అన్వేషించండి

‘టిల్లు స్క్వేర్’ రివ్యూ, ‘ప్రతినిధి 2’ టీజర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
'డీజే టిల్లు' విడుదలకు ముందు సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. టిల్లన్న క్యారెక్టర్ ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. సర్ ప్రైజ్ అయ్యారు. బాక్సాఫీస్ బరిలో సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు టిల్లు ఎలా బిహేవ్ చేస్తాడు? ఎలా మాట్లాడతాడు? అనేది ప్రేక్షకులకు తెలుసు. సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' మీద అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తోడు హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ యాడ్ కావడంతో అంచనాలు పెరిగాయి. మరి, సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రామ్‌ చరణ్‌ సినిమాలో సుకుమార్‌ హ్యాండ్‌! - అతిథి పాత్ర కూడా, నిజమెంత?
సుకుమార్‌ శిష్యుడు, 'ఉప్పెన' డైరెక్టర్‌ బుచ్చిబాబు సాన రెండో సినిమాకే ఏకంగా గ్లోబర్‌ స్టార్‌తో జతకట్టాడు. రామ్‌ చరణ్‌తో ‘RC16’ అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ అట్టహాసం పూజ కార్యక్రమాన్ని కూడా జరుపుకుంది. ఇక రెగ్యూలర్‌ షూటింగ్‌ మొదలు కావాల్సి ఉంది. అయితే ఈ మూవీ పూజ కార్యక్రమంలో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈయనే కాదు అల్లు అరవింద్‌తో పాటు పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. అయితే ఇందులో సుకుమార్‌ సందడి చూసి అంతా ఆరా తీస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ టీజర్ - ఓటు వేయడం కుదరకపోతే చచ్చిపోండి, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చుతారు?
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎంతోమంది దర్శకులుగా పరిచయం అవుతున్నారు. తాజాగా జర్నలిస్ట్ మూర్తి కూడా ‘ప్రతినిధి 2’ సినిమాతో డైరెక్టర్‌గా మారారు. ఒకప్పుడు ‘ప్రతినిధి’లాంటి పొలిటికల్ థ్రిల్లర్‌తో అందరినీ ఆకట్టుకున్న నారా రోహిత్... సీక్వెల్‌లో కూడా హీరోగా నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత రోహిత్ ఈ మూవీతో రి-ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో అంచనాలు పెరిగిపోయాయి. శుక్రవారం విడుదలైన ‘ప్రతినిధి 2’ టీజర్‌ అంచనాలను మరింత పెంచేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

విజయ్ దేవరకొండ స్పెషల్ ఆఫర్ - వారందరికీ లీటర్ పెట్రోల్ ఫ్రీ, తిరుపతిలో ‘ఫ్యామిలీ స్టార్’ హల్‌చల్
‘ఫ్యామిలీ స్టార్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం విజయ్ దేవరకొండ తిరుపతికి వస్తున్నాడని తెలియగానే చాలామంది ఫ్యాన్స్ బైక్ ర్యాలీని ఏర్పాటు చేశారు. ఆ విషయాన్ని విజయ్ దేవరకొండ తన స్పీచ్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ‘‘నాకోసం బైక్‌పై వచ్చిన ఫ్యాన్స్ అందరికీ లీటర్ పెట్రోల్ కచ్చితంగా కొట్టించాలి. నేను తిరుపతి డిస్ట్రిబ్యూటర్‌ను రిక్వెస్ట్ చేస్తున్నాను. బైక్ మీద వచ్చిన బాయ్స్ అందరికీ మా తరపున లీటర్ పెట్రోల్ ప్లీజ్’’ అని విజయ్ అన్నాడు. దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. ఎప్పుడు ఫ్యాన్స్‌ను కలిసినా వారికి ఏదో ఒక ఆఫర్ ఇచ్చే విజయ్.. ఈసారి పెట్రోల్ ఫ్రీగా ఇస్తానని ప్రకటించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘యానిమల్ పార్క్’ మొదలయ్యేది అప్పుడే - మూవీలో కొత్తగా ఎంట్రీ ఇచ్చే నటీనటులు వీరే
సినీ పరిశ్రమలో సీక్వెల్స్ క్రేజ్ నడుస్తోంది. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా ముందుగానే దాని సీక్వెల్స్‌ను ప్రకటించేస్తున్నారు మేకర్స్. అలాగే గతేడాది విడుదలయిన ‘యానిమల్’కు కూడా సీక్వెల్ ఉంటుందని, సీక్వెల్ మాత్రమే కాదు.. ఇదొక ఫ్రాంచైజ్‌లాగా తెరకెక్కిస్తానని సందీప్ రెడ్డి వంగా ఎప్పుడో ప్రకటించాడు. అయితే ‘యానిమల్’ను ఒక రేంజ్‌లో ఇష్టపడిన ప్రేక్షకులు.. దాని సీక్వెల్ అయిన ‘యానిమల్ పార్క్’ కోసం అప్పుడే ఎదురుచూపులు మొదలుపెట్టారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్‌కు సంబంధించిన రూమర్స్ బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Embed widget