By: ABP Desam | Updated at : 02 May 2023 03:42 PM (IST)
Edited By: anjibabuchittimalla
ఛత్రపతి హిందీ ట్రైలర్(Photo Credit: Pen Movies/YouTube)
తెలుగులో ప్రభాస్ హీరోగా, దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘ఛత్రపతి’. ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలోకి రీమేక్ అవుతోంది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాను హిందీలో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చా కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
Aa raha hai, CHATRAPATHI!🔥
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) May 2, 2023
Written by #VijayendraPrasad, directed by #VVVinayak#Chatrapathi in cinemas on 12th May.@Nushrratt @bhagyashree123 @SharadK7 @PenMovies #JayantilalGada #PenStudios #PenMarudhar #TanishkBagchi @TimesMusicHub#SreenivasBellamkonda #Bss9 https://t.co/oEKHwn8CtN
ఈ ట్రైలర్ లో అదిరిపోయే యాక్షన్ సీన్లతో నిండిపోయింది. తెలుగులో ప్రభాస్ యాక్టింగ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా బెల్లకొండ శ్రీనివాస్ కష్టపడ్డారు. ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ పవర్ ప్యాక్డ్ గా రూపొందింది. యాక్షన్ సీన్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఫైటింగ్స్, యాక్షన్ లాంటి సన్నివేశాల్లో బెల్లంకొండ అదుర్స్ అనిపించాడు. ఈ ట్రైలర్ తో ‘ఛత్రపతి’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తెలుగులో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అదే తరహాలో బెల్లంకొండకు హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.
ఇక హిందీలో 'ఛత్రపతి' కోసం బెల్లంకొండ తన బాడీ షేప్ ను పూర్తిగా మార్చేశారు. తెలుగులో ప్రభాస్ ఏ విధంగా అయితే కండలతో, ఫిట్ గా కనిపించాడో అదే తరహాలో పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు. ఇక ఈ సినిమా టీజర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేయకముందే ‘దసరా’ మూవీ సందర్భంగా థియేటర్లలో ప్లే చేసిన యాడ్ స్పేస్ లో ఈ మూవీ టీజర్ ను ప్లే చేశారు.
మే 12న 'ఛత్రపతి' విడుదల
18 ఏళ్ల కిందట టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన 'ఛత్రపతి' ఇప్పుడు హిందీలో రిమేక్ అవుతుండడంతో సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాతో హిందీలోకి అడుగుపెడుతున్నాడు. ఈ మూవీని సమ్మర్ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందు తీసుకురానున్నట్టు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. సాహిల్ వైద్, అమిత్ నాయర్, రాజేంద్ర గుప్తా, శివం పాటిల్, స్వప్నిల్, ఆశిష్ సింగ్, మహమ్మద్ మోనాజీర్, ఔరోషికా డే, వేదిక, జాసన్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను, పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతి లాల్ నిర్మిస్తున్నారు .
హిందీలో ఓ రేంజిలో ఫాలోయింగ్
బెల్లంకొండ శ్రీనివాస్ కు హిందీలో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన హిందీ డబ్ సినిమాలకు మిలియన్ల వ్యూస్ వస్తాయి. అందుకే అతని సినిమాలు అన్నీ హిందీలో కూడా డబ్ చేస్తారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ నటించిన ‘జయ జానకి నాయక’ సినిమాను కూడా హిందీలో డబ్ చేశారు. ఈ మూవీకి హిందీలో ఏకంగా 700 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
Read Also: ‘విరూపాక్ష‘ హిందీ ట్రైలర్ చూశారా? రిలీజ్ ఈ వారమే!
మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!
Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ
సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!
Arjun Kapoor-Malaika Arora: బెడ్పై అర్ధనగ్నంగా బాయ్ ఫ్రెండ్ - మలైకా అరోరాపై మండిపడుతున్న నెటిజన్స్!
‘బిచ్చగాడు’ పెద్ద మనసు - క్యాన్సర్ రోగులకు విజయ్ ఆంటోని గుడ్ న్యూస్
Andhra News : జీతం బకాయిల కోసం ఆత్మహత్యాయత్నం - ఏపీలో విషాదం !
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!
చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు
Karnataka Accident: కర్ణాటకలో ఘోరం, 10 మంది దుర్మరణం - నలుగురు అక్కడికక్కడే మృతి