అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్, విజయ్‌తో మళ్లీ త్రిష - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.
అట్లీతో అల్లు అర్జున్ సినిమా ఫిక్స్ - అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు?
'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా అంతకుమించి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రజెంట్ అల్లు అర్జున్ లైనప్ లో పాన్ ఇండియా డైరెక్టర్స్ ఉన్నారు. ఈ ఏడాది 'పుష్ప 2'తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న బన్నీ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీతో చేయబోతున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. గత ఏడాది 'జవాన్' సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సత్తా చాటిన అట్లీ.. ఈసారి బన్నీతో అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించబోతుండడంతో బన్నీ - అట్లీ కాంబినేషన్ పై ఫ్యాన్స్, ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ ప్రాజెక్టు కి సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
సమంతపై డాక్టర్ సంచలన కామెంట్స్ - ఆమెను నమ్మకండి, అదంతా అబద్దం.. షాకింగ్ పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత పాడ్‌కాస్ట్ ప్రజలను తప్పుదొవ పట్టించేలా ఉందని, ఎలాంటి అవగాహన లేకుండానే ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కాలేయ నిపుణులు మండిపడ్డారు. సమంత పాడ్‌కోస్ట్ వీడియోను ట్యాగ్ చేసి ఈ మేరకు ఆయన తన ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు. ది లివర్ డాక్టర్(TheLiverDoc) ప్రస్తుతం ఆయన ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. కాగా సమంత రీఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అంతకుముందే సమంత పాడ్‌కాస్ట్‌తో పలకిరించింది. దీని ద్వారా ప్రజల్లో హెల్త్ అవేర్ నెస్ పెంచుతుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘నువ్వు నేను’ షూటింగ్‌లో మమ్మల్ని సరిగా చూసుకోలేదు - హీరోయిన్ అనిత షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఎవర్‌గ్రీన్ సినిమాలు ఎన్నిసార్లు రీ రిలీజ్ అయినా ప్రేక్షకులు చూస్తారు అనే భావనలో మేకర్స్ ఉన్నారు. అలా ఎన్నో చిత్రాలను రీ రిలీజ్ చేసి హ్యాపీ చేసిన మేకర్స్.. త్వరలోనే ఉదయ్ కిరణ్ సినిమాలను కూడా రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో ముందుగా ‘నువ్వు నేను’ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమయ్యింది. ఇప్పటికీ హీరో ఉదయ్ కిరణ్ అంటే చాలామందికి ఇష్టం. తన సినిమాలు, పాటలను ప్రత్యేకంగా ఇష్టపడే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తనతో కలిసి నటించిన ‘నువ్వు నేను’ రీ రిలీజ్‌కు సిద్ధమవుతుండగా.. హీరోయిన్ అనిత ఒక వీడియో ద్వారా స్పందించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ధనుష్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు - అతడి తల్లిదండ్రులు వాళ్లేనా?
తమిళ అగ్రహీరో ధనుష్ కు సంబంధించిన కేసు విషయంలో మద్రాసు హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 8 ఏండ్లుగా కొనసాగుతున్న ఈ కేసుకు ఫుల్ స్టాఫ్ పెట్టింది. ధనుష్ తమ కొడుకే అని పేర్కొంటూ మేలూర్ కోర్టులో కదిరేశన్ దంపతులు దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ధనుష్ వారి కొడుకు అని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవంటూ కేసును డిస్మిస్ చేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'లియో' కాంబో రిపీట్ - విజయ్‌తో మరోసారి జత కడుతున్న త్రిష
కోలీవుడ్ అగ్ర హీరో తలపతి విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం విజయ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే రాజకీయ ఆరంగేట్రం కంటే ముందు విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గోట్' అనే సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 'గోట్' తర్వాత ఒకే ఒక్క ప్రాజెక్టు చేసి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నాడు. ఇలాంటి తరుణంలో విజయ్ నటిస్తున్న 'గోట్' సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)