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు. వాళ్ళ ముందు ఓ స్మోక్ బాంబ్ పడుతుంది. ఆ పొగ లోంచి ఓ మనిషి రూపం కనబడుతుంది. నల్ల మబ్బులు కమ్మిన ఆకాశం లోనుంచి ఓ మెరుపు వచ్చినట్లు వస్తాడు. ఇదీ సీన్! ముంబైలో హీరో ఇంట్రడక్షన్ అనుకుంట! ఇది పవర్ స్టార్ అభిమానులకు కిక్ ఇచ్చేలా ఉంది.

వీడియోలో వినిపించిన తమన్ సంగీతం సైతం సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునే అంశాలు అన్నీ సినిమాలో ఉన్నట్టు అర్థం అవుతోంది. ముఖ్యంగా సుజీత్ ఈ వీడియోను తీసిన విధానం చాలా మందిని ఆకట్టుకుంది. బాల్ బాంబ్ కావడం, పెన్సిల్స్ బుల్లెట్స్ అవ్వడం, స్కేల్ జపనీస్ స్వార్డ్ కింద మారడం చూస్తుంటే... సినిమాలో ఎన్ని ఫైట్స్ ఉన్నాయనేది, పవన్ కళ్యాణ్ ఎన్ని వెపన్స్ వాడతారనేది ఈజీగా అర్థం అవుతోంది. 

Published at : 02 May 2023 10:32 AM (IST) Tags: Priyanka arul mohan Pawan Kalyan they call him og OG Movie Mahabaleshwar

సంబంధిత కథనాలు

Ponniyin Selvan 2 on OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియన్ సెల్వన్ 2' - ఇక నుంచి ఫ్రీగా చూడొచ్చు!

Ponniyin Selvan 2 on OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'పొన్నియన్ సెల్వన్ 2' - ఇక నుంచి ఫ్రీగా చూడొచ్చు!

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

విడుదలకు ముందే రూ.400 కోట్లు రాబట్టిన ‘ఆదిపురుష్’? - ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

విడుదలకు ముందే రూ.400 కోట్లు రాబట్టిన ‘ఆదిపురుష్’? - ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!

కీర్తి సురేష్‌కు టాలీవుడ్ షాక్ - శ్రీలీలా ఎఫెక్ట్‌తో కోలీవుడ్‌కు జంప్!

Rakul Preet Singh: సినిమాల్లో ఫెయిలైతే అదే చేద్దామనుకున్నా, తన ‘ప్లాన్-బి’ రివీల్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: సినిమాల్లో ఫెయిలైతే అదే చేద్దామనుకున్నా, తన ‘ప్లాన్-బి’ రివీల్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!