అన్వేషించండి

Trisha: 'లియో' కాంబో రిపీట్ - విజయ్‌తో మరోసారి జత కడుతున్న త్రిష

Vijay: తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న 'గోట్' సినిమాలో కోలీవుడ్ బ్యూటీ త్రిష ఓ క్యామియో రోల్ చేస్తున్నట్లు సమాచారం.

Trisha in Vijay’s The Greatest of All Time : కోలీవుడ్ అగ్ర హీరో తలపతి విజయ్ ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే తన పార్టీ పేరును అధికారికంగా ప్రకటించి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం విజయ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నాడు. అయితే రాజకీయ ఆరంగేట్రం కంటే ముందు విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గోట్' అనే సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 'గోట్' తర్వాత ఒకే ఒక్క ప్రాజెక్టు చేసి సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పనున్నాడు. ఇలాంటి తరుణంలో విజయ్ నటిస్తున్న 'గోట్' సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది.

విజయ్ 'గోట్'లో త్రిష

దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న 'గోట్' సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో తలపతి విజయ్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చెన్నై బ్యూటీ త్రిష కూడా నటిస్తున్నట్లు తెలిసింది. ఎన్నో ఏళ్ల తర్వాత గత ఏడాది వచ్చిన 'లియో' సినిమాలో కలిసి నటించిన ఈ జంట ఇప్పుడు మరోసారి 'గోట్' సినిమాలో సందడి చేయనున్నట్లు చెబుతున్నారు. ఇందులో త్రిష ఓ స్పెషల్ క్యామియో రోల్ చేస్తుందని, ఇప్పటికే ఆమె భాగానికి సంబంధించి చిత్రీకరణ కూడా పూర్తయిందని కోలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే మూవీ టీం నుంచి ఇంకా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

జూన్‌లో రిలీజ్

కోలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకట్ ప్రభు గత ఏడాది అక్కినేని నాగచైతన్యతో 'కస్టడీ' అనే సినిమాని తెరకెక్కించగా.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈసారి తలపతి విజయ్ తో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు కోసం భారీ బడ్జెట్ తో పాటు స్టార్ కాస్ట్ ని ఎంచుకున్నాడు. ఈ సినిమాలో దళపతి విజయ్, మీనాక్షి చౌదరి తో పాటు మలయాళ సీనియర్ నటుడు జయరాం, స్నేహ, లైలా, యోగి బాబు, VTV గణేష్, అజ్మల్ అమీర్, మిక్ మోహన్, ప్రభుదేవా, వైభవ్, అరవింద్ ఆకాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని జూన్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని AGS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అర్చన కళాపతి, కళాపతి ఎస్ గణేష్, కళాపతి ఎస్ సురేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read : ఆలియాకు రాజమౌళి ఇచ్చిన సలహా ఇదేనట - మరి మన స్టార్స్ ఫాలో చేస్తారా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: విల్‌ జాక్స్‌ శతక గర్జన, బెంగళూరు ఘన విజయం
విల్‌ జాక్స్‌ శతక గర్జన, బెంగళూరు ఘన విజయం
Shadnagar Incident: సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Priyanka - Shiv: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
Andhra Pradesh: ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్! కరకట్ట కమల్ హాసన్ ఆర్కే- మంగళగిరిలో నారా లోకేష్ సెటైర్లు
ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్! కరకట్ట కమల్ హాసన్ ఆర్కే- మంగళగిరిలో నారా లోకేష్ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

YS Sharmila on YS Jagan |YSRపేరు  ఛార్జిషీట్ లో పెట్టించిన పొన్నవోలుకు పదవి ఇస్తావా అన్న..!Eatala Rajendar Interview | Malkajgiri MP Candidate | ఫోన్ ట్యాపింగ్ పై మీ అభిప్రాయమేంటీ | ABPEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPBJP MP Candidate Madhavilatha | పదవులు వచ్చినా..రాకపోయినా... పాతబస్తీలోనే ఉంటానంటున్న మాధవిలత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: విల్‌ జాక్స్‌ శతక గర్జన, బెంగళూరు ఘన విజయం
విల్‌ జాక్స్‌ శతక గర్జన, బెంగళూరు ఘన విజయం
Shadnagar Incident: సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
సాహస బాలుడు సాయిచరణ్‌ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Priyanka - Shiv: హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న ప్రియాంక, శివ్ - మనసు మార్చుకోవడానికి కారణం అదేనా?
Andhra Pradesh: ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్! కరకట్ట కమల్ హాసన్ ఆర్కే- మంగళగిరిలో నారా లోకేష్ సెటైర్లు
ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకున్న జగన్! కరకట్ట కమల్ హాసన్ ఆర్కే- మంగళగిరిలో నారా లోకేష్ సెటైర్లు
IPL 2024: ముంబై ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టం,  ఇక ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిందే
ముంబై ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టం, ఇక ప్రతీ మ్యాచ్‌ గెలవాల్సిందే
HBD Samantha Ruth Prabhu: ఫ్యాన్స్‌కు సమంత బర్త్ డే సర్‌ప్రైజ్: అప్‌కమింగ్ మూవీ పోస్టర్ రిలీజ్ - హౌజ్ వైఫ్ పాత్రలో వైల్డ్​గా కనిపిస్తున్న సామ్
ఫ్యాన్స్‌కు సమంత బర్త్ డే సర్‌ప్రైజ్: అప్‌కమింగ్ మూవీ పోస్టర్ రిలీజ్ - హౌజ్ వైఫ్ పాత్రలో వైల్డ్​గా కనిపిస్తున్న సామ్
Hand Model: ఆమె చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది, హ్యాండ్ మోడలింగ్‌తో లక్షల్లో సంపాదన
Hand Model: ఆమె చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది, హ్యాండ్ మోడలింగ్‌తో లక్షల్లో సంపాదన
Andhra Pradesh: వాళ్లని తొక్కిపడేయండి, పాపం చేసిన వాళ్లని వదలొద్దు - బ్రదర్‌ అనిల్‌ సంచలన వ్యాఖ్యలు
వాళ్లని తొక్కిపడేయండి, పాపం చేసిన వాళ్లని వదలొద్దు - బ్రదర్‌ అనిల్‌ సంచలన వ్యాఖ్యలు
Embed widget