‘మళ్లీ పెళ్లి’పై కోర్టుకెక్కిన రమ్య, ‘విరూపాక్ష’లో విలన్ శ్యామలా? - ఇంకా మరెన్నో సినీ విశేషాలు ఇక్కడ చూడండి
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
'విరూపాక్ష'లో విలన్‌ను మార్చేసిన సుకుమార్ - ఆ యాంకర్‌కు ఛాన్స్ మిస్!
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'విరూపాక్ష' (Virupaksha Movie). ఇందులో మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయిక. ఆమెను హీరోయిన్ అనడం కంటే విలన్ అనడం కరెక్ట్ ఏమో! వంద కోట్ల వసూళ్ళను రాబట్టిన చిత్రమిది. ఈ సినిమా పతాక సన్నివేశాల్లో సంయుక్త పాత్రకు ఇచ్చిన ట్విస్ట్ చూసి ప్రేక్షకుల దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. అయితే... దర్శకుడు కార్తీక్ వర్మ దండు తొలుత రాసుకున్న కథలో విలన్ ఆమె కాదట! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
'మేమ్ ఫేమస్' అద్భుతమైన సినిమా - ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన మహేష్ బాబు!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతర హీరోల సినిమాలను, మంచి కంటెంట్ తో రూపొందే చిత్రాలను ప్రశంసించడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనే తేడా చూపకుండా, తనకు నచ్చితే ప్రతీ చిత్రాన్ని సోషల్ మీడియా వేదికగా అభినందిస్తుంటారు. తనకు నచ్చిన అంశాలేంటో చెప్పి, మూవీకి మరింత బజ్ తీసుకొస్తారు. ఇప్పుడు తాజాగా 'మేమ్ ఫేమస్' సినిమా చూసిన మహేశ్.. ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
నా పిల్లలకు పెళ్లి చెయ్యను - ఆర్జీవీ ఏం చేసినా ఆయనకే నా సపోర్ట్: దర్శకుడు తేజ
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు రెండో కొడుకు అభిరామ్ హీరోగా, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అహింస’. గీతిక తివారీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సదా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాతో రానా సోదరుడు అభిరామ్ వెండి తెరకు హీరోగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచి రకరకాల ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు రెడీ అవుతోంది. జూన్ 2న ఈ సినిమా విడుదల కానుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
కోర్టుకు ఎక్కిన నరేష్ మూడో భార్య - 'మళ్ళీ పెళ్లి' విడుదలపై స్టే ఇవ్వాలని విజ్ఞప్తి
నవరస రాయ డా. నరేష్ విజయ కృష్ణ (Naresh VK) వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. 'మళ్ళీ పెళ్లి' విడుదలపై స్టే ఇవ్వాలని కోరుతూ ఆయన మూడో భార్య రమ్యా రఘుపతి (Ramya Raghupathi) హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా ఆ సినిమా తీశారని ఆమె పేర్కొన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
శరత్ బాబు ఆస్తులకు వారసులు ఎవరు? వీలునామాలో ఏం రాశారు?
దాదాపు ఐదు దశాబ్దాలు సినీ ప్రస్థానం కొనసాగించిన సీనియర్ నటుడు శరత్ బాబు.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రతి నాయకుడిగా వెండి తెరపై ప్రేక్షకులను అలరించారు. కేవలం తెలుగులోనే కాకుండా, ఇతర భాషల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి నటుడు ఇటీవలే కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో శరత్ బాబు వ్యక్తిగత విషయాలు, ఆస్తిపాస్తులు, వారసుల గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తమ్ముడు ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ, ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)